Viralyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/viral/127/under-world-don-chota-rajan-photo-on-postal-stamp6942ef7d-b053-40e9-a7bf-94f23b864bba-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/viral/127/under-world-don-chota-rajan-photo-on-postal-stamp6942ef7d-b053-40e9-a7bf-94f23b864bba-415x250-IndiaHerald.jpgపోస్టర్ స్టాంపులపై ఎలాంటి ఫోటోలు ఉంటాయి..? దేశం కోసం పోరాడిన యోధులు, గాంధీ, నేతాజీ, నెహ్రూ వంటి గొప్ప వ్యక్తుల ఫోటోలు ఉంటాయి. వీరితో పాటు అరుదైన మొక్కలు, చెట్లు, పక్షులు, జంతువులు ప్రదేశాల బొమ్మలూ ఉంటాయి. అయితే ఉత్తర ప్రదేశ్‌లోని ఓ పోస్టాఫీసు మాత్రం దీనికి భిన్నంగా ఓ విచిత్రమైన పని చేసింది. అదేంటంటే పోస్టల్ స్టాంపుపై...postal stamp;munna;munna producer;mohandas karamchand gandhi;indian postal service;local language;posters;central government;indian;lucknowపోస్టల్ స్టాంపులపై అండర్ వరల్డ్ డాన్.. ఇదేందయ్యా ఇది..!పోస్టల్ స్టాంపులపై అండర్ వరల్డ్ డాన్.. ఇదేందయ్యా ఇది..!postal stamp;munna;munna producer;mohandas karamchand gandhi;indian postal service;local language;posters;central government;indian;lucknowMon, 28 Dec 2020 19:56:00 GMTలక్నో: పోస్టర్ స్టాంపులపై ఎలాంటి ఫోటోలు ఉంటాయి..? దేశం కోసం పోరాడిన యోధులు, గాంధీ, నేతాజీ, నెహ్రూ వంటి గొప్ప వ్యక్తుల ఫోటోలు ఉంటాయి. వీరితో పాటు అరుదైన మొక్కలు, చెట్లు, పక్షులు, జంతువులు ప్రదేశాల బొమ్మలూ ఉంటాయి. అయితే ఉత్తర ప్రదేశ్‌లోని ఓ పోస్టాఫీసు మాత్రం దీనికి భిన్నంగా ఓ విచిత్రమైన పని చేసింది. అదేంటంటే పోస్టల్ స్టాంపుపై మహానుభావుల ఫోటోలకు బదులుగా ఏకంగా గ్యాంగ్‌స్టర్ల ఫొటోలనే ముద్రించింది. ప్రస్తుతం ఈ పోస్టల్ స్టాంపునకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే ‘మై స్టాంప్’పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా పోస్టాఫీసులు తమకు తెలిసిన గొప్ప వ్యక్తులు, మంచి ఫోటోలను తమ పోస్టల్ స్టాంపులపై ముద్రించుకోవచ్చు. అయితే  యూపీలోని కాన్పూర్‌కు చెందిన ఓ పోస్టల్ విభాగం మాత్రం మామూలు ఫోటోలు ముద్రిస్తే మజా ఏముంటుందిలే..! అనుకుందో.. ఏమో..! ఏకంగా గ్యాంగ్‌స్టర్ల ఫోటోలనే పోస్టల్ స్టాంపులపై ముద్రించి దేశం మొత్తానికీ షాక్ ఇచ్చింది. అక్కడి సిబ్బంది చేసిన ఘనకార్యతో పోస్టల్ విభాగంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఇంతకీ అక్కడి సిబ్బంది ముద్రించింది ఎవరి ఫోటోలనో తెలుసా..? అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్, గ్యాంగ్‌స్టర్ మున్నా బజ్‌రంగీల ఫొటోలను. వీరి ఫోటోలను పోస్టల్ స్టాంపులపై చూసిన ప్రజలు ఒక్కసారిగా షాక్ తిన్నారు. స్టాంపులు ముద్రిస్తున్న సమయంలో జరిగిన పొరపాటు వల్లే ఇలా జరిగిందని, దీనిపై దర్యాప్తు జరుగుతోందని స్థానిక పోస్టల్ విభాగం ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

‘కస్టమర్ల ఫొటోగ్రాఫ్‌, కొన్ని వ్యవస్థల లోగోలు ఆర్ట్ వర్క్ ఇమేజ్‌లు, చారిత్రక నగరాలు, అడవికి సంబంధించిన చిత్రాలు, జంతువుల-పక్షుల ఫొటోలు, ఇతర ఎన్నో చిత్రాలు మా వద్ద ఉన్నాయి. వాటిని సెలెక్ట్ చేసే క్రమంలో ఈ పొరపాటు జరిగింద’ని, దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని ఆ అధికారి తెలిపారు. ఏది ఏమైనా అండర్ వరల్డ్ డాన్‌ల ఫోటోలతో స్టాంపులు ముద్రించడం, వాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం సాధారణ విషయం కాదు. మరి దీనికి బాధ్యులైన వారికి ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందో చూడాలి.




దేవినేని ఎఫెక్ట్: బెజవాడ పాలిటిక్స్‌లో టర్నింగ్ పాయింట్..

ఫ్లాష్‌బ్యాక్: ఆ హీరోయిన్‌కు బ్లాంక్‌ చెక్ ఆఫర్ చేసిన రామోజీరావు

లారెన్స్ ‘కాంచన’ చూశారా.. ఈమె రియల్ కాంచన.. ఒక్కటే తేడా!

భారత్ లో పెరుగుతున్న కరోనా...కొత్త స్ట్రెయిన్ టెన్షన్...?

పోలీసులు జగన్ ని ఇబ్బంది పెడతారా...?

అదే జరిగితే టీడీపీకి సినిమానే...?

మీ సి‌ఎం సాబ్ కు చెప్పండి.." వకీల్ సాబ్ " చెప్పాడని..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>