Viralyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/fingerprints093a470c-72ca-4bb7-a1c0-45666e00be7f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/fingerprints093a470c-72ca-4bb7-a1c0-45666e00be7f-415x250-IndiaHerald.jpgడెర్మటాగ్లిఫ్స్.. తి వేళ్లపై సుడులు తిరిగుతూ ఉండే ఈ రేఖలు. వీటినే వేలిముద్రలని కూడా అంటారు. అంటే ప్రపంచంలో ప్రతి వ్యక్తికీ ఈ వేలి ముద్రలు ఉంటాయి. ఈ వేలి ముద్రలు వారి ఐడెంటిటీని... fingerprints;bangladesh;smart phone;police;cycle;biometric;fatherచేతి వేలి ముద్రలు లేని ఏకైక కుటుంబం.. ఎక్కడుందో తెలుసా..?చేతి వేలి ముద్రలు లేని ఏకైక కుటుంబం.. ఎక్కడుందో తెలుసా..?fingerprints;bangladesh;smart phone;police;cycle;biometric;fatherMon, 28 Dec 2020 15:02:10 GMT
ఒకవేళ ఎవరికైనా వేలిముద్రలు లేకపోతే వారి పరిస్థితేంటి..? వారిని ఐడెంటిటీని ఎలా గుర్తించాలి..? ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే బంగ్లాదేశ్‌లోని అధికారులకు ఎదురవుతోంది. ఆ దేశానికి చెందిన అపు సర్కార్ కుటుంబంలో పురుషులకు వేలిముద్రలు ఉండవు. వీరి చేతి వేళ్లు ఎలాంటి గీతలు, రేఖలు లేకుండా నునుపు తేలి ఉంటాయి. ఓ అరుదైన జన్యు పరివర్తన వల్ల వీరు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు వైద్యుల చెబుతున్నారు.

22 ఏళ్ల అపు సర్కార్ ఉత్తర బంగ్లాదేశ్‌లోని రాజ్‌షాహి జిల్లాలో తన కుటుంబంతో నివశిస్తున్నాడు.. ఆయన తాత, తండ్రి వ్యవసాయం చేసేవారు. అపు ఈ మధ్యకాలం వరకు మెడికల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేసేవాడు. ఆపు తాతల కాలంలో వేలిముద్రలు లేకపోవడం వల్ల పెద్ద సమస్య కాకపోయి ఉండొచ్చు. అప్పట్లో సంతకం చేయడం రాకపోతే వేలిముద్రలు తీసుకునేవారు. కానీ, ఇప్పుడు మనకు సంబంధించిన బయోమెట్రిక్ డేటా సేకరించేటప్పుడు కచ్చితంగా మన వేలిముద్రలను తీసుకుని భద్రపరుస్తున్నారు.

పాస్‌పోర్ట్ కావాలన్నా, లైసెన్స్ కావాలన్నా చివరికి స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేయాలన్నా కూడా ఇప్పుడ ఈ ఫింగర్ ప్రింట్ ఎంతో అవసరం. మరి ఇది లేకపోతే ఎలా..? ఫింగర్ ప్రింట్స్ లేకపోవడం వల్ల ఆ కుటుంబానికి అంత అనేక సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం పథకాలు పొందాలంటే వారికి ఎక్కడలేని తలనెప్పులు వచ్చిపడుతున్నాయి.

బంగ్లాదేశ్ ప్రభుత్వం 2008లో వయోజనులందరికీ నేషనల్ ఐడీ కార్డులను ప్రవేశపెట్టింది. ఈ కార్డుల మీద వేలిముద్ర తప్పనిసరిగా ఉండాలి. అపు వాళ్ల నాన్న అమల్ సర్కార్‌కు వేలి ముద్రలు లేకపోవడంతో పెద్ద చిక్కొచ్చి పడింది. చివరకు, కార్డు మీద 'నో ఫింగర్‌ప్రింట్' అని రాసి ఇచ్చారు.

2010లో పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ తదితర ముఖ్యమైన పత్రాలన్నిటికీ వేలిముద్రలు సేకరించడం తప్పనిసరి చేశారు. ఎన్నో ప్రయత్నాల తరువాత, ఒక మెడికల్ సర్టిఫికెట్ సహాయంతో అమల్ పాస్‌పోర్ట్ పొందగలిగారు. అయితే, ఇప్పటివరకూ ఆయన ఈ పాస్‌పోర్ట్ వాడలేదు. ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ వేలిముద్రల సమస్య వస్తుందని భయపడి ఎప్పుడూ విమానంలో ప్రయాణించలేదు. పాస్‌పోర్ట్ పొందగలిగారు కానీ డ్రైవింగ్ లైసెన్స్ మాత్రం దొరకలేదు.

"నేను ఫీజు కట్టాను, డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయ్యాను. అయినా నాకు లైసెన్స్ కార్డు ఇవ్వలేదు. నాకు వేలిముద్రలు లేవు కాబట్టి లైసెన్స్ కార్డు మంజూరు చేయలేమని అధికారులు చెప్పారు" అని అమల్ తెలిపారు.

కానీ, అమల్ వ్యవసాయ పనులకోసం మోటార్‌ సైకిల్ వాడాల్సి ఉంటుంది. లైన్సెస్ కోసం కట్టిన ఫీజు రసీదు జేబులో పెట్టుకుని బండి నడుపుతుంటారు. కానీ ఎక్కడైనా పోలీసులకు చిక్కితే ఫైన్ వేస్తుంటారు. ఫీజు రసీదు చూపించి, చేతి వేళ్లను చూపించి, వేలిముద్రల సమస్య గురించి చెప్పినా కూడా వాళ్లు ఫైన్ వేస్తూనే ఉంటారని అమల్ తెలిపారు.

వేలిముద్రలు లేక ఇలా చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆయన అన్నారు.





అందుకే రంగస్థలం సినిమాకు ఒప్పుకోలేదు: రాశి

సీఎంగా చేయడం నాకు ఇష్టం లేదు సంచలనం రేపిన నితీష్ వ్యాఖ్యలు

జ‌మిలిపై బీజేపీ హ‌డావుడి వెనుక ఇంత స్కెచ్ ఉందా..!

నితీశ్ కీలక నిర్ణయం పార్టీ పదవికి రాజీనామా...!

మొత్తం నాలుగు రాష్టాల్లో కొత్త కరోనా.. ఎన్440కే రకంగా నామకరణం

యూరప్ లో కోవిడ్ కొత్త స్ట్రెయిన్ విజృంభణ..!

న్యూ ఇయర్ సర్ప్రైజ్ వకీల్ సాబ్ రెడీ చేశాడా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>