PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/154-uk-passengers-misssing-in-telanganafeef6d6a-187f-4e6c-ae10-9df7b3a6c540-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/154-uk-passengers-misssing-in-telanganafeef6d6a-187f-4e6c-ae10-9df7b3a6c540-415x250-IndiaHerald.jpgబ్రిటన్‌లో వెలుగుచూసిన కొత్త రకం కరోనా స్ట్రెయిన్ తెలంగాణ వైద్యారోగ్య శాఖను టెన్షన్ పెడుతోంది. బ్రిటన్ నుంచి వచ్చిన 1216 మందిలో ఇంకా 154 మంది జాడ తెలియలేదు. దీంతో వాళ్లను ట్రేస్ చేసేందుకు అధికారులు శ్రమిస్తున్నారుcovid19;hyderabad;warangal;telangana;director;doctor;ranga reddy;shamshabad;sangareddy;siddipet;mancherial;jagtial154 మంది జాడ లేదు! పెరుగుతున్న కరోనా స్ట్రెయిన్ టెన్షన్154 మంది జాడ లేదు! పెరుగుతున్న కరోనా స్ట్రెయిన్ టెన్షన్covid19;hyderabad;warangal;telangana;director;doctor;ranga reddy;shamshabad;sangareddy;siddipet;mancherial;jagtialMon, 28 Dec 2020 09:10:25 GMT
    యూకే నుంచి తెలంగాణకు వచ్చిన వారిలో ఇప్పటివరకు 18 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.  ఆదివారం మరో ఇద్దరికి కూడా వైరస్ సోకింది. దీంతో కొత్తగా కరోనాబారిన పడినవారి సంఖ్య ఇరవైకు చేరుకుంది. వీరికి తోడు మరో ముగ్గురు ప్రైమరీ కాంటాక్టు వ్యక్తులకు కూడా పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరందరికీ సోకింది కొత్త రకం కరోనా వైరస్సా లేక పాతదేనా అనేదానిపై ఇంకా సీసీఎంబీ లాబ్ నుంచి వివరాలు అందలేదు. జీన్ సీక్వెన్స్ మ్యాపింగ్ చేసిన తర్వాత క్లారిటీ వస్తుందని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.

   బ్రిటన్ నుంచి డిసెంబరు 9 తర్వాత శంషాబాద్ విమానాశ్రయానికి మొత్తం 1216 మంది ప్రయాణికులు వచ్చారని, ఇందులో 92 మంది వివిధ రాష్ట్రాలకు చెందినవారు కావడంతో అక్కడికి వెళ్ళిపోయారని, ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు వివరాలు అందించి అప్రమత్తం చేశామని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. అయితే శనివారం వరకూ 184 మంది వివరాలు అందలేదని, అందులో 30 మంది జాడ కనిపెట్టడంతో ఇంకా 154 మంది గురించి వెతుకుతున్నట్లు తెలిపారు. కొత్తగా వైరస్ వచ్చిన ఇద్దరూ మల్కాజిగిరి జిల్లాకు చెందినవారని తెలిపారు. దీంతో ఇప్పటివరకు కొత్తగా వైరస్ బారిన పడిన ఇరవై మందిలో నలుగురు హైదరాబాద్, ఎనిమిది మంది మల్కాజిగిరి, ఇద్దరు జగిత్యాల జిల్లాలకు చెందినవారు కాగా మిగిలినవారు మంచిర్యాల, నల్లగొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ అర్బన్ జిల్లాలకు చెందినవారని వివరించారు.


అభిమానులపై రజినీ ఫ్యామిలీ ఆగ్రహం..

ప్రాంతీయ పార్టీల కీలక సమావేశం

‘బంగార్రాజు’లో శివగామి ఆ పాత్రలో నటించనుందా?

వ్యాక్సిన్ పనిచేయకపోతే.. ఫైనల్ చాన్స్ ఇదొక్కటే!

రోజంతా హుషారుగా ఉండాలంటే.. ఖాళీ కడుపుతో ఇవి తినాల్సిందే..

కార్తి ‘సుల్తాన్’ ఓటీటీలో.. కారణం అదేనా..?

8 ఏళ్ల క్రితం చనిపోయి.. ఇప్పుడు జడ్జికి బెదిరింపు లెటర్ రాశాడట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>