EditorialVijayaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/naidu-robin-sarma-tirupati-by-poll-tdp-ycp-jagan6995a53c-4c67-4a37-88c0-bea144ba8c81-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/naidu-robin-sarma-tirupati-by-poll-tdp-ycp-jagan6995a53c-4c67-4a37-88c0-bea144ba8c81-415x250-IndiaHerald.jpgఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే రాబిన్ శర్మ. ఈ రాబిన్ శర్మ ఎవరంటే రాజకీయ వ్యూహకర్త. ఐప్యాక్ వ్యవస్ధాపకుడు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందంలో రాబిన్ శర్మ కీలక సభ్యుడుగా ఉండేవారు. మొన్నటి ఎన్నికల వరకు కూడా ప్రశాంత్ తో శర్మ కలిసే పనిచేశారు. తర్వాత జరిగిన పరిణామాల వల్ల ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత సొంతకుంపటి పెట్టుకున్న శర్మతో 2024 ఎన్నికల్లో టీడీపీని గెలిపించటం కోసం చంద్రబాబు ఒప్పందం కుదుర్చుకన్నారు. ఆ శర్మనే ఇపుడు తిరుపతి ఉపఎన్నికలో కూడా రంగంలోకి దింపారని సమాచారం.naidu robin sarma tirupati by poll tdp ycp jagan;view;cbn;prasanth;tiru;government;tirupati;media;assembly;husband;tdp;prashant kishor;partyహెరాల్డ్ ఎడిటోరియల్ : ఒక్కడిపైనే ఆశలు పెట్టుకున్న చంద్రబాబుహెరాల్డ్ ఎడిటోరియల్ : ఒక్కడిపైనే ఆశలు పెట్టుకున్న చంద్రబాబుnaidu robin sarma tirupati by poll tdp ycp jagan;view;cbn;prasanth;tiru;government;tirupati;media;assembly;husband;tdp;prashant kishor;partyMon, 28 Dec 2020 03:00:00 GMTచంద్రబాబునాయుడు ఆశలన్నీ ఒక్కడిపైనే పెట్టుకున్నాడా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో ఎలా గెలవాలో చంద్రబాబుకు అర్ధం కావటం లేదు. నిజానికి గెలిచేంత సీన్ కూడా టీడీపీకి లేదనే చెప్పాలి.  అయితే గెలవటం సంగతి పక్కన పెట్టేస్తే కనీసం మొన్నటి ఎన్నికల్లో వచ్చిన ఓట్లన్నా సాధిస్తే అదే గెలిచినంత. అందుకనే ఈ విషయంపై బాగా ఆలోచించిన చంద్రబాబు ఓ వ్యక్తికి బాధ్యత అప్పగించారని పార్టీ నేతల సమాచారం.




ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే రాబిన్ శర్మ. ఈ రాబిన్ శర్మ ఎవరంటే రాజకీయ వ్యూహకర్త. ఐప్యాక్ వ్యవస్ధాపకుడు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందంలో రాబిన్ శర్మ కీలక సభ్యుడుగా ఉండేవారు. మొన్నటి ఎన్నికల వరకు కూడా ప్రశాంత్ తో శర్మ కలిసే పనిచేశారు.  తర్వాత జరిగిన పరిణామాల వల్ల ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత సొంతకుంపటి పెట్టుకున్న శర్మతో 2024 ఎన్నికల్లో టీడీపీని గెలిపించటం కోసం చంద్రబాబు ఒప్పందం కుదుర్చుకన్నారు. ఆ శర్మనే ఇపుడు తిరుపతి ఉపఎన్నికలో కూడా రంగంలోకి దింపారని సమాచారం.




ఇదే విషయమై రాబిన్ తిరుపతి లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ బృందాన్ని రంగంలోకి దింపేశారట. గ్రామస్ధాయి నుండి నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ వరకు ఉన్న పరిస్ధితులను అధ్యయనం చేయటమే టార్గెట్ గా శర్మ బృందం పనిలోకి దిగేసిందని సమాచారం. టీడీపీ తరపున పోటీ చేయబోయే అభ్యర్ధిగా పనబాక లక్ష్మిని ప్రకటించే సమయానికే  శర్మ బృందం క్షేత్రస్ధాయిలో పనిలోకి దిగేసిందట. అభ్యర్ధి విషయంలో జనాల్లో సానుకూలత తీసుకురావటం, నేతలు, శ్రేణులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించటంపైనే ఈ బృందం ప్రత్యేక దృష్టి పెట్టిందట.




అంటే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం టీడీపీ నేతల ప్రచారంతో ఈ బృందానికి ఎటువంటి సంబంధం ఉండదు. కాకపోతే ఏ అంశాలపై నేతలు, కార్యకర్తలు ప్రధానంగా దృష్టిపెట్టాలి ? ఏ పద్దతిలో ప్రచారం చేస్తే ఫలితం ఉంటుందనే అంశాలపైనే ఈ బృందం నేతలకు మార్గదర్శనం చేయబోతోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం చేయటంలో భాగంగానే పోలింగ్ బూత్ , గ్రామ, మండల, నియోజకర్గాల స్ధాయిలో ప్రత్యేక సోషల్ మీడియా బృందాలను రెడీ చేసిందట. క్షేత్రస్ధాయిలో చేసిన సర్వేల ఆధారంగానే ప్రచారాన్ని ఏ విధంగా పరిగెత్తించాలనే విషయంలో రాబిన్ సూచనిలిస్తున్నారట. మొత్తం మీద గెలిచే విషయం ఎలాగున్నా గెలిచేంత పని కావాలంటే ఇప్పటి నుండే మొత్తం బలాన్ని క్షేత్రస్ధాయిలో కేంద్రీకరించాలని చంద్రబాబుకు రాబిన్ స్పష్టం చేశారట. అందుకనే ఇటు టీడీపీ బలగాలు అటు రాబిన్ బృందాలు మొత్తం గ్రౌండ్లోకి దిగేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.




వ్యాక్సిన్ పనిచేయకపోతే.. ఫైనల్ చాన్స్ ఇదొక్కటే!

రోజంతా హుషారుగా ఉండాలంటే.. ఖాళీ కడుపుతో ఇవి తినాల్సిందే..

కార్తి ‘సుల్తాన్’ ఓటీటీలో.. కారణం అదేనా..?

8 ఏళ్ల క్రితం చనిపోయి.. ఇప్పుడు జడ్జికి బెదిరింపు లెటర్ రాశాడట!

ఉద్యోగిని చంపిన ఓనర్.. మలద్వారంలోకి గాలి కొట్టి మరీ..

పెళ్లి రోజు భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన భర్త.. ఆ భార్య ఏం చేసిందంటే..!

బిగ్‌బాస్‌కు కొత్త కష్టాలు.. నాగార్జునపై కోర్టుకెళతానన్న...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>