Crimeyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/crime/135/murder966b9ba4-b2c3-48fd-a0e3-937ba445c483-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/crime/135/murder966b9ba4-b2c3-48fd-a0e3-937ba445c483-415x250-IndiaHerald.jpgవివాదాల కారణంగా ఒకప్పుడు కత్తులతో చంపుకునేవారు. ఆ తరువాత తుపాకులతో కాల్చుకునేవారు. కానీ యూపీలో జరిగిన ఓ హత్యోదంతం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని జరిగిన ఈ ఘటన ఆలస్యంగా.. murder;ravi;ravi anchor;district;air;local languageఉద్యోగిని చంపిన ఓనర్.. మలద్వారంలోకి గాలి కొట్టి మరీ..ఉద్యోగిని చంపిన ఓనర్.. మలద్వారంలోకి గాలి కొట్టి మరీ..murder;ravi;ravi anchor;district;air;local languageSun, 27 Dec 2020 16:31:00 GMTస్థానిక శివపురిలోని ఓ షాపు యజమాని తన వద్ద పనిచేస్తున్న వ్యక్తిని అత్యంత దారుణంగా మలద్వారంలోని గాలి కొట్టి చంపేశాడు. ఈ ఘటన 19 రోజుల క్రితం జరిగింది.

 శివపురి ఎస్‌ఐ రాజేశ్ సింగ్ చందేల్ ఈ కేసుకు సంబంధించి శనివారం వివరాల వెల్లడించారు. గోవర్ధన్ ప్రాంతంలో నివశించే ఓ పరమానంద్ ధడక్ అనే వ్యక్తి స్థానిక స్టోన్ క్రషర్‌లో పనిచేస్తున్నాడు. అయితే డిసెంబరు 8న తన జీతం కోసం ఓనర్ రాజేశ్ రాయ్ వద్దకు వెళ్లాడు. అయితే జీతం విషయంలో ఇద్దరి మధ్య చిన్న వివాదం రేగింది. పరమానంద్‌ను రాజేశ్ కిందకు తోసేశాడు. ఆ తరువాత అక్కడ పనిచేసే మరో ముగ్గురు పింటు, రవి, పప్పు ఖాన్‌లు పరమానంద్‌ను గట్టిగా పట్టుకున్నారు. పక్కనే ఉన్న ఎయిర్ కంప్రెషనర్ తీసుకున్న రాయ్ అతడి మలద్వారం గుండా దానిని పెట్టి గాలి కొట్టాడు.

గాలి వేగానికి అతడి కడుపులో పేగులు గ్యాస్‌తో నిండిపోయాయి. దీంతో అతడు కడుపునొప్పితో విలవిల్లాడడం మొదలు పెట్టాడు. దీంతో వెంటనే అతడిని కుటుంబానికి సమాచారం ఇవ్వకుండానే ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారు. కానీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ పరమానంద్ మరణించాడు. అయితే అతడిని జిల్లా ఆసుపత్రికి తరలించిన తరువాత యజమాని అతడి కుటుంబ సభ్యులకు విషయం చేరవేశాడు. వెంటనే అక్కడకు చేరుకున్న వారికి పరమానంద్ తన చావుకు కారణాన్ని వివరించాడు.

పరమానంద్ సోదరుడు ధనిరాం ధడక్ దీనిపై మాట్లాడుతూ, ఎప్పటిలానే తన సోదరుడు ఉద్యోగానికి వెళ్లాడని, అయితే మధ్యాహ్నానికి ఓ వ్యక్తి వచ్చి ‘మీ సోదరుడు హాస్పటల్‌లో ఉన్నాడు. కడుపునొప్పితో బాధపడుతున్నాడు. వెంటనే వెళ్లండి’ అని చెప్పారని, దాంతో హుటాహుటిన వెళ్లి అతడిని కలిసినట్లు చెప్పారు. ‘నేను వెళ్లేసరికి అతడు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడు.

విషయం అడగ్గా.. తాను పనిచేసే ఓనర్‌తో పాటు అక్కడ పనిచేసే మరికొంతమంది కలిసి తన మలద్వారంలోకి కంప్రషర్ ఎయిర్‌ను పంపు చేశారని, దానివల్లే తాను కడుపునొప్పితో బాధపడుతున్నానని చెప్పాడు. ఎన్ని ఆసుపత్రులు తిప్పినా డాక్టర్లు చేతులెత్తేశారు. నెప్పి భరించలేక ఆ రోజే అతడు మరణించాడ’ని చెప్పాడు. దీనిపై పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది.


కృష్ణా జిల్లాలో కరోనా డ్రై రన్... సెంటర్లు ఇవే

8 ఏళ్ల క్రితం చనిపోయి.. ఇప్పుడు జడ్జికి బెదిరింపు లెటర్ రాశాడట!

పెళ్లి రోజు భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన భర్త.. ఆ భార్య ఏం చేసిందంటే..!

బిగ్‌బాస్‌కు కొత్త కష్టాలు.. నాగార్జునపై కోర్టుకెళతానన్న నేత

వైరల్ అవుతున్న ఎన్టీఆర్ షూ.. రేటెంతో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే!

మరో ఛాలెంజింగ్ రోల్‌లో సమంత.. ఈ సారి గుణశేఖర్ సినిమాలో..

ఏపీ సీఎం జగన్‌కు కేంద్ర ప్రభుత్వ అవార్డ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>