Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjunabff1a086-7d4b-4dc8-8f75-a5b22f4f943e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjunabff1a086-7d4b-4dc8-8f75-a5b22f4f943e-415x250-IndiaHerald.jpgభవిష్యత్ తరానికి పచ్చదనం ఇవ్వడం ఎంతో అవసరమని యువసామ్రాట్ అక్కినేని నాగార్జున అన్నారు. శనివారం జూబ్లీహిల్స్ రోడ్ నెం.49లో ఏర్పాటు చేస్తున్న జూబ్లీహిల్స్ సొసైటీ పార్కులో అక్కినేని నాగార్జున మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. రోజు రోజుకు అంతరించి పోతున్న చెట్లను కాపాడాల్సింది మనమే. కాంక్రీట్ జంగల్ లా మారుతున్న నగరంలో పచ్చదనాన్ని తెచ్చేందుకు మన వంతు కృషి తప్పకుండా చేయాలి. భవిష్యత్ తరానికి మనం ఇచ్చే విలువైన బహుమతి ఏదైనా ఉందంటే అది కేవలం చెట్లను మాత్రమే. nagarjuna;nagarjuna akkineni;ashok;nageshwara rao akkineni;sathish;sridhar;korcha;bigboss;king;prize;king 1;gift;nijam;reddy;masterతొలి మొక్కను నాటడం నా అదృష్టం: నాగార్జునతొలి మొక్కను నాటడం నా అదృష్టం: నాగార్జునnagarjuna;nagarjuna akkineni;ashok;nageshwara rao akkineni;sathish;sridhar;korcha;bigboss;king;prize;king 1;gift;nijam;reddy;masterSun, 27 Dec 2020 11:28:16 GMTఅక్కినేని నాగార్జున అన్నారు. శనివారం జూబ్లీహిల్స్ రోడ్ నెం.49లో ఏర్పాటు చేస్తున్న జూబ్లీహిల్స్ సొసైటీ పార్కులో అక్కినేని నాగార్జున మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. రోజు రోజుకు అంతరించి పోతున్న చెట్లను కాపాడాల్సింది మనమే. కాంక్రీట్ జంగల్ లా మారుతున్న నగరంలో పచ్చదనాన్ని తెచ్చేందుకు మన వంతు కృషి తప్పకుండా చేయాలి. భవిష్యత్ తరానికి మనం ఇచ్చే విలువైన బహుమతి ఏదైనా ఉందంటే అది కేవలం చెట్లను మాత్రమే.
భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే చెట్లు తప్పకుండా ఉండాల్సిందే. అందుకే మనవంతు మెక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందామని నాగ్ అన్నారు. జూబ్లీహిల్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్న ఈ పార్కులో తొలి మొక్కనాటే అవకాశం నాకు రావడం నిజంగా నా అదృష్టమని నాగార్జున అన్నారు. నిన్న మొన్నటి వరకు బిగ్ బాస్ హోస్ట్ గా బిజీగా ఉన్నారు కింగ్ నాగార్జున. అది కాస్త ముగింపు పలకడంతో నాగార్జున ఇలా సొసైటీ పార్క్ కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం నాగ్ అక్కడే ఒక చెట్టుకింద కూర్చుని కాసేపు సేదతీరారు.

అలాగే చిన్నారి మాస్టర్ అబూ శ్రీని తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఆమెతో ముచ్చటించి ఆడుకున్నారు.  ఆ తర్వాత అక్కడి కాలనీ వాసులతో ముచ్చటించారు. మొక్కలు భవిష్యత్ తరాలకు ఏ విధంగా ఉపయోగపడతాయో వివరించారు. అలాగే మొక్కలు పెంచుతున్న వారిని ప్రశంసించి వారిని మరిన్ని చెట్లు పెంచాలని నాగార్జున పిలుపునిచ్చారు. మన చుట్టూ ఉన్న పరిసరాలను పచ్చదనంతో నింపడం మన కనీస బాధ్యతని నాగార్జున పేర్కొన్నాడు. కాగా ఈ కార్యక్రమంలో నాగార్జున పాల్గొనడం పట్ల నాగ్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఫీలవుతున్నారు. ఈ కార్యక్రమంలో వాల్గో ఇన్ ఫ్రా ఎండీ, సీఈఓ శ్రీధర్ రావు, కాలనీవాసులు సతీష్ రెడ్డి, అశోక్ బాబు, తదితరులు పాల్గొన్నారు.


అమానుషం.. లైంఘిక దాడికి పాల్పడి ఆపై రైల్లోంచి కిందకు తోసిన దుండగుడు

రజనీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..

ప్రభాస్‌తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్.. ఏమన్నాడంటే..

యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన 8 మంది.. అందరికీ కరోనా!

తెలుగు రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు గాలికొదిలిన థియేటర్లు!

రాదేశ్యామ్ కోసం అదిరిపోయే ప్లాన్ రెడీ..విడుదల అప్పుడేనట.?

సలార్ దిగేది అపుడే.... ప్రభాస్ ఫ్యాన్స్ హుషార్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>