PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ukdc25eec3-d87b-448c-a688-369bc504e363-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ukdc25eec3-d87b-448c-a688-369bc504e363-415x250-IndiaHerald.jpgనిన్నటి దాకా చైనా...ఇపుడు యునైటెడ్ కింగ్ డం. దేశమేదైనా ఘోష ఒక్కటే, గోడు ఒక్కటే. నాడు చైనా వైరస్ అన్నారు, ఇపుడు బ్రిటన్ కొత్త కరోనా స్ట్రెయిన్ అంటున్నారు. ఏ పేరు అయితేనేమి జనాలు భయపడిపోవడానికి, వణికి వంకర్లు తిరగడానికి. ఇక రెండు తెలుగు రాష్ట్రాలూ ఇపుడు కరోనా కొత్త స్ట్రెయిన్ బెడదతో ఇబ్బంది పడుతున్నాయి.uk;hyderabad;andhra pradesh;vishakapatnam;king;air;press;king 1విశాఖలో అలజడి రేపుతున్న యూకే రిటర్నీస్ ?విశాఖలో అలజడి రేపుతున్న యూకే రిటర్నీస్ ?uk;hyderabad;andhra pradesh;vishakapatnam;king;air;press;king 1Sun, 27 Dec 2020 10:30:00 GMTకింగ్ డం.  దేశమేదైనా ఘోష ఒక్కటే, గోడు ఒక్కటే. నాడు చైనా వైరస్ అన్నారు, ఇపుడు బ్రిటన్ కొత్త కరోనా స్ట్రెయిన్ అంటున్నారు. ఏ పేరు అయితేనేమి జనాలు భయపడిపోవడానికి, వణికి వంకర్లు తిరగడానికి. ఇక రెండు తెలుగు రాష్ట్రాలూ ఇపుడు కరోనా కొత్త స్ట్రెయిన్ బెడదతో ఇబ్బంది పడుతున్నాయి.

తెలంగాణాలో హైదరాబాద్ లో ఈ బెడద ఎక్కువగా ఉంటే ఏపీలో విశాఖలో కూడా ఈ గొడవ చాలానే ఉంది. యూకే రిటర్నీస్ కోసం విశాఖలో అధికారులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపడుతున్నారు. గత నెల రోజుల్లో యూకే నుంచి విశాఖకు 217 మంది వచ్చారు. వారిలో 199 మందిని గుర్తించి అధికారులు వైద్య పరీక్షలు చేశారు. ఇక ఇందులో 151 మందికి కరోనా నెగిటివ్ కూడా వచ్చింది. అయితే ఇంకా 28 మందికి సంబంధించి రిపోర్టులు రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే మరో 18 మంది జాడ తెలియడంలేదు. వారు కనుక జన జీవన స్రవంతిలో కలసిపోయి ఉంటే కొత్త వైరస్ వ్యాపిస్తుందేమో అన్న కంగారు మాత్రం అధికారుల్లో అలాగే ఉంది.

వీరు కాకుండా ఈ మధ్యన రాజమండ్రీ మహిళతో కలసి ఏపీ ఎక్స్ ప్రెస్ లో ఒకే బోగీలో ప్రయాణం చేసి విశాఖ చేరుకున్న వారిలో ఎనిమిది మందిని అధికారులు గురించారు. ఇందులో ముగ్గురుని ప్రత్యేక ఐసోలేషన్ కి తరలించారు. మిగిలిన వారిని గురించి కూడా అన్వేషణ సాగుతోంది. మొత్తానికి చూస్తే ఎంతమంది యూకే నుంచి వచ్చారు అన్న దాని మీద అయితే అధికారుల వద్ద కచ్చితమైన డేటా ఏదీ లేదని అంటున్నారు. వివిధ మార్గాల ద్వారా విశాఖ చేరుకున్న వారితోనే ప్రమాదం అని కూడా అంటున్నారు. ఇప్పటికే అనకాపల్లిలో కొత్త కరొనా కలకలం రేగుతోంది. అధికారులు మాత్రం ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, సామాజిక దూరం పాటించాలని సూచిస్తున్నారు.
 




రాష్ట్ర అధికారులపై బీజేపీ తీవ్ర వ్యాఖ్యలు..

ప్రభాస్‌తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్.. ఏమన్నాడంటే..

యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన 8 మంది.. అందరికీ కరోనా!

తెలుగు రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు గాలికొదిలిన థియేటర్లు!

రాదేశ్యామ్ కోసం అదిరిపోయే ప్లాన్ రెడీ..విడుదల అప్పుడేనట.?

సలార్ దిగేది అపుడే.... ప్రభాస్ ఫ్యాన్స్ హుషార్ ?

సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ మాములుగా లేదుగా...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>