MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/saidharam-tejb0787302-9ec9-4b18-a539-e94eeec191d9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/saidharam-tejb0787302-9ec9-4b18-a539-e94eeec191d9-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుండి వచ్చిన యువ నటుల్లో ప్రస్తుతం మంచి పేరు ప్రఖ్యాతలు తో కొనసాగుతున్న వారిలో సాయి ధరమ్ తేజ్ కూడా ఒకరు. తొలిసారిగా పిల్లా నువ్వు లేని జీవితం సినిమా ద్వారా టాలీవుడ్ కి నటుడిగా ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్ తేజ్ ఆ సినిమా ద్వారా మంచి సక్సెస్ ని అందుకున్నారు. దాని అనంతరం సుప్రీమ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి సినిమాలతో సూపర్ సక్సెస్ లు అందుకున్న తేజ్ ఆ తర్వాత మాత్రం ఆశించిన రేంజ్ సక్సెస్ లు అయితే సాధించలేకపోయారు. solo brathuke so better;sai dharram tej;chiranjeevi;jeevitha rajaseskhar;maruti;prasad;sai dharam tej;thaman s;christmas;tollywood;cinema;blockbuster hit;comedy;heroine;chitralahari;success;yuva;subrahmanyam for sale;v;supreme;solo bathuke so better;sri venkateswara cine chitraప్చ్ .... బ్లాక్ బస్టర్ గా మొదలై.... హిట్ దిశగా సాగి .... ఫైనల్ గా అక్కడ ఆగింది ....?ప్చ్ .... బ్లాక్ బస్టర్ గా మొదలై.... హిట్ దిశగా సాగి .... ఫైనల్ గా అక్కడ ఆగింది ....?solo brathuke so better;sai dharram tej;chiranjeevi;jeevitha rajaseskhar;maruti;prasad;sai dharam tej;thaman s;christmas;tollywood;cinema;blockbuster hit;comedy;heroine;chitralahari;success;yuva;subrahmanyam for sale;v;supreme;solo bathuke so better;sri venkateswara cine chitraSun, 27 Dec 2020 22:22:48 GMTమెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుండి వచ్చిన యువ నటుల్లో ప్రస్తుతం మంచి పేరు ప్రఖ్యాతలు తో కొనసాగుతున్న వారిలో సాయి ధరమ్ తేజ్ కూడా ఒకరు. తొలిసారిగా పిల్లా నువ్వు లేని జీవితం సినిమా ద్వారా టాలీవుడ్ కి నటుడిగా ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్ తేజ్ ఆ సినిమా ద్వారా మంచి సక్సెస్ ని అందుకున్నారు. దాని అనంతరం సుప్రీమ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి సినిమాలతో సూపర్ సక్సెస్ లు అందుకున్న తేజ్ ఆ తర్వాత మాత్రం ఆశించిన రేంజ్ సక్సెస్ లు అయితే సాధించలేకపోయారు.

ఇక ఇటీవల చిత్రలహరి.సినిమా తర్వాత కెరీర్ పరంగా మంచి బ్రేక్ అందుకున్న తేజ్ దాని అనంతరం మారుతి దర్శకత్వంలో నటించిన ప్రతి రోజు పండుగే సినిమా తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఇక లేటెస్ట్ గా ఆయన నటించిన సోలో బ్రతుకే సో బెటర్ మూవీ క్రిస్మస్ రోజున రిలీజ్ అయింది. యువ దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం యావరేజ్  విజయం దిశగా కొనసాగుతుంది. దాదాపుగా తొమ్మిది నెలల తర్వాత ఒక్కసారిగా థియేటర్స్ ఓపెన్ అవడంతో ఈ సినిమాకి భారీ స్థాయిలోనే ఓపెనింగ్స్ రావడం జరిగింది. మంచి ఆకట్టుకునే కథాకథనాలతో పాటు ఈ సినిమాకి తమన్ అందించిన మ్యూజిక్ అలానే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ప్లస్ కాగా, భారీ విజువల్స్ ఆకట్టుకునే యాక్షన్ సన్నివేశాలు హృద్యమైన ఎమోషన్స్, కామెడీ వంటివి కూడా మరింత మంచి పేరు తెచ్చిపెట్టాయి అంటున్నారు విశ్లేషకులు.

ప్రేక్షకులు అయితే ఈ సినిమా తొలి రోజు తొలి షో కి బ్లాక్బస్టర్ టాక్ వచ్చిందని ఆ తర్వాత మెల్లగా అది హిట్ గా మారిందని ఆపై అది ప్రస్తుతం యావరేజ్ దిశగా కొనసాగుతుందని ఒకరకంగా ఓవరాల్ గా సినిమా యొక్క రిజల్ట్ గురించి చెప్పుకుంటే యావరేజ్ అనేది ఫైనలైజ్ అయినట్లే అని పలువురు ప్రేక్షకులు అలానే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఎన్నో నెలల గ్యాప్ తర్వాత వచ్చిన తొలి సినిమా కావడం అలానే సినిమాలో మంచి కంటెంట్ ఉండటంతో  సాయి ధరమ్ తేజ్ ఈ సినిమా ద్వారా తన కెరీర్లో మరొక మంచి విజయాన్ని అయితే అందుకున్నారు అని తెలుస్తోంది. నభ నటేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విషయం తెలిసిందే.....!!


సునీల్ మామూలోడు కాదు..!

వ్యాక్సిన్ పనిచేయకపోతే.. ఫైనల్ చాన్స్ ఇదొక్కటే!

రోజంతా హుషారుగా ఉండాలంటే.. ఖాళీ కడుపుతో ఇవి తినాల్సిందే..

కార్తి ‘సుల్తాన్’ ఓటీటీలో.. కారణం అదేనా..?

8 ఏళ్ల క్రితం చనిపోయి.. ఇప్పుడు జడ్జికి బెదిరింపు లెటర్ రాశాడట!

ఉద్యోగిని చంపిన ఓనర్.. మలద్వారంలోకి గాలి కొట్టి మరీ..

పెళ్లి రోజు భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన భర్త.. ఆ భార్య ఏం చేసిందంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>