PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pola07ab1524-a0a6-47aa-8107-3fe65aa306d7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pola07ab1524-a0a6-47aa-8107-3fe65aa306d7-415x250-IndiaHerald.jpgఏపీ ప్రజలకు జీవనాడి పోలవరం అని చెప్పాలి. ఇది ఎనభయ్యేళ్ళ నాటి కల. ప్రతి తెలుగువాడూ కోరుకునే వరం పోలవం. వర్తమాన కాలంలో ఇంతటి పెద్ద బహుళార్ధక సాధక ప్రాజెక్ట్ లేదు, భవిష్యత్తులో కూడా ఎవరూ ఇలాంటి భారీ నిర్మాణాలను చేపట్టలేరు. అందుకే నభూతో నభవిష్యత్తు అన్నట్లుగా పోలవరం విషయంలో అందరూ అతి పెద్ద వరాన్నే కోరుకుంటున్నారు.pola;jagan;andhra pradesh;telugu;chief minister;good news;central government;nijam;good newwzపోలవరం...జగన్ కి అతి పెద్ద శుభవార్త...?పోలవరం...జగన్ కి అతి పెద్ద శుభవార్త...?pola;jagan;andhra pradesh;telugu;chief minister;good news;central government;nijam;good newwzSun, 27 Dec 2020 10:00:00 GMTఏపీ ప్రజలకు జీవనాడి పోలవరం అని చెప్పాలి. ఇది ఎనభయ్యేళ్ళ నాటి కల. ప్రతి తెలుగువాడూ కోరుకునే వరం పోలవం. వర్తమాన కాలంలో ఇంతటి పెద్ద బహుళార్ధక సాధక ప్రాజెక్ట్ లేదు, భవిష్యత్తులో కూడా ఎవరూ ఇలాంటి భారీ నిర్మాణాలను చేపట్టలేరు. అందుకే నభూతో నభవిష్యత్తు అన్నట్లుగా పోలవరం విషయంలో అందరూ అతి పెద్ద వరాన్నే కోరుకుంటున్నారు.

మరి దానికి తగినట్లుగా అడుగులు పడుతున్నాయా అంటే ఇపుడు అవును అనే అంటున్నారు. తాజగా కేంద్రం 2017-18 నాటి సవరించిన అంచనాలకు ఆమోదం తెలిపిందని వస్తున్న వార్తలు అందరిలో ఆనందాన్ని కలిగిస్తున్నాయి. అదే కనుక జరిగితే పోలవరం విషయంలో ఇక ఎటువంటి ఇబ్బంది కానీ బెంగ కానీ ఉండదు, దాదాపుగా 55 వేల కోట్ల రూపాయాల అంచనా వ్యయానికి కేంద్రం ఆమోద ముద్ర వేసినట్లుగా వస్తున్న వార్తలతో తెలుగు జనం ఆనందభరితులు అవుతున్నారు.

అదే విధంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ కి కూడా ఇది శుభ వార్తగానే ఉంటుంది. పోలవరం విషయంలో ప్రతిపక్షాలు జగన్ని కనీసం ఊపిరి తీసుకోనీయడం లేదు. వారంతా జగన్ కి గట్టిగానే టార్గెట్ చేస్తున్నాయి. పోలవరం నిర్మించి తీరాలన్నది జగన్ సర్కార్ కల. కానీ అది సాకారం కావాలంటే వేల కోట్ల నిధులు కావాలి. కేంద్రం ఇపుడు పోలవరం భారాన్ని మోస్తాను అనడం అంటే నిజంగా జగన్ కి ఇంతకంటే గుడ్ న్యూస్ లేదు. అనుకున్న కాలానికి పోలవరం పూర్తి చేస్తే మళ్ళీ జగనే ఏపీకి రెండవ సారి కూడా సీఎం అవుతాడు అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఇక జగన్ పోలవరాన్ని 2022 నాటికి పూర్తి చేసి ఖరీఫ్ సీజన్ కి నీళ్ళు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇపుడు ఆ మాటలు నిజం అయ్యే అవకాశాలు కచ్చితంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే పోలవరం నిధుల భారం తప్పిపోతే ఇక జోరుగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం సాగనుంది. ఆ విషయంలో ఎటువంటి డౌట్ కూడా అవసరం లేదు.






పార్టీలు మారే వారిపై వెంకయ్య సంచలన వ్యాఖ్యలు

ప్రభాస్‌తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్.. ఏమన్నాడంటే..

యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన 8 మంది.. అందరికీ కరోనా!

తెలుగు రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు గాలికొదిలిన థియేటర్లు!

రాదేశ్యామ్ కోసం అదిరిపోయే ప్లాన్ రెడీ..విడుదల అప్పుడేనట.?

సలార్ దిగేది అపుడే.... ప్రభాస్ ఫ్యాన్స్ హుషార్ ?

సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ మాములుగా లేదుగా...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>