Crimeyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/judge-gets-death-threats-regarded-in-a-case-through-a-letter-from-a-dead-manaf735762-7c0e-4bf1-a73e-2f0494594071-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/judge-gets-death-threats-regarded-in-a-case-through-a-letter-from-a-dead-manaf735762-7c0e-4bf1-a73e-2f0494594071-415x250-IndiaHerald.jpgఉత్తరప్రదేశ్‌ ఓ జడ్జికి ఉన్నట్లుండి ఓ బెదిరింపు లేఖ వచ్చింది. అందులో ఆయన తీర్పు చేప్పబోతున్న ఓ కేసులో నిందితుడిని విడిచిపెట్టాలని ఉంది. లేకపోతే ఆయన కుటుంబాన్నంతా చంపేస్తానని బెదిరింపులకు.. death threat;rohit;police;december;letter;local language8 ఏళ్ల క్రితం చనిపోయి.. ఇప్పుడు జడ్జికి బెదిరింపు లెటర్ రాశాడట!8 ఏళ్ల క్రితం చనిపోయి.. ఇప్పుడు జడ్జికి బెదిరింపు లెటర్ రాశాడట!death threat;rohit;police;december;letter;local languageSun, 27 Dec 2020 17:02:09 GMTలేఖ వచ్చింది. అందులో ఆయన తీర్పు చేప్పబోతున్న ఓ కేసులో నిందితుడిని విడిచిపెట్టాలని ఉంది. లేకపోతే ఆయన కుటుంబాన్నంతా చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు మహ్మద్ ఫహీమ్ పాకీస్తానీ అనే వ్యక్తి. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసిన జడ్జి.. చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు షాక్ తగిలింది. ఎందుకంటే ఆ లెటర్ వచ్చింది 8ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి నుంచి. అది కూడా పోలీసుల ఎన్‌‌కౌంటర్ వల్ల మరణించిన వ్యక్తి నుంచి. ఈ విషయం తెలిసి పోలీసులతో పాటు.. ఆ జడ్జి కూడా ఆశ్చర్యపోయారు.

వివరాల్లోకి వెళితే.. చున్నీలాల్ అనే వ్యక్తి కేసులో యూపీలో స్థానిక అడిషనల్ అండ్ సెషన్స్ జడ్జి తీర్పు చెప్పాల్సి ఉంది. అయితే చున్నీలాల్‌ను విడిచిపెట్టాలని, లేకపోతే కుటంబంతో సహా చంపేస్తానంటూ ఓ లెటర్ వచ్చింది. డిసెంబర్ 14న స్పీడ్ పోస్ట్ ద్వారా వచ్చిన ఈ లెటర్ మహ్మద్ ఫహీమ్ పాకీస్తానీ అనే వ్యక్తి నుంచి వచ్చింది. చున్నీ తనకు చాలా కావాల్సిన వ్యక్తి అని, అతడికోసం తాను ఏం చేయడానికైనా రెడీ అని అందులో రాసి ఉంది.

దీనిపై ఆ జడ్జి డిసెంబరు 17న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచాణలో భాగంగా ఫహీమ్ ఇంటికెళ్లారు. అక్కడ వారికేం తెలిసిందంటే.. ఫహీమ్ ఎప్పుడో 2012లో మొరాదాబాద్‌లో జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌లోనే చనిపోయాడు. అంతేకాదు ఫహీమ్‌కు, చున్నీలాల్‌కు అసలు సంబంధమే లేదట.

అయితే ఉత్తరం ఎవరు పంపించారో తెలుసుకోవాల్సి ఉందని, కేసు విచారణ కొనసాగిస్తామని స్టేషన్ ఆఫీసర్ గీతేశ్ కపిల్ తెలిపారు. ఆ పోస్ట్ వచ్చిన పోస్ట్ ఆఫీస్‌కు వెళ్లి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించామని, అయితే ఎటువంటి ఆధారాలూ లభించలేదని చెప్పారు. అయితే ఎస్పీ రోహిత్ సింగ్ సజ్వాన్ మాట్లాడుతూ, లెటర్ ఎవరు పంపించారు..? ఎక్కడి నుంచి వచ్చింది..? అనే కోణంలో దర్యాప్తు జరుపుతామని, నిందితులను పట్టుకునే వరకు కేసు మూసివేసే ప్రసక్తే లేదని చెప్పారు.


తెరాస భయపడిందా...? ఏకగ్రీవం అడిగింది...!

ఉద్యోగిని చంపిన ఓనర్.. మలద్వారంలోకి గాలి కొట్టి మరీ..

పెళ్లి రోజు భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన భర్త.. ఆ భార్య ఏం చేసిందంటే..!

బిగ్‌బాస్‌కు కొత్త కష్టాలు.. నాగార్జునపై కోర్టుకెళతానన్న నేత

వైరల్ అవుతున్న ఎన్టీఆర్ షూ.. రేటెంతో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే!

మరో ఛాలెంజింగ్ రోల్‌లో సమంత.. ఈ సారి గుణశేఖర్ సినిమాలో..

ఏపీ సీఎం జగన్‌కు కేంద్ర ప్రభుత్వ అవార్డ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>