MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja-and-maruthi7c0bcf41-e349-4fff-ae9d-a8d4f19fc16d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja-and-maruthi7c0bcf41-e349-4fff-ae9d-a8d4f19fc16d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తక్కువ బడ్జెట్ లోనే సినిమాలు చేసి, మంచి కలెక్షన్స్ ను రాబట్టడంలో డైరెక్టర్ మారుతి దిట్ట అనే చెప్పాలి..చిన్న సినిమాలు తీసి వాటిని పెద్ద హిట్లుగా మలిచి అగ్ర దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు ఈ దర్శకుడు.. అంతేకాదు మారుతిని చూసి చాలా మంది చిన్న దర్శకులు ఇండ్రస్టీలోకి అడుగుపెట్టి తమ టాలెంట్ ను చూపించారు.. ఏది ఏమైనా తక్కువ బడ్జెట్ సినిమాలు తీయడంలో మారుతి స్టైలే వేరు. ఇక ఆయన లాస్ట్ సినిమా 'ప్రతిరోజు పండుగే' సూపర్ సక్సెస్ తరువాత మారుతి సినిమా పై అనేక raviteja and maruthi;ravi;nani;gopichand malineni;kranthi;kranti;maruti;ravi teja;makar sakranti;korcha;tollywood;cinema;sankranthi;january;director;success;march;bhale bhale magadivoy;mass;krackమారుతి,రవితేజ కాంబినేషన్ మూవీ టైటిల్ అధిరిపోయిందిగా..!!మారుతి,రవితేజ కాంబినేషన్ మూవీ టైటిల్ అధిరిపోయిందిగా..!!raviteja and maruthi;ravi;nani;gopichand malineni;kranthi;kranti;maruti;ravi teja;makar sakranti;korcha;tollywood;cinema;sankranthi;january;director;success;march;bhale bhale magadivoy;mass;krackSun, 27 Dec 2020 21:00:00 GMTటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో  తక్కువ బడ్జెట్ లోనే సినిమాలు చేసి, మంచి కలెక్షన్స్ ను రాబట్టడంలో డైరెక్టర్ మారుతి దిట్ట అనే చెప్పాలి..చిన్న సినిమాలు తీసి వాటిని పెద్ద హిట్లుగా మలిచి అగ్ర దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు ఈ దర్శకుడు.. అంతేకాదు మారుతిని చూసి చాలా మంది చిన్న దర్శకులు ఇండ్రస్టీలోకి అడుగుపెట్టి తమ టాలెంట్ ను చూపించారు.. ఏది ఏమైనా తక్కువ బడ్జెట్ సినిమాలు తీయడంలో మారుతి స్టైలే వేరు. ఇక ఆయన లాస్ట్ సినిమా 'ప్రతిరోజు పండుగే' సూపర్ సక్సెస్ తరువాత మారుతి సినిమా పై అనేక రూమర్స్ వస్తూనే ఉన్నాయి. మారుతి మాత్రం ఇప్పటివరకూ తన కొత్త సినిమా స్క్రిప్ట్ పైనే కూర్చున్నాడు.అయితే, మారుతి - నాని కలయికలో వచ్చిన 'భలే భలే మగాడివోయ్' సినిమా సూపర్ సక్సెస్ కావడం..

 పైగా నేచురల్ స్టార్ నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతో మారుతి, నాని కలిసి మరొక సినిమా చేస్తున్నారని రూమర్స్ వచ్చాయి.కానీ తన కొత్త ప్రాజెక్ట్ కోసం మాస్ మహారాజా రవితేజతో కలిసి పని చేయడానికి మారుతి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ను 'పక్కా మాస్'గా ఫిక్స్ చేసారని సమాచారం. ఏది ఏమైనా మారుతి ఎలాంటి సినిమా చేస్తాడా ? ఏ హీరోతో సినిమా చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న తరుణంలో.. రవితేజతో సినిమా ఫిక్స్ అని వార్తలు రావడంతో దానికి తగ్గట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో కూడా ఇదే న్యూస్ వైరల్ అవుతుండటంతో దాదాపు ఈ సినిమా ఫిక్స్ అని తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించలేదు.

నిజానికి ఈ చిత్రం గురించి ఆ మధ్యే వార్తలు వచ్చాయి.కానీ ఆ తరువాత రవితేజ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని కూడా మళ్ళీ వార్తలు వచ్చాయి. దాంతో 'మారుతి - నాని' కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుందని అంతా అనుకున్నారు. కానీ, ఉన్నట్టు ఉండి రవితేజ - మారుతి సినిమా మళ్ళీ లైన్ లోకి వచ్చింది. పైగా టైటిల్ ను కూడా ఖాయం చేసారు. ఈ సినిమా మార్చి నుండి సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ఇక ప్రస్తుతం రవితేజ.. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'క్రాక్' సినిమాలో నటిస్తున్నాడు..ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 14 ,2021 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది...!!


టీడీపీ రోజు రోజు కి దిగజారడానికి కారణం ఇదేనా..?

రోజంతా హుషారుగా ఉండాలంటే.. ఖాళీ కడుపుతో ఇవి తినాల్సిందే..

కార్తి ‘సుల్తాన్’ ఓటీటీలో.. కారణం అదేనా..?

8 ఏళ్ల క్రితం చనిపోయి.. ఇప్పుడు జడ్జికి బెదిరింపు లెటర్ రాశాడట!

ఉద్యోగిని చంపిన ఓనర్.. మలద్వారంలోకి గాలి కొట్టి మరీ..

పెళ్లి రోజు భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన భర్త.. ఆ భార్య ఏం చేసిందంటే..!

బిగ్‌బాస్‌కు కొత్త కష్టాలు.. నాగార్జునపై కోర్టుకెళతానన్న...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>