PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... కృష్ణా జిల్లా ఉయ్యూరులో బ్యాంకుల ముందు చెత్త పోయించిన వ్యవహారం సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తీవ్రంగా స్పందించడంతో నష్టనివారణ చర్యలకు జగన్ ప్రభుత్వం పూనుకుంది. ఈ మేరకు ఆదివారం సంచలన నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్ ఎన్.ప్రకాష్‌రావును మున్సిపల్‌ శాఖ కమిషనర్ విజయ్ కుమార్ సస్పెండ్ చేయడం జరిగింది. కృష్ణా జిల్లా ఉయ్యూరుతో పాటు విజయవాడ నగరంలో 16 బ్యాంకు శాఖల ముందు చెత్త వేయడంపై సర్వత్రాjagan;amala akkineni;kumaar;vijay;delhi;india;krishna river;jagan;nirmala sitharaman;vijayawada;rbi;district;panchayati;bank;collector;minister;krishna district;letter;joseph vijay;central governmentసంచలన నిర్ణయం తీసుకున్న జగన్ ప్రభుత్వం...సంచలన నిర్ణయం తీసుకున్న జగన్ ప్రభుత్వం...jagan;amala akkineni;kumaar;vijay;delhi;india;krishna river;jagan;nirmala sitharaman;vijayawada;rbi;district;panchayati;bank;collector;minister;krishna district;letter;joseph vijay;central governmentSun, 27 Dec 2020 23:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... కృష్ణా జిల్లా ఉయ్యూరులో బ్యాంకుల ముందు చెత్త  పోయించిన వ్యవహారం సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తీవ్రంగా స్పందించడంతో నష్టనివారణ చర్యలకు జగన్ ప్రభుత్వం  పూనుకుంది. ఈ మేరకు ఆదివారం సంచలన నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్ ఎన్.ప్రకాష్‌రావును మున్సిపల్‌ శాఖ కమిషనర్ విజయ్ కుమార్ సస్పెండ్ చేయడం జరిగింది. కృష్ణా జిల్లా ఉయ్యూరుతో పాటు విజయవాడ నగరంలో 16 బ్యాంకు శాఖల ముందు చెత్త వేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.

 ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు రుణాలివ్వడానికి కొన్ని బ్యాంకులు ముందుకు రావడం లేదు. దీనికి నిరసనగా అధికారులు ఈ చర్యలకు పాల్పడ్డారు. ఉయ్యూరు కమిషనర్‌ ఒక అడుగు ముందుకేసి పీఎం స్వానిధి, జగనన్న తోడు, వైఎస్సార్‌ చేయూత పథకాలను రుణాలు ఇవ్వనందుకు నిరసనగా ఈ విధంగా చెత్తను వేసినట్టుగా బ్యాంకు గేట్లకు ప్రత్యేకంగా తన పేరుతో బోర్డులు పెట్టించారు. ఈ వ్యవహారం ఢిల్లీ స్థాయికి చేరడంతో ఆయనపై జగన్ సర్కారు వేటు వేసింది.బ్యాంక్ ఎదుట చెత్త వేసిన ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. విజయవాడ, మచిలీపట్నం కమిషనర్లను మున్సిపల్‌శాఖ కమిషనర్ వివరణ కోరింది.అలాగే ఈ వ్యవహారానికి సంబంధించి బ్యాంకు అధికారుల సంఘానికి కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ లేఖ రాశారు.

బ్యాంకుల ముందు చెత్త వేసిన ఘటనపై కలెక్టర్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తెలిసిన వెంటనే నిమిషాల్లోనే చెత్తను తీసివేయించామని తెలిపారు. చెత్త వేసిన ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించామని, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బ్యాంకులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు కలిసి పనిచేద్దామని లేఖలో కలెక్టర్‌ కోరారు. మొత్తానికి ఈ వ్యవహారం ఇంకా ఎక్కువ కాక ముందే  జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టి, ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టడం జరిగింది.ఇక ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...





సునీల్ మామూలోడు కాదు..!

వ్యాక్సిన్ పనిచేయకపోతే.. ఫైనల్ చాన్స్ ఇదొక్కటే!

రోజంతా హుషారుగా ఉండాలంటే.. ఖాళీ కడుపుతో ఇవి తినాల్సిందే..

కార్తి ‘సుల్తాన్’ ఓటీటీలో.. కారణం అదేనా..?

8 ఏళ్ల క్రితం చనిపోయి.. ఇప్పుడు జడ్జికి బెదిరింపు లెటర్ రాశాడట!

ఉద్యోగిని చంపిన ఓనర్.. మలద్వారంలోకి గాలి కొట్టి మరీ..

పెళ్లి రోజు భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన భర్త.. ఆ భార్య ఏం చేసిందంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>