MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/bollywood-couple-getting-marriedbd20cb2e-d7a2-4d4a-a637-f8caa3fe5163-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/bollywood-couple-getting-marriedbd20cb2e-d7a2-4d4a-a637-f8caa3fe5163-415x250-IndiaHerald.jpgరణ్‌బీర్‌ కపూర్‌ నోటి వెంట పెళ్లి అనే మాట ఇంత వరకు రాలేదు. డిస్టనరీలో ఆయనకు నచ్చని మాట అదే కాబోలు. రణ్‌బీర్‌, అలియా రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నా.. పెళ్లి గురించి మాట్లాడలేదు. ఫస్ట్‌ టైం అలియాతో నా పెళ్లి అంటూ.. రన్‌బీర్‌ ఎనౌన్స్ చేయడం బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.రణ్‌బీర్‌, అలియా చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. మొదట్లో ఫ్రెండ్స్‌ అని చెప్పుకొచ్చిన రణ్‌బీర్‌.. ఆ తర్వాత లవరేనంటూ అంగీకరించాడు. కరోనా మహమ్మారి కారణంగా పెళ్లి వాయిదా పడిందని.. లేకపోతే ఈ పాటికే పెళ్లయిపోయేదంటూ.. ఓ ఇంటర్వ్యూbollywood couple getting married;alia bhatt;katrina kaif;deepika;prema;bollywood;marriage;love;interviewపెళ్లి పీటలెక్కుతున్న బాలీవుడ్ జంట..!పెళ్లి పీటలెక్కుతున్న బాలీవుడ్ జంట..!bollywood couple getting married;alia bhatt;katrina kaif;deepika;prema;bollywood;marriage;love;interviewSun, 27 Dec 2020 20:00:00 GMTపెళ్లి అనే మాట ఇంత వరకు రాలేదు. డిస్టనరీలో ఆయనకు నచ్చని మాట అదే కాబోలు. రణ్‌బీర్‌, అలియా రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నా.. పెళ్లి గురించి మాట్లాడలేదు. ఫస్ట్‌ టైం అలియాతో నా పెళ్లి అంటూ.. రన్‌బీర్‌ ఎనౌన్స్ చేయడం బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

రణ్‌బీర్‌, అలియా చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. మొదట్లో ఫ్రెండ్స్‌ అని చెప్పుకొచ్చిన రణ్‌బీర్‌.. ఆ తర్వాత లవరేనంటూ అంగీకరించాడు. కరోనా మహమ్మారి కారణంగా పెళ్లి వాయిదా పడిందని.. లేకపోతే ఈ పాటికే పెళ్లయిపోయేదంటూ.. ఓ ఇంటర్వ్యూలో అభిమానులకు తీపి కబురు చల్లగా చెప్పాడు రణ్‌బీర్‌.

మొత్తానికి రణ్‌బీర్‌ ఓ ఇంటివాడవుతున్నాడు. ఎప్పుడూ చూసినా లవ్వు.. డేటింగ్‌ అంటూ టైంపాస్‌ చేసేశాడు. దీపిక పదుకునేతో ఎఫైర్‌ పెళ్లి దాకా వెళ్తుందని అనుకున్నారంతా. ఇక కత్రినా కైఫ్‌ను అయితే రణ్‌బీర్‌ తన ఇంట్లో వాళ్లకు పరిచయం చేయడంతో పెళ్లి పీటలు ఎక్కడమే తరువాయి అన్నంతగా సీన్స్‌ నడిచాయి. కట్‌ చేస్తే... రణ్‌బీర్‌ కెరీర్‌లో ఇంతవరకు బ్రేకప్స్‌ గానీ.. పెళ్లి మాటలేదు. ఫస్ట్ టైం ప్రేమ పెళ్లి దాకాగా వెళ్తోంది.

పదేళ్లుగా ఎఫైర్స్‌తో గడిపేసిన రణ్‌బీర్‌కు పెళ్లి చేసుకోవాలనించింది. ఈ చాక్లెట్‌బాయ్‌ వయసు 38 ఏళ్లయితే.. అలియా ఏజ్‌ 27. ఇద్దరి మధ్య 11 ఏళ్ల గ్యాప్‌ ఉంది. ప్రేమకు వయసుతో పనేంటని నిరూపించింది ఈ జంట. మొత్తానికి 40లో పడకుండా ఓ ఇంటివాడు అవుతున్నాడు రణ్‌బీర్.

మొత్తానికి ఎట్టకేలకు రణ్ బీర్ కపూర్.. అలియా పెళ్లిపీటలెక్కబోతున్నారు. వరుస బ్రేకప్స్ తర్వాత రణ్ బీర్ ఓ ఇంటివాడైపోతున్నాడు. అలియాభట్ తో పెళ్లంటూ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పేశాడు కూడా. కరోనా వల్లే తన పెళ్లి లేటయింది అని రణ్ బీర్ కపూర్ అంటున్నారు. గతంలో దీపిక, కత్రినాతో ప్రేమాయణం నడిపిన రణ్ బీర్ బ్రేకప్ చెప్పేశాడు కూడా. ఇపుడు అలియాను పెళ్లి చేసుకోబోతున్నాడు రణ్ బీర్.














హవల్దార్ పరశురాం కు ఘనంగా నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...

రోజంతా హుషారుగా ఉండాలంటే.. ఖాళీ కడుపుతో ఇవి తినాల్సిందే..

కార్తి ‘సుల్తాన్’ ఓటీటీలో.. కారణం అదేనా..?

8 ఏళ్ల క్రితం చనిపోయి.. ఇప్పుడు జడ్జికి బెదిరింపు లెటర్ రాశాడట!

ఉద్యోగిని చంపిన ఓనర్.. మలద్వారంలోకి గాలి కొట్టి మరీ..

పెళ్లి రోజు భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన భర్త.. ఆ భార్య ఏం చేసిందంటే..!

బిగ్‌బాస్‌కు కొత్త కష్టాలు.. నాగార్జునపై కోర్టుకెళతానన్న...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>