MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/hero-comedian-sunil-is-not-normal7aa1b51a-d58a-485d-82be-6e5fab40019e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/hero-comedian-sunil-is-not-normal7aa1b51a-d58a-485d-82be-6e5fab40019e-415x250-IndiaHerald.jpgకేవలం హీరోయిజాన్నే నమ్ముకుంటే పనవ్వడం లేదు. అలాగని కామెడీ చేద్దామంటే కరెక్ట్‌ కంటెంట్‌ దొరకడం లేదు. దీంతో రెండిటిని కలిపి కొట్టేస్తున్నాడు పూలరంగడు. హీరో, కమెడియన్‌ అనే రిస్ట్రిక్షన్స్‌ పెట్టుకోకుండా, వచ్చిన ప్రతీ అవకాశాన్ని వాడేస్తున్నాడు సునీల్. హీరో కమ్‌ ప్రొడ్యూసర్‌గా ప్రాఫిటబుల్‌ జర్నీ చేస్తున్నాడు. సునీల్‌ కమెడియన్‌గా ఫుల్ పీక్స్‌లో ఉన్నప్పుడు హీరోగా మారాడు. 'మర్యాదరామన్న, పూలరంగడు' లాంటి హిట్స్‌ కొట్టాడు. అయితే హీరోగా మారాక సునీల్‌ కామెడీ రోల్స్‌ తగ్గించాడు. కానీ సునీల్‌ ఫుల్‌టైమ్‌ హీరోగhero comedian sunil is not normal;allu arjun;rajamouli;srinivas;sunil;trivikram srinivas;ram madhav;kannada;comedy;comedian;hero;arjun 1;research and analysis wing;discoraja;aravinda sametha veera raghava;journeyసునీల్ మామూలోడు కాదు..!సునీల్ మామూలోడు కాదు..!hero comedian sunil is not normal;allu arjun;rajamouli;srinivas;sunil;trivikram srinivas;ram madhav;kannada;comedy;comedian;hero;arjun 1;research and analysis wing;discoraja;aravinda sametha veera raghava;journeySun, 27 Dec 2020 23:30:00 GMTకామెడీ చేద్దామంటే కరెక్ట్‌ కంటెంట్‌ దొరకడం లేదు. దీంతో రెండిటిని కలిపి కొట్టేస్తున్నాడు పూలరంగడు. హీరో, కమెడియన్‌ అనే రిస్ట్రిక్షన్స్‌ పెట్టుకోకుండా, వచ్చిన ప్రతీ అవకాశాన్ని వాడేస్తున్నాడు సునీల్. హీరో కమ్‌ ప్రొడ్యూసర్‌గా ప్రాఫిటబుల్‌ జర్నీ చేస్తున్నాడు.

సునీల్‌ కమెడియన్‌గా ఫుల్ పీక్స్‌లో ఉన్నప్పుడు హీరోగా మారాడు. 'మర్యాదరామన్న, పూలరంగడు' లాంటి హిట్స్‌ కొట్టాడు. అయితే హీరోగా మారాక సునీల్‌ కామెడీ రోల్స్‌ తగ్గించాడు. కానీ సునీల్‌ ఫుల్‌టైమ్‌ హీరోగా మారాక హిట్స్‌, కంటే ఫ్లాపులు ఎక్కువయ్యాయి. 'జక్కన్న, ఉంగరాల రాంబాబు' లాంటి డిజాస్టర్స్‌తో మార్కెట్‌ కూడా పడిపోయింది.

సునీల్‌ హీరో జర్నీ ఫ్లాపుల్లో పడటంతో మళ్లీ కమెడియన్‌గా మారాడు. స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్
దర్శకత్వంలో 'అరవింద సమేత' చేశాడు. అయితే ఈ మూవీలో సునీల్‌కి నవ్వించడానికి పెద్దగా స్కోప్ దొరకలేదు. ఆ తర్వాత 'డిస్కోరాజా, కలర్‌ఫోటో' లాంటి సినిమాల్లో విలన్‌గానూ నటించాడు. ఇప్పుడు అల్లు అర్జున్ 'పుష్ప'లోనూ చోటా విలన్‌గా కనిపిస్తాడనే టాక్ వస్తోంది.

సునీల్ హీరో వేషాలు మానేసి సపోర్టింగ్‌ రోల్స్‌పై ఫోకస్‌ పెట్టినా మునపటి ఫామ్ అందుకోలేకపోతున్నాడు. దీంతో కమెడియన్‌ కమ్ హీరోగా జర్నీ చేయాలని ఫిక్స్ అయ్యాడట సునీల్. ఇప్పటికే 'వేదాంతం రాఘవయ్య' సినిమాలో హీరోగా చేస్తోన్న సునీల్, నెక్ట్స్‌ కన్నడ హిట్‌ 'బెల్ బాటమ్' రీమేక్‌లో హీరోగా చేస్తాడని ప్రచారం జరుగుతోంది. మరి సపోర్టింగ్‌ ఆర్టిస్ట్ కమ్ కమెడియన్ కమ్ హీరోగా సునీల్‌ ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.

మొత్తానికి సునీల్ రకరకాల పాత్రల్లో నటించేందుకు రెడీ అంటున్నాడు. దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తానేంటో నిరూపించుకుంటున్నాడు. తొలుత కమెడియన్ గా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సునీల్.. హీరోగానూ మెప్పించాడు. అద్భుతమైన డైలాగులతో.. అదరగొట్టే ఫైటింగ్ లతో వారెవ్వా అనిపించుకున్నాడు. ఇపుడు విలన్ గా మెప్పిస్తున్నాడు. చూద్దాం.. మున్ముందు ఎలాంటి ప్రయోగాలు చేస్తాడో చూడాలి.










వ్యాక్సిన్ పనిచేయకపోతే.. ఫైనల్ చాన్స్ ఇదొక్కటే!

రోజంతా హుషారుగా ఉండాలంటే.. ఖాళీ కడుపుతో ఇవి తినాల్సిందే..

కార్తి ‘సుల్తాన్’ ఓటీటీలో.. కారణం అదేనా..?

8 ఏళ్ల క్రితం చనిపోయి.. ఇప్పుడు జడ్జికి బెదిరింపు లెటర్ రాశాడట!

ఉద్యోగిని చంపిన ఓనర్.. మలద్వారంలోకి గాలి కొట్టి మరీ..

పెళ్లి రోజు భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన భర్త.. ఆ భార్య ఏం చేసిందంటే..!

బిగ్‌బాస్‌కు కొత్త కష్టాలు.. నాగార్జునపై కోర్టుకెళతానన్న...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>