MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-mandhanna3aa01fed-a46d-47c5-a14d-900fcd05185d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-mandhanna3aa01fed-a46d-47c5-a14d-900fcd05185d-415x250-IndiaHerald.jpgతెలుగులో నాగశౌర్య ఛలో సినిమాతో వెండి తెరకు పరిచయం అయిన కన్నడ బ్యూటీ రష్మీక...ఆ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఆ సినిమా విజయం సాధించడంతో తెలుగులో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు... గీత గోవిందం సినిమాతో భారీ హిట్‌ ని సొంతం చేసుకొని స్టార్ హీరోయిన్ క్రేజ్‌ను దక్కించుకుంది.ఇక ఆ వెంటనే సూపర్‌స్టార్ మహేశ్‌తో జోడీ కట్టే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఈ ఏడాది విడుదలైన సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేశ్ సరసన నటించి మరో హిట్‌ను అందుకోవడంతో రష్మిక క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పుడు తెలుగుతో పాటు తమిళంలోనూ సినిమాrashmika mandhanna;beauty;mahesh;amitabh bachchan;govinda;rajinikanth;siddharth;allu arjun;geetha;govi;rashmika mandanna;india;bollywood;cinema;telugu;tamil;chalo;kannada;hindi;silver;heroine;arjun 1;march;nagashaurya;dookudu;chitramరష్మీకను చూసి భయపడుతున్న బాలీవుడ్ టాప్ హీరోయిన్లు.. ఎందుకో తెలుసా..??రష్మీకను చూసి భయపడుతున్న బాలీవుడ్ టాప్ హీరోయిన్లు.. ఎందుకో తెలుసా..??rashmika mandhanna;beauty;mahesh;amitabh bachchan;govinda;rajinikanth;siddharth;allu arjun;geetha;govi;rashmika mandanna;india;bollywood;cinema;telugu;tamil;chalo;kannada;hindi;silver;heroine;arjun 1;march;nagashaurya;dookudu;chitramSun, 27 Dec 2020 16:00:00 GMTనాగశౌర్య ఛలో సినిమాతో వెండి తెరకు పరిచయం అయిన కన్నడ బ్యూటీ రష్మీక...ఆ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఆ సినిమా విజయం సాధించడంతో తెలుగులో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు... గీత గోవిందం సినిమాతో భారీ హిట్‌ ని సొంతం చేసుకొని స్టార్ హీరోయిన్ క్రేజ్‌ను దక్కించుకుంది.ఇక ఆ వెంటనే సూపర్‌స్టార్ మహేశ్‌తో జోడీ కట్టే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఈ ఏడాది విడుదలైన సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేశ్ సరసన నటించి మరో హిట్‌ను అందుకోవడంతో రష్మిక క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పుడు తెలుగుతో పాటు తమిళంలోనూ సినిమాలు చేస్తుంది. ఇక రష్మిక తెలుగు, తమిళ సినిమాలకే పరిమితం అవుతుందని అందరూ అనుకుంటుంటే స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ జతగా పుష్ప సినిమాలో నటించడానికి ఓకే చెప్పేసింది.

ఆసక్తికరమైన విషయమేమంటే పుష్ప ప్యాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అబ్బో రష్మి క బూరెల బుట్టలో పడిందే అని కొందరు అనుకుంటుండగానే.. ఏకధాటిగా బాలీవుడ్ సినిమాలకు ఓకే చెప్పేస్తుందట ఈ శాండిల్‌వుడ్ బ్యూటీ.నిజానికి పుష్ప సినిమా రష్మికకు తొలి ప్యాన్ ఇండియా మూవీ. అయితే అంత కంటే స్పీడుగా బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గర కావడానికి రష్మిక మందన్న అడుగులు వేస్తుంది. రీసెంట్‌గానే సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా చేస్తున్న మిషన్ మజ్ను చిత్రంలో నటించడానికి రష్మిక ఓకే చెప్పింది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడగానే.. మరో హిందీ ప్రాజెక్ట్‌కి కూడా రష్మిక ఓకే చెప్పిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

వివరాల్లోకెళ్తే.. బాలీవుడ్ సూపర్‌స్టార్ బిగ్ బీ ప్రధాన పాత్రలో వికాస్ భల్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఈసినిమాలో నటించడానికి రష్మిక మందన్న ఓకే చెప్పేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.ఇందులో అమితాబ్ బచ్చన్ కూతురి పాత్రలో రష్మిక మందన్న కనిపించనుందట. 2021 మార్చి నుండి ఈ సినిమా సెట్స్‌పైకి వెళుతుందని సమాచారం..  బాలీవుడ్ ఇండ్రస్టీలో ఇలా అడుగు పెట్టిందో లేదో.. వరుసగా అగ్ర హీరోల సరసన అవకాశాలు రావడంతో మన రష్మీకను చూసి మిగతా బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ తెగ భయపడిపోతున్నారట..మరి తెలుగులో తన సత్తా చాటిన ఈ కన్నడ బ్యూటీ హిందీలో కూడా అదే దూకుడును కనబరుస్తుందేమో చూడాలి...!!


తెరాస భయపడిందా...? ఏకగ్రీవం అడిగింది...!

8 ఏళ్ల క్రితం చనిపోయి.. ఇప్పుడు జడ్జికి బెదిరింపు లెటర్ రాశాడట!

ఉద్యోగిని చంపిన ఓనర్.. మలద్వారంలోకి గాలి కొట్టి మరీ..

పెళ్లి రోజు భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన భర్త.. ఆ భార్య ఏం చేసిందంటే..!

బిగ్‌బాస్‌కు కొత్త కష్టాలు.. నాగార్జునపై కోర్టుకెళతానన్న నేత

వైరల్ అవుతున్న ఎన్టీఆర్ షూ.. రేటెంతో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే!

మరో ఛాలెంజింగ్ రోల్‌లో సమంత.. ఈ సారి గుణశేఖర్ సినిమాలో..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>