MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_oldisgold/actress-soundarya-dream-not-possible-any-morecdd2a31c-764b-43ee-a36e-bc00c829f624-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_oldisgold/actress-soundarya-dream-not-possible-any-morecdd2a31c-764b-43ee-a36e-bc00c829f624-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా చరిత్రలో సావిత్రి తర్వాత ఆ రేంజ్ లో పేరు తెచ్చుకున్న హీరోయిన్స్ లో సౌందర్య ఒకరు.,అభినయంలో గాని, ఆహార్యంలో గాని, అందంలో గాని సావిత్రి తర్వాతే ఎవరైనా. ఆ తర్వాత ఆ స్థాయిలో సౌందర్య గుర్తింపు తెచ్చుకున్నారు.mohan babu;soundarya;abinaya;ali;babu mohan;editor mohan;jeevitha rajaseskhar;raja;savitri;cinema;telugu;tamil;kannada;hindi;interview;director;comedy;doctor;heroine;savithri 1తీరని నటి సౌందర్య కల..ఏంటో తెలిస్తే కన్నీళ్లేతీరని నటి సౌందర్య కల..ఏంటో తెలిస్తే కన్నీళ్లేmohan babu;soundarya;abinaya;ali;babu mohan;editor mohan;jeevitha rajaseskhar;raja;savitri;cinema;telugu;tamil;kannada;hindi;interview;director;comedy;doctor;heroine;savithri 1Sun, 27 Dec 2020 17:00:00 GMTసినిమా చరిత్రలో సావిత్రి తర్వాత ఆ రేంజ్ లో పేరు తెచ్చుకున్న హీరోయిన్స్ లో సౌందర్య ఒకరు.,అభినయంలో గాని, ఆహార్యంలో గాని, అందంలో గాని సావిత్రి తర్వాతే ఎవరైనా. ఆ తర్వాత ఆ స్థాయిలో సౌందర్య గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో స్టార్ హీరోలందరితోనూ ఆమె నటించారు. స్టార్ హీరోలతోనే కాకుండా బాబూమోహన్, అలీ వంటి కమెడియన్స్ తో కూడా ఆమె నటించారు, సాంగ్స్ లో నర్తించారు. గ్లామర్ పాత్రలే కాకుండా, నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో కూడా ఆమె నటించారు. పవిత్ర బంధం, రాజా, అమ్మోరు వంటి సినిమాల్లో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించి మెప్పించారు. అమ్మోరు సినిమా అయితే సౌందర్య కెరీర్ లోనే ఒక మైలురాయిగా నిలిచింది. సీరియస్ పాత్రల్లోనే కాకుండా, కామెడీ పాత్రలు కూడా చేసి కడుపుబ్బా నవ్వించారు.

నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సౌందర్య మొదట డాక్టర్ కావాలనుకున్నారట. కానీ అనుకోకుండా నటిగా మారి ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేశారు. అయితే జీవితంలో ఆమె ఎన్నో చూశారు, ఎన్నో పాత్రలు పోషించారు. అన్ని రకాల పాత్రల్లో నటించి అభిమానుల లోటు తీర్చారు. కానీ ఆమె తన కలను నిజం చేసుకోలేకపోయారట. "తాను దర్శకురాలిని కావాలనుకుంటున్నాని, ఒక్క సినిమాకైనా దర్శకత్వం చేయాలనేది తన కల అని, ఆ అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ, ఖచ్చితంగా డైరెక్టర్ అవ్వాలని ఉంది" అంటూ ఆమె ఓ సందర్భంలో వెల్లడించారు. "డైరెక్షన్ లో ఉన్న క్రియేటివిటీ, ఆత్మసంతృప్తి ఏ నటుడుకైనా, నటికైనా అల్టిమేట్ అవుతుంది. నిర్మాతగా సంతృప్తి ఉన్నా గాని, డైరెక్షన్ చేస్తే ఆ సంతృప్తి మరింత ఎక్కువగా ఉంటుంది. నా దగ్గర బోలెడన్ని ఆలోచనలు, స్క్రిప్ట్ లు ఉన్నాయి. వాటికి నేనే దర్శకత్వం వహించాలి. ఎందుకంటే మన ఆలోచనలను మన కంటే బాగా ఎవరు ప్రెజెంట్ చేస్తారు చెప్పండి. అందుకే డైరెక్టర్ కావాలనుకుంటున్నాను" అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

కానీ తన కల నిజం చేసుకోకుండానే సౌందర్య మరణించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాష చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న సౌందర్య, 2002 లో వచ్చిన ద్వీప అనే కన్నడ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సౌందర్య, ఉత్తమ నటిగా, ఉత్తమ నిర్మాతగా అవార్డులు అందుకున్నారు. ఉత్తమ చిత్రం కేటగిరీలో జాతీయ అవార్డు, ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కగా, ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కింది. ఇవే కాదు, అమ్మోరు, పవిత్రబంధం, అంతఃపురం, రాజా సినిమాలకి నంది అవార్డులు, ఫిల్మ్ ఫేర్ అవార్డులు కూడా దక్కాయి.


తెరాస భయపడిందా...? ఏకగ్రీవం అడిగింది...!

8 ఏళ్ల క్రితం చనిపోయి.. ఇప్పుడు జడ్జికి బెదిరింపు లెటర్ రాశాడట!

ఉద్యోగిని చంపిన ఓనర్.. మలద్వారంలోకి గాలి కొట్టి మరీ..

పెళ్లి రోజు భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన భర్త.. ఆ భార్య ఏం చేసిందంటే..!

బిగ్‌బాస్‌కు కొత్త కష్టాలు.. నాగార్జునపై కోర్టుకెళతానన్న నేత

వైరల్ అవుతున్న ఎన్టీఆర్ షూ.. రేటెంతో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే!

మరో ఛాలెంజింగ్ రోల్‌లో సమంత.. ఈ సారి గుణశేఖర్ సినిమాలో..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>