PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tomatoa9d0110d-8a1b-4364-9788-ad0e39ff3a52-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tomatoa9d0110d-8a1b-4364-9788-ad0e39ff3a52-415x250-IndiaHerald.jpgటమాటాలు లేకుండా ఏ కూరను కూడా వండలేరు. కనీసం ఒక్క టమాటా అయినా కూరలో వస్తారు. ఇక టమాట రేట్ ఎంత ఎక్కువగా ఉన్న కొన్ని అయినా ఇంటికి తీసుకెళ్తారు. టమాటాలను సూపర్ ఫుడ్ అంటారు. వాటిలో ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ ఉంటాయి. ఈ ప్రపంచంలో 3వేల రకాల టమాటాలున్నాయి. tomato;iron;vitamin;heart;sugar;lung cancerటమాటాలతో ఎన్ని అద్భుత ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!?టమాటాలతో ఎన్ని అద్భుత ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!?tomato;iron;vitamin;heart;sugar;lung cancerSun, 27 Dec 2020 06:00:00 GMTవిటమిన్స్ ఉంటాయి. ఈ ప్రపంచంలో 3వేల రకాల టమాటాలున్నాయి. మార్కెట్‌లో ధర బాగా తగ్గిన సమయంలో టమాటాలతో కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. టమాటాల్లో కాన్సర్‌ను అడ్డుకునే గుణాలున్నాయి. వాటిలో ఉండే లైకోపీన్... కొలన్, ప్రొస్టేట్, లంగ్ కాన్సర్లను అడ్డుకుంటోంది.

అయితే రక్తం గడ్డ కడితే మంచిదే. అతిగా గడ్డ కట్టే ప్రమాదం కూడా ఉంటుంది. అలా జరిగితే, గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలా జరగకూడదంటే టమాటాలు తినాలి. బీపీని తగ్గించే లక్షణాలు టమాటాలకు ఉన్నాయి. డయాబెటిస్, హైపర్ టెన్షన్, గుండె సమస్యలు ఉండేవారు టమాటాలు తింటే మంచిది. టమాటాలు మన శరీరంలోని గ్లూకోజ్ లెవెల్స్‌ని మెయింటేన్ చేస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు ఎన్ని టమాటాలు తింటే అంత మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు.

ఇక మతిమరపు, డిప్రెషన్, టెన్షన్ వంటివి కలిగి ఉండేవారు టమాటాలు తినాలి. వాటిలోని బి, ఇ విటమిన్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. టమాటాల్లో బీటా కెరోటిన్, లైకోపీన్... కళ్లకు మేలు చేస్తాయి. కంటి చూపును మెరుగు పరుస్తాయి. చర్మం కోమలంగా ఉండాలంటే టమాటాలు తినాలి. వాటిలోని బయోటిన్, విటమిన్ సీ ప్రోటీన్ల ఉత్పత్తిని క్రమబద్ధీకరిస్తాయి. చర్మ కణాల్ని రిపేర్ చేస్తాయి. ముసలితనం రాకుండా కాపాడతాయి. ఎముకలు బలంగా, ధృడంగా ఉండాలంటే టమాటాలు తీసుకోవాలి. వాటిలోని మెగ్నీషియం ఎముకలకు మేలు చేస్తుంది.

అంతేకాక ప్రెగ్నెన్సీ సమయంలో ఎన్ని టమాటాలు తింటే అంత మంచిది. పుట్టే పిల్లలు అత్యంత ఆరోగ్యంగా, ఎలాంటి సమస్యలూ లేకుండా పుడతారు. శరీరంలో రక్తం సరిగా లేనివారూ, అనీమియా (రక్త హీనత)తో బాధపడేవారు టమాటాలు తింటే, వాటిలోని సీ విటమిన్... ఐరన్ పెరిగేందుకు దోహదపడతాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ... రోజూ రెండు టమాటాలైనా తినాలని పరిశోధకులు సూచిస్తున్నారు.


డిసెంబ‌ర్ 27వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా...?

ప్రభాస్‌తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్.. ఏమన్నాడంటే..

యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన 8 మంది.. అందరికీ కరోనా!

తెలుగు రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు గాలికొదిలిన థియేటర్లు!

రాదేశ్యామ్ కోసం అదిరిపోయే ప్లాన్ రెడీ..విడుదల అప్పుడేనట.?

సలార్ దిగేది అపుడే.... ప్రభాస్ ఫ్యాన్స్ హుషార్ ?

సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ మాములుగా లేదుగా...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>