BeautyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/cleaning-scrubbing-massage-steaming-mask-toning-0d34170a-9a9d-4b5b-b218-10e602ffb8da-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/cleaning-scrubbing-massage-steaming-mask-toning-0d34170a-9a9d-4b5b-b218-10e602ffb8da-415x250-IndiaHerald.jpgప్రస్తుతం చాలా మంది మగవలు తమ ముఖఅందం కోసం పార్లర్ల చుట్టూ తిరుగుతూ ఎన్నో రకాలైన క్రీములు వాడుతూ వేలకొద్ది డబ్బులు ఖర్చు చేస్తుంటారు.కానీ ఎలాంటి ఫలితం ఉండదు.ఇప్పుడు మేము చెప్పబోయే స్టెప్స్ పాటిస్తే సెలూన్ స్టైల్ ఫేషియల్ మీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. cleaning,scrubbing,massage,steaming,mask,toning,;tiru;oil;makeup;aaviri;coffeeఆ స్టెప్స్ వాడితే పార్లర్ కి వెళ్లాల్సిన అవసరం ఉండదు!ఆ స్టెప్స్ వాడితే పార్లర్ కి వెళ్లాల్సిన అవసరం ఉండదు!cleaning,scrubbing,massage,steaming,mask,toning,;tiru;oil;makeup;aaviri;coffeeSun, 27 Dec 2020 14:52:52 GMTప్రస్తుతం చాలా మంది మగవలు తమ ముఖఅందం కోసం పార్లర్ల చుట్టూ తిరుగుతూ ఎన్నో రకాలైన క్రీములు వాడుతూ వేలకొద్ది డబ్బులు ఖర్చు చేస్తుంటారు.కానీ ఎలాంటి ఫలితం ఉండదు.ఇప్పుడు మేము చెప్పబోయే స్టెప్స్ పాటిస్తే సెలూన్ స్టైల్ ఫేషియల్ మీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

అయితే ఎలాంటి పద్ధతులు వాడితే  ముఖ సౌందర్యాన్ని పెంచుకోవచ్చో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

1.  ముఖం శుభ్రపరచడం:
ముందుగా ముఖాన్ని బాగా శుభ్రపరచుకోవాలి. మంచి నీటితో ముఖం కడుక్కోవడం, తుడవడం లాంటివి మేకప్ అవశేషాలను తొలగించి వేస్తాయి. ముఖం మీద ఉండే దుమ్ము,ధూళి కణాలను శుభ్రపరచుకోవడానికి చల్లని నీటితో కడిగితే మంచి ఫలితం ఉంటుంది.

2.  స్క్రబ్బింగ్ చేయడం:
ఇక రెండవ దశ స్క్రబ్బింగ్ చేయడం. దీనినే ఎక్స్ పోలియట్ అని కూడా అంటారు.  స్క్రబ్బింగ్ చేయడం వలన చనిపోయిన చర్మ కణాలను తొలగించి, చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది.ఇందుకోసం జిడ్డు చర్మం కలవారు కొద్దిగా కాఫీ పొడి, కొద్దిగా చక్కెర, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ బాదం నూనె లను మిశ్రమంలా చేసి ముఖం మీద మునివేళ్లతో వృత్తాకారంలో మర్దన చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వలన ముఖం మీద ఉన్న మృతకణాలు తొలగిపోయి చర్మం రంధ్రాలు తెరుచుకుంటాయి. అంతేకాకుండా బ్లాక్ హెడ్స్,వైట్ హెడ్స్ తో పాటు మలినాలను కూడా శుభ్రం చేయవచ్చు.

3. మర్దన చేయడం:
ముఖాన్ని మసాజ్ చేయకుండా ఫేషియల్ ని పూర్తి చేయలేం. ముఖాన్ని మసాజ్ చేయడం వల్ల ప్రశాంతంగా ఉండడంతో పాటు రక్త ప్రసరణను పెంచి, కండరాల  టోన్లను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. మసాజ్ చేయడం అంటే మొదటగా గడ్డం కింది భాగం నుండి మొదలుపెట్టి నుదిటి వరకు వ్యతిరేక దిశలో మసాజ్ చేయడం.

4.  ఆవిరి పట్టడం:
ఒక గిన్నెలో నీటిని పోసి బాగా మరిగించి, అందులో నుండి వస్తున్న ఆవిరిని మన ముఖమంతా పట్టేలా చూడాలి.ఇలా చేయడం వల్ల చర్మం లో నుండి వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఇంకా ఏమైనా మిగిలి ఉంటే  బయటికి రావడం తోపాటు చర్మం తేలికపడుతుంది.

5.  మాస్క్ వేయడం:
ఈ మాస్క్ వేసుకోవడం వల్ల  మలినాలను బయటకు తీసి,ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది.మీకు ఇష్టమైన ఫేస్మాస్క్ వేసుకోవచ్చు. మీ వంటగదిలో దొరికే సహజ పదార్థాలను ఉపయోగించి ఫేస్ మాస్కులు తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకు: టొమోటోఫేస్ మాస్క్,  అలోవెరా, ఓటు మిల్క్, అరటి, బొప్పాయి లాంటి ఫేస్ మాస్కులు మంచిది.

6.  టోనింగ్ చేయడం:
ముఖంలో టోనింగ్ చాలా ముఖ్యమైనది.టోనింగ్ చేయడం వలన ముఖంపైన రంధ్రాలు మూసుకుపోయి ముఖం నునుపుగా తయారవుతుంది. దీనికి మార్కెట్లో దొరికే టోనర్ లు వాడితే సరిపోతుంది.

7.  మాయిశ్చరైజ్ చేయడం:
మాయిశ్చరైజ్ లో ముఖానికి చాలా అవసరం.ముఖాన్ని శుభ్రపరిచి,ఆవిరి చేసిన తర్వాత చర్మం ఎండిపోతుంది. తద్వారా ముఖానికి తేమ అవసరం.చివరి దశగా చర్మాన్ని  మాయిశ్చరైజ్  చేయడం వల్ల  తగిన తేమను నిలుపుకుంటుంది. చేతులను శుభ్రం చేసుకొని ల్యాక్మే పీచ్ మిల్క్ క్రీములు తీసుకొని చేతివేళ్ళతో ముఖమంతా అప్లై చేయాలి. దీనితో  ముఖానికి కావలసిన తేమ అంది, ముఖం ప్రశాంతంగా తయారవుతుంది.కళ్లకు కూడా తగినన్ని కంటి క్రీమ్ వాడితే చూడచక్కని అందం మీ సొంతం.


మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సైలెంట్ గా జరిగిన మరో వేడుక. ఎవరిదో తెలుసా...??

పెళ్లి రోజు భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన భర్త.. ఆ భార్య ఏం చేసిందంటే..!

బిగ్‌బాస్‌కు కొత్త కష్టాలు.. నాగార్జునపై కోర్టుకెళతానన్న నేత

వైరల్ అవుతున్న ఎన్టీఆర్ షూ.. రేటెంతో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే!

మరో ఛాలెంజింగ్ రోల్‌లో సమంత.. ఈ సారి గుణశేఖర్ సినిమాలో..

ఏపీ సీఎం జగన్‌కు కేంద్ర ప్రభుత్వ అవార్డ్

అమానుషం.. లైంఘిక దాడికి పాల్పడి ఆపై రైల్లోంచి కిందకు తోసిన దుండగుడు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>