MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/abhijeeth739e1d37-3de7-4f24-8dcf-90995cd57ae1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/abhijeeth739e1d37-3de7-4f24-8dcf-90995cd57ae1-415x250-IndiaHerald.jpgతెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న బిగ్ బాస్ సీజన్4 ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే..దాదాపు వంద రోజుల పాటు సాగిన ఈ షో ప్రేక్షకుల్లో మంచి ఆదరణను కనబర్చింది.. ఇక హౌజ్ లో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు, ప్రేమలు,ఆప్యాయతలు ఇలా ఎంతో రసవత్తరంగా సాగిన ఈ సీజన్లో అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయాయి. వాటి గురించి సోషల్‌మీడియాలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ ఫైనలిస్టులను వారం రోజులుగా ఇంటర్వ్యూలతో చంపేస్తున్నారు. వాళ్లు కూడా ఓపిగ్గా అందరికీ ఇంటర్వ్abhijeeth;abhijith;bigboss;interview;star maaసోహెల్, మెహబూబ్ ల విషయంపై లైవ్ లోనే సంచలన కామెంట్స్ చేసిన అభిజిత్..!!సోహెల్, మెహబూబ్ ల విషయంపై లైవ్ లోనే సంచలన కామెంట్స్ చేసిన అభిజిత్..!!abhijeeth;abhijith;bigboss;interview;star maaSun, 27 Dec 2020 20:00:00 GMTబిగ్ బాస్ సీజన్4 ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే..దాదాపు వంద రోజుల పాటు సాగిన ఈ షో ప్రేక్షకుల్లో మంచి ఆదరణను కనబర్చింది.. ఇక హౌజ్ లో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు, ప్రేమలు,ఆప్యాయతలు ఇలా ఎంతో రసవత్తరంగా సాగిన ఈ సీజన్లో  అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయాయి. వాటి గురించి సోషల్‌మీడియాలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ ఫైనలిస్టులను వారం రోజులుగా ఇంటర్వ్యూలతో చంపేస్తున్నారు. వాళ్లు కూడా ఓపిగ్గా అందరికీ ఇంటర్వ్యూ ఇస్తున్నారు. జరిగిన విషయాలను చెప్తున్నారు. ఈ క్రమంలోనే మెహబూబ్, సోహెల్ విషయంపైనే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ విషయంలో సోహెల్ స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. తనకు ఎలాంటి హింట్స్ ఇవ్వలేదని..

ఇచ్చినవి కూడా అర్థం కాలేదని చెప్పాడు. అయితే ఇప్పుడు ఇదే విషయంపై అభిజీత్ కూడా నోరు విప్పాడు.ఈయన్ని తాజాగా ఇంటర్వ్యూ చేసినపుడు అందులో కూడా మెహబూబ్, సోహెల్ కాంట్రవర్సీ గురించి అడిగారు.అక్కడ జరిగింది మీకు తెలుసా.. బయటికి వచ్చిన తర్వాత తెలిసే ఉంటుంది కదా అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాడు అభి. ఆ రోజు ఏం జరిగింది అనేది తనకు తెలియదని చెప్పాడు. జరిగిన సీన్‌లో తాను లేనని.. దాంతో ఏం జరిగింది అనేది క్లారిటీ లేదని చెప్పాడు. అయితే బయటికి వచ్చిన తర్వాత తనకు కొందరు ఆ వీడియోలు చూపించి ఇలా చేసారని చెప్పినట్లు తెలిపాడు అభిజీత్. అలా చేయడం వల్లే కదా మీకు రావాల్సిన 50 లక్షలలో 25 లక్షలు సోహెల్ తీసుకెళ్లిపోయాడు అంటూ యాంకర్ అడిగితే..

 దానికి నవ్వుతూ సమాధానం ఇచ్చాడు అభి. అలాంటివన్నీ స్టార్ మా చూసుకుంటుంది.. వాళ్లకు ఉన్నంత క్లారిటీ మాకుండదు.. అక్కడ తప్పు జరిగి ఉంటే వాళ్లే చూసుకుంటారు అంటూ అభిజీత్ కూల్ గా సమాధానమిచ్చాడు. అయినా అక్కడ డబ్బులెవరికి కావాలి.. నేను సంపాదించుకుంటాను. నెల, సంవత్సరం ఎప్పుడో ఓ సారి డబ్బు వస్తుంది. కానీ నాకు కావాల్సిన గుర్తింపు బిగ్ బాస్ మాత్రమే ఇచ్చింది కదా అంటున్నాడు. తాను గెలిచాను ఇప్పుడు దానికంటే మిగిలినవి నాకెందుకు అంటూ చెప్పుకొచ్చాడు అభిజీత్..మొత్తానికి ఈ విషయంలో పూర్తి బాధ్యత మాత్రం స్టార్ మా వాళ్లదే అని అభిజిత్ మాట్లాడిన మాటల్లో అర్ధమవుతుంది...!!


హవల్దార్ పరశురాం కు ఘనంగా నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...

రోజంతా హుషారుగా ఉండాలంటే.. ఖాళీ కడుపుతో ఇవి తినాల్సిందే..

కార్తి ‘సుల్తాన్’ ఓటీటీలో.. కారణం అదేనా..?

8 ఏళ్ల క్రితం చనిపోయి.. ఇప్పుడు జడ్జికి బెదిరింపు లెటర్ రాశాడట!

ఉద్యోగిని చంపిన ఓనర్.. మలద్వారంలోకి గాలి కొట్టి మరీ..

పెళ్లి రోజు భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన భర్త.. ఆ భార్య ఏం చేసిందంటే..!

బిగ్‌బాస్‌కు కొత్త కష్టాలు.. నాగార్జునపై కోర్టుకెళతానన్న...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>