SportsSreekanth Eeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/virat978dd90e-14e9-4e51-8e16-c8738d3429b4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/virat978dd90e-14e9-4e51-8e16-c8738d3429b4-415x250-IndiaHerald.jpgకోహ్లీ అందుబాటులో లేని సమయంలో రహనే సెంచరీ సాధించి జట్టును గొప్పగా ముందుకు నడిపిస్తున్నాడని రికీ పాంటింగ్ అన్నాడు. కోహ్లీ కోరుకున్నంత కాలం భారత్‌కు అతడే కెప్టెన్‌ అని, అయితే కోహ్లీ బ్యాటింగ్‌పై ఎక్కువగా దృష్టి సారించాలని కెప్టెన్సీని వదిలేస్తే మాత్రం ప్రపంచ బౌలర్లకు అది ఎంతో ప్రమాదకరమని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసాడు. కోహ్లీ కెప్టెన్సీపై ఎలాంటి సందేహాలు లేవని స్పష్టం చేసాడు.virat;view;virat kohli;ravindra jadeja;india;melbourne;father;paruguకోహ్లీ కెప్టెన్సీ వదిలేస్తే బౌలర్లకు చుక్కలేకోహ్లీ కెప్టెన్సీ వదిలేస్తే బౌలర్లకు చుక్కలేvirat;view;virat kohli;ravindra jadeja;india;melbourne;father;paruguSun, 27 Dec 2020 22:01:09 GMTబోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బోర్న్‌ వేదికగా  ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్టు (రెండో టెస్టు)లో  రెండో రోజు అట ముగిసింది.36/1 పరుగుల వద్ద రెండో రోజు బ్యాటింగ్ ఆరంభించిన  టీమిండియా...రోజంతా బ్యాటింగ్ చేసింది. కెప్టెన్ రహానే సెంచరీతో కదం తొక్కడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 277/5 పరుగులు చేసింది. టీమిండియాకు 82 పరుగుల ఆధిక్యం లభించగా,ప్రస్తుతం రహానే (104), జడేజా (40)లు క్రీజులో ఉన్నారు.

కాగా పితృత్వ సెలవులపై వెళ్ళిన కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు సిరీస్ కు అందుబాటులో లేకపోవడంతో అజింక్య రహానే టెస్టు సిరీస్ నాయకత్వ బాధ్యతలను చేపట్టిన విషయం తెల్సిందే. అయితే తొలి రోజే ఆస్ట్రేలియాను ఆలౌట్ చేయడంలో కెప్టెన్  అజింక్య రహానే ఎత్తులు ఫలించాయి. బౌలింగ్లో మార్పులు, ఫీల్డ్ ప్లేసింగ్ వంటి వ్యూహాలతో అసీస్ ను  195 పరుగులకే పరిమితం చేసారు. ఇక రెండో రోజు భారత్  మ్యాచ్ పై పట్టు బిగించడంలో రహనే క్లాస్ సెంచరీ ఎంతోగానో ఉపయోగపడింది. దీంతో అటు కెప్టెన్సీతో పాటు  ఇటు బ్యాటింగ్ లోనూ రహానే అద్భుత ప్రదర్శన చేస్తుండడంతో రహానేపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

కాగా రహనే కెప్టెన్సీపై ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్ స్పందించాడు.  కోహ్లీ అందుబాటులో లేని సమయంలో రహనే సెంచరీ సాధించి జట్టును గొప్పగా ముందుకు నడిపిస్తున్నాడని ప్రశంసించాడు. కెప్టెన్ గా తొలి రోజు   వ్యూహాలతో అదరగొట్టాడని, రెండో రోజు బ్యాటుతో సత్తాచాటాడని అన్నాడు. ఇక ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై కూడా పాంటింగ్ పలు వ్యాఖ్యలు చేసాడు. కోహ్లీ కోరుకున్నంత కాలం భారత్‌కు అతడే కెప్టెన్‌ అని అన్నాడు. అయితే ఒకవేళ కోహ్లీ బ్యాటింగ్‌పై ఎక్కువగా దృష్టి సారించాలని  కెప్టెన్సీని వదిలేస్తే మాత్రం ప్రపంచ బౌలర్లకు అది ఎంతో ప్రమాదకరమని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసాడు. అయితే కోహ్లీ కెప్టెన్సీపై ఎలాంటి సందేహాలు లేవని కానీ  ప్రతికులాంశాల్లో రహానే సత్తాచాటాడని చెప్పడమే తన ఉద్దేశమని అన్నాడు.




వ్యాక్సిన్ పనిచేయకపోతే.. ఫైనల్ చాన్స్ ఇదొక్కటే!

రోజంతా హుషారుగా ఉండాలంటే.. ఖాళీ కడుపుతో ఇవి తినాల్సిందే..

కార్తి ‘సుల్తాన్’ ఓటీటీలో.. కారణం అదేనా..?

8 ఏళ్ల క్రితం చనిపోయి.. ఇప్పుడు జడ్జికి బెదిరింపు లెటర్ రాశాడట!

ఉద్యోగిని చంపిన ఓనర్.. మలద్వారంలోకి గాలి కొట్టి మరీ..

పెళ్లి రోజు భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన భర్త.. ఆ భార్య ఏం చేసిందంటే..!

బిగ్‌బాస్‌కు కొత్త కష్టాలు.. నాగార్జునపై కోర్టుకెళతానన్న...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sreekanth E]]>