PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona4a75b476-4e3f-4780-805f-f5aa916d00fb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona4a75b476-4e3f-4780-805f-f5aa916d00fb-415x250-IndiaHerald.jpgకరోనా వ్యాక్సిన్. ఇపుడు ఈ మాట ఎక్కువగా వినిపిస్తోంది. కరోనా వైరస్ మీద జనాలకు పూర్తి అవగాహన వచ్చింది. వారు నిర్భీతిగా తిరిగేస్తున్నారు. పెళ్ళిళ్ళూ పేరంటాలు కూడా చేసుకుంటున్నారు. భారతదేశం అంటే సామూహిక స్వరూపం, విసృత సమాజం. భారత్ కి మరో గొప్ప లక్షణం ఉంది. అదే రోగ నిరోధక శక్తి. అందువల్ల భారత్ కరోనాను తట్టుకుని ఇంతదాకా నిలిచింది. carona;india;population;central government;shakti;coronavirusభారత్ కి వ్యాక్సిన్......షాకింగ్ నిజాలు ?భారత్ కి వ్యాక్సిన్......షాకింగ్ నిజాలు ?carona;india;population;central government;shakti;coronavirusSun, 27 Dec 2020 21:00:00 GMTకరోనా వైరస్ మీద జనాలకు పూర్తి అవగాహన వచ్చింది. వారు నిర్భీతిగా తిరిగేస్తున్నారు. పెళ్ళిళ్ళూ పేరంటాలు కూడా చేసుకుంటున్నారు. భారతదేశం అంటే సామూహిక స్వరూపం, విసృత సమాజం. భారత్ కి మరో గొప్ప లక్షణం ఉంది. అదే రోగ నిరోధక శక్తి. అందువల్ల భారత్ కరోనాను తట్టుకుని ఇంతదాకా నిలిచింది.

అయితే వ్యాక్సిన్ అంటూ మరో వైపు ఊదరగొడుతున్నారు. కానీ భారత్ లో ఇప్పటికి మూడు రకాల వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అదే విధంగా వీటిని సత్వరమే పంపిణీ చేయాలని కూడా కేంద్రం నిర్ణయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ హడావుడి చూస్తూంటే కొత్త ఏడాది వ్యాక్సిన్ పంపిణీ ఆరంభం అవుతుంది అంటున్నారు.

అయితే కరోనా వైరస్ విషయంలో అనేక రకాలైన  అభిప్రాయాలు ఉన్నాయి. ఈ దేశంలో జనాభా దాదాపుగా 140 కోట్ల దాకా ఉండొచ్చు. మరి అంత పెద్ద జనాభాకు వ్యాక్సిన్ అందించాలంటే ఒక రోజులో అయ్యే పనేనా. కాదు అనుకుంటే అది కచ్చితంగా మూడు నాలుగేళ్ళ దాకా పడుతుంది అంటున్నారు. మరి అంతవరకూ కరోనా వైరస్ తో ఈ దేశం పోరాడాల్సిందేనా అంటే అక్కడే ఉంది అసలైన విషయం

ఈ దేశంలో ఎనిమిది నెలల పాటు గట్టిగా కరోనాతో జనం పోరాడారు. ఇపుడు కూడా కరోనా విషయంలో అవగాహనతోనే ముందుకు సాగుతున్నారు. అయితే వ్యాక్సిన్ మాత్రం ఇప్పట్లో అందరికీ అందుబాటులోకి రాదు అన్నది మాత్రం ష్యూర్ గా చెప్పేయవచ్చు. అలాంటపుడు కరోనా ఈ దేశంలో మరింతగా వ్యాపిస్తుందా అన్నది ఒక చర్చ. అయితే కరోనా ఉధృతి ఈ దేశంలో ఒక దశను దాటిన తరువాత తగ్గిపోయింది. గత ఆరు నెలల్లో తొలిసారిగా కనిష్టానికి కరోనా కేసులు ఒక్క ఆదివారం కనిపించాయి. కేవలం 18 వేల కేసులు మాత్రమే దేశంలో నమోదు అయ్యాయి.

అంతే కాదు భయపెట్టిన ముంబైలోని అతి పెద్ద మురికివాడ ధారవిలో ఒక్క కేసు కూడా నమోదు కానీ రోజు కూడా నిన్ననే అంతా చూశారు. మరి ఇవన్నీ చూసినపుడు కరోనాను పోరాడేందుకు వ్యాక్సిన్ అవసరం లేకుండా జనమే రోగ నిరోధక శక్తిని పెంచుకుంటారు అని వైద్య పరిశోధకులు అంటున్నారు. అయినా సరే జాగ్రత్తగా ఉంటే రానున్న ఏడాది కాలంలో కరోనా తాకిడి  ఈ  దేశంలో  చాలా దారుణంగా పడిపోతుందని కూడా అంచనాలు ఉన్నాయి. మొత్తానికి చూస్తే వ్యాక్సిన్ కంటే జనమే కరోనాను తరిమేయగలరు అన్న నమ్మకం మాత్రం అందరిలో వచ్చింది.




టీడీపీ రోజు రోజు కి దిగజారడానికి కారణం ఇదేనా..?

రోజంతా హుషారుగా ఉండాలంటే.. ఖాళీ కడుపుతో ఇవి తినాల్సిందే..

కార్తి ‘సుల్తాన్’ ఓటీటీలో.. కారణం అదేనా..?

8 ఏళ్ల క్రితం చనిపోయి.. ఇప్పుడు జడ్జికి బెదిరింపు లెటర్ రాశాడట!

ఉద్యోగిని చంపిన ఓనర్.. మలద్వారంలోకి గాలి కొట్టి మరీ..

పెళ్లి రోజు భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన భర్త.. ఆ భార్య ఏం చేసిందంటే..!

బిగ్‌బాస్‌కు కొత్త కష్టాలు.. నాగార్జునపై కోర్టుకెళతానన్న...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>