Healthyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/heart-attack3f8e37ad-08d6-4ec6-91b3-14ec1045d785-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/heart-attack3f8e37ad-08d6-4ec6-91b3-14ec1045d785-415x250-IndiaHerald.jpg ప్రపంచ వ్యాప్తంగా గుండెకు సంబంధించిన వ్యాధులు నానాటికీ పెరిగిపోతున్నాయి. చిన్న వయసులోనే హృదయ సంబంధ వ్యాధులకు గురై అనేకమంది ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. అయితే మన గుండెను కాపాడుకోవాలంటే ఆహారంలో సుగంధ ద్రవ్యాలు ఉండేలా..heart attack;india;vitamin a;iron;vitamin;heart;sugar;garlic;cholesterol;cinnamon;manadesamగుండె బాగుండాలంటే ఇవి తప్పక తినండిగుండె బాగుండాలంటే ఇవి తప్పక తినండిheart attack;india;vitamin a;iron;vitamin;heart;sugar;garlic;cholesterol;cinnamon;manadesamSat, 26 Dec 2020 13:33:14 GMTఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా గుండెకు సంబంధించిన వ్యాధులు నానాటికీ పెరిగిపోతున్నాయి. చిన్న వయసులోనే హృదయ సంబంధ వ్యాధులకు గురై అనేకమంది ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. అయితే మన గుండెను కాపాడుకోవాలంటే ఆహారంలో సుగంధ ద్రవ్యాలు ఉండేలా చేసుకోవాలి. ఈ విషయం ఎన్నో అధ్యయనాల తరువాత నిపుణులే స్వయంగా చెబుతున్నారు. మిగతా దేశాలతో పోల్చితే భారత దేశంలో సుగంధ ద్రవ్యాల వాడకం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇక్క హృదయ సంబంధ వ్యాధుల బారిన పడే వారి సంఖ్య ఇతర దేశాలకంటే తక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు స్పైసెస్‌లో దేని వల్ల ఎంత లాభం చేకూరుతుందో తెలుసుకుందాం.

వెల్లుల్లి:
భారత దేశంలో వెల్లులి లేనిదే ఏ కూర పూర్తి కాదు. ప్రతి కూరలో మొదట తాలింపు వేసేప్పుడే ఈ వెల్లులిని వేస్తారు. ఈ వెల్లుల్లిలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు రక్తంలో కొవ్వు పెరగకుండా చేస్తాయి. అంతేకాకుండా ఎక్కువగా ఉన్న కొ్వ్వు నిల్వలను తగ్గిస్తాయి కూడా. అంతే కాదు రక్తంలో షుగర్‌ను కూడా నియంత్రిస్తాయి.

ఆవాలు:
భారతీయ కూరల్లో వెల్లుల్లి వేయని వారైనా ఉంటారేమో కానీ, ఆవాలు వేయని వారుండరు. ప్రతి కూరలోనూ తాలింపు సమయంలో ఈ ఆవాలను ఎక్కువగా వినియోగిస్తారు.
విడిగానే కాదు.. ఆవాల నూనెను కూడా ఆహారంలో వినియోగించడం మనదేశంలో గమనించవచ్చు. ఆవాల నూనెని ఆహారంలో వినియోగించడం వల్ల గుండె సమస్యలు పూర్తిగా తగ్గుతాయని అమెరికాకు సంబంధించిన ఓ సంస్థ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ఇవి కూడా వెల్లుల్లిలానే రక్తంలో కొవ్వును తగ్గించి, షుగర్ శాతాన్ని నియంత్రించడంతో ఉపయోగపడతాయి.

దాల్చిన చెక్క:
కూరల్లో ఘాటు కోసం దాల్చిన చెక్కను వినియోగిస్తారు. ఇక బిర్యానీల వంటి ఘాటు ఘుమఘుమల సమయంలో దాల్చిన చెక్క కచ్చితంగా ఉండాల్సిందే. మరీ ముఖ్యంగా ఆదివారాల్లో చేసే మటన్ చికెన్‌ వంటకాల్లో దీని వినియోగం విరివిగా ఉంటుంది. ఈ దాల్చిన చెక్క గుండెకు సంబంధించిన వ్యాధుల నుంచి కాపాడడం, రక్తనాళాలను శుభ్రం చేయడమే కాక.. బుద్ధిని కూడా వికసింపజేస్తుంది.

ఏలకులు:
సుగంధ ద్రవ్యాల గురించి చెప్పుకుంటున్నామంటే అందులో కచ్చితంగా ఏలకులు ఉండాల్సిందే. పిండివంట ఏది చేసినా ఈ యాలకులు తప్పనిసరి. వీటికుండే సువాసన అలాంటిది. వీటినే ఇలాచీ అని పిలుస్తారు. దీనిని ఉపయోగించి ఇలాచీ టీ అని ప్రత్యేకంగా ఓ టీ కూడా ఉంది. ఈ టీని చాలా మంది ఇష్టపడతారు. ఏలకులలో విటమిన్ ఏ, విటమిన్ సీ, కాల్షియం, ఐరన్, జింక్ వంటి పోషకాలుంటాయి. వీటి కారణంగా శరీరంలో రక్తం గడ్డకుండా రక్త ప్రసరణని మెరుగుపడుతుంది. దీనివల్ల రక్తాన్ని పంపు చేయడంలో గుండెకు శ్రమ తగ్గుతుంది.

ఇవండీ.. సుగంధ ద్రవ్యాల వల్ల కలిగే లాభాలు. మరి మీ గుండెను కాపాడుకోవాలంటే మీ ఆహారంలో ఈ సుగంధ ద్రవ్యాలు కచ్చితంగా ఉండేలా చూసుకోండి ఓకేనా!


పీరియడ్స్ దాచి పెట్టి పెళ్ళి

2028కల్లా చైనా నెంబర్ వన్.. అమెరికాకు షాక్ తప్పదు

రాజ్ తరుణ్‌ ఇంటికెళ్లి మరీ ఐలవ్యూ చెప్పిన ఆవికా గోర్

రవితేజ కథని గోపీచంద్ చేస్తున్నాడా..?

ప్రభాస్ సినిమాల రిలీజ్ డేట్ లు ఇవేనా..?

పుష్ప లో విలన్ ని ఎందుకు సస్పెన్స్ గా ఉంచుతున్నారు..?

ఆ స్టార్ హీరోయిన్ కు అందంతో పాటు చదువు ఆమె సొంతం?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>