PoliticsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sanjay3863726d-da81-4d8e-be9c-fc2651ead780-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sanjay3863726d-da81-4d8e-be9c-fc2651ead780-415x250-IndiaHerald.jpgబీజేపీ తెలంగాణ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజ‌య్‌ కుమార్ ను బీజేపీ అధిష్టానం స‌క్సెస్ ఫుల్ లీడ‌ర్‌గా భావిస్తోంది. దీంతో హైకమాండ్‌ ఆయనకు అద‌న‌పు బాధ్యతలు కట్టబెట్టే ప‌నిలో ఉన్నట్లు తెలుస్తోంది. సంజయ్‌ సేవలను తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా వినియోగించుకునేందుకు చూస్తుంది. sanjay;auto;allu aravind;kumaar;raghu;tiru;bharatiya janata party;andhra pradesh;telangana;janasena;tirupati;husband;letter;mim party;success;ycp;janasena party;partyబండి సంజయ్ కి తిరుపతి ఉప ఎన్నిక బాధ్యత...?బండి సంజయ్ కి తిరుపతి ఉప ఎన్నిక బాధ్యత...?sanjay;auto;allu aravind;kumaar;raghu;tiru;bharatiya janata party;andhra pradesh;telangana;janasena;tirupati;husband;letter;mim party;success;ycp;janasena party;partySat, 26 Dec 2020 19:58:56 GMTబీజేపీ తెలంగాణ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజ‌య్‌ కుమార్ ను బీజేపీ అధిష్టానం స‌క్సెస్ ఫుల్ లీడ‌ర్‌గా భావిస్తోంది. దీంతో హైకమాండ్‌ ఆయనకు అద‌న‌పు బాధ్యతలు కట్టబెట్టే ప‌నిలో ఉన్నట్లు తెలుస్తోంది. సంజయ్‌ సేవలను తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా వినియోగించుకునేందుకు చూస్తుంది. ఇందులో భాగంగా త్వరలో ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లో బండి సంజయ్ తో ప్రచారం చేయించాల‌ని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే అంతకంటే ముందుగానే సంజయ్‌ను తిరుప‌తికి పంపించి అక్కడ బీజేపీపై హైప్ తీసుకురావాలని కమలనాథులు ప్లాన్‌ చేస్తున్నారట.
ఇదే అంశంపై ప్రస్తుతం పార్టీలో చర్చలు జరుగుతున్నాయనే టాక్‌ వినిపిస్తోంది. నిజానికి ఈనెలఖారులో బండి సంజయ్ తిరుపతి టూర్‌ ఉండొచ్చని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నా.. బిజీ షెడ్యూల్ వలన ఆయన పర్యటన‌ కొత్త ఏడాది మొదట్లో ఉంటుందని సమాచారం. 2021 మార్చిలో తిరుపతి ఉప ఎన్నిక జరిగే అవకాశముందనీ.. నోటిఫికేషన్ రాకముందే సంజయ్‌ను తిరుపతికి పంపటం ద్వారా ఎన్నికల వేడిని రాజేయాలనేది కమలనాథుల ఆలోచనగా చెబుతున్నారు. మరోవైపు తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేయాలని బీజేపీ తన మిత్రపక్షమైన జనసేన పార్టీ భావిస్తున్నది. అయితే సంజ‌య్ తిరుపతి వెళ్ళి వ‌స్తే ఎవరు పోటీచేసినా కచ్చితంగా బలం‌ పెరుగుతోందన్న భావ‌న‌లో కమలం పార్టీ పెద్దలు ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు తెలంగాణతో పోల్చుకుంటే ఏపీ రాజకీయాలు పూర్తి భిన్నంగా ఉంటాయి. తెలంగాణలో ఎంఐఎంను బీజేపీ టార్గెట్ చేస్తూ వస్తోంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా మత మార్పిళ్లను ఏపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని కమలనాథులు ఆరోపిస్తున్నారు. తిరుమల కొండపై అన్యమత ప్రచారాలు జరుగుతున్నాయన్న అంశాలను ప్రచారాస్త్రాలుగా మలుచుకోవాలని చూస్తున్నారట. బండి సంజయ్‌తో పాటు ధర్మపురి అరవింద్, రాజాసింగ్, రఘునందనరావులను సైతం తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి పంపాలని బీజేపీ హైకమాండ్‌ ఆలోచిస్తుందట. అయితే తెలంగాణ‌లో సక్సెస్ అయిన బండి సంజయ్ ఫార్ములా ఆంధ్రప్రదేశ్‌లో ఏ మేరకు ఫలిస్తుందో వేచిచూడాలి.


ఆదాయంలో దుమ్ములేపిన బుమ్రా.. కోహ్లీ ని వెనక్కి నెట్టేశాడు..?

రాదేశ్యామ్ కోసం అదిరిపోయే ప్లాన్ రెడీ..విడుదల అప్పుడేనట.?

సలార్ దిగేది అపుడే.... ప్రభాస్ ఫ్యాన్స్ హుషార్ ?

సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ మాములుగా లేదుగా...

ప్రమాణాలతో వేడెక్కిన విశాఖ రాజకీయం ?

కేటీఆర్ ను ఎందుకు సీఎం చేయబోతున్నారు..?

బ్యాంకుల ముందు చెత్త... కేంద్రం రంగంలోకి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>