PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-tadipatri-politics-advantage-to-jc-family-e1b9a997-7bca-42de-9b39-4bbc125ecb4b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-tadipatri-politics-advantage-to-jc-family-e1b9a997-7bca-42de-9b39-4bbc125ecb4b-415x250-IndiaHerald.jpgఇప్పుడు ఏపీలో తాడిపత్రి నియోజకవర్గం బాగా హైలైట్ అయ్యింది. సోషల్ మీడియాలో తనపై నెగిటివ్ పోస్టులు పెడుతున్నారని చెప్పి తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికెళ్ళి హల్చల్ చేసిన విషయం తెలిసిందే. జేసీ ఫ్యామిలీ ఇంట్లో లేని సమయంలో పెద్దారెడ్డి వెళ్ళి, దాడి చేశారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పోలీసుల సాయంతోనే పెద్దారెడ్డి దాడి చేశారని జేసీ అనుచరులు ఫైర్ అవుతున్నారు. jc diwakar;prabhakar;prabhakar reddy;tiru;jagan;2019;scheduled caste;scheduled tribes;police;television;chintamaneni prabhakar;mla;tdp;ycp;parakala prabhakar;reddyతాడిపత్రి పాలిటిక్స్...ఫుల్ అడ్వాంటేజ్ వచ్చేలా ఉందే!తాడిపత్రి పాలిటిక్స్...ఫుల్ అడ్వాంటేజ్ వచ్చేలా ఉందే!jc diwakar;prabhakar;prabhakar reddy;tiru;jagan;2019;scheduled caste;scheduled tribes;police;television;chintamaneni prabhakar;mla;tdp;ycp;parakala prabhakar;reddySat, 26 Dec 2020 02:00:00 GMTవైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికెళ్ళి హల్చల్ చేసిన విషయం తెలిసిందే. జేసీ ఫ్యామిలీ ఇంట్లో లేని సమయంలో పెద్దారెడ్డి వెళ్ళి, దాడి చేశారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పోలీసుల సాయంతోనే పెద్దారెడ్డి దాడి చేశారని జేసీ అనుచరులు ఫైర్ అవుతున్నారు.

ఇక అందుకు తగ్గా సి‌సి టీవీ ఫుటేజ్ ఉన్నా సరే పోలీసులు కేసు నమోదు చేసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు. అయితే ప్రభాకర్ రెడ్డి సైతం కేసు పెట్టనని, పోలీసులే సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో పెద్దరెడ్డి అనుచరుడు ఇచ్చిన ఫిర్యాదుతో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి వారి అనుచరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం గమనార్హం. దీనిపై కూడా టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.

ఇంటికొచ్చి దాడి చేసిన పెద్దారెడ్డిని వదిలేసి జేసీ ఫ్యామిలీపై కేసు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ పరిణామాలన్ని జేసీ ఫ్యామిలీకే అడ్వాంటేజ్ అవుతాయని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. మామూలుగానే తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీకి తిరుగులేదు. ఏ పార్టీలో ఉన్నా సరే 1985 నుంచి 2014 వరకు తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీకి ఓటమి తెలియదు. కానీ 2019 ఎన్నికల్లో జగన్ వేవ్‌లో ప్రభాకర్ తనయుడు అస్మిత్ టీడీపీ నుంచి పోటీ చేసి పెద్దారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

అయితే తర్వాత నుంచి జరుగుతున్న పరిణామాలు జేసీ ఫ్యామిలీకే అడ్వాంటేజ్ తెస్తున్నాయని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం కక్ష పూరితంగా జైలుకు పంపించిందని, ఇప్పుడు ఎమ్మెల్యేని దాడి చేయడం లాంటి అంశాలు కలిసొస్తాయని చెబుతున్నారు. మొత్తానికి చూసుకున్నట్లైతే ఈ గొడవ వల్ల తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.




ఆ మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీలను ఎలా అవుట్ చేశానంటే.. సీక్రెట్ చెప్పిన పాక్ పేసర్

విక్రమ్ ‘కోబ్రా’ కొత్త లుక్ చూశారా..? వామ్మో ఇలా ఉన్నాడేంటి..!

ఆ సినిమా అర్ధంతరంగా తప్పుకున్న రవితేజ.. కారణం ఏంటంటే?

చిన్నారి ఫ్యాన్‌‌కు బన్నీ సర్‌ప్రైజ్ గిఫ్ట్

పాదయాత్రలోనే నిర్ణయం తీసుకున్నా: సీఎం జగన్

యాలకుల టీ వల్ల కలిగే ప్రయోజనాలు వింటే షాక్ అవ్వాల్సిందే?

12 ఏళ్ల బుడ్డోడు.. గిన్నీస్ రికార్డు కొట్టాడు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>