MoviesP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/saidharam-tejb0787302-9ec9-4b18-a539-e94eeec191d9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/saidharam-tejb0787302-9ec9-4b18-a539-e94eeec191d9-415x250-IndiaHerald.jpgసుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ - నభా నటేష్ జంటగా నటించిన తాజా చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్'. క్రిస్మస్ కానుకగా థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కరోనా కారణంగా దాదాపు పది నెలలుగా మూత పడిన సినిమా హాళ్ల బూజులు దులిపింది ఈ సినిమా కోసమే. ఈ సినిమాతోనే మళ్లీ థియేటర్స్ బిజినెస్ ప్రారంభమైంది.saitej;business;nabha natesh;prasad;sai dharam tej;christmas;andhra pradesh;telangana;cinema;hero;supreme;solo bathuke so better;sri venkateswara cine chitra‘సోలో బ్రతుకే..’ తొలి రోజు కలెక్షన్లు ఏ రేంజ్‌లో ఉన్నాయంటే..‘సోలో బ్రతుకే..’ తొలి రోజు కలెక్షన్లు ఏ రేంజ్‌లో ఉన్నాయంటే..saitej;business;nabha natesh;prasad;sai dharam tej;christmas;andhra pradesh;telangana;cinema;hero;supreme;solo bathuke so better;sri venkateswara cine chitraSat, 26 Dec 2020 15:13:59 GMTసుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ - నభా నటేష్ జంటగా నటించిన తాజా చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్'. క్రిస్మస్ కానుకగా థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కరోనా కారణంగా దాదాపు పది నెలలుగా మూత పడిన సినిమా హాళ్ల బూజులు దులిపింది ఈ సినిమా కోసమే. ఈ సినిమాతోనే మళ్లీ థియేటర్స్ బిజినెస్ ప్రారంభమైంది. సుబ్బు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జీ స్టూడియోస్ ద్వారా ఈ సినిమా విడుదలైంది. సుమారు పది నెలల తర్వాత థియేటర్లు తెరుచుకున్నాయి.. మరి ప్రేక్షకులు వస్తారా? అనే అనుమానాలను ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా పటాపంచలు చేసినట్లే. ఎందుకంటే భారీ అంచనాలతో థియేట్రికల్ రిలీజైన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. దీంతో సినీ అభిమానులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొదటి ఆట నుంచే ఈ సినిమాకు డీసెంట్ కలెక్షన్లు రావడం శుభసూచకం అని ట్రేడ్ నిపుణులు చెప్తున్నారు.

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఫస్ట్ డే నూన్ షో ల వరకు కలెక్షన్స్ చూసుకుంటేనే సుమారు 91.37 లక్షల గ్రాస్ వచ్చిందట. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఈ మెగా హీరో సినిమా తొలి రోజు సుమారు 4 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. కరోనా సమయంలో ఇలాంటి కలెక్షన్స్ అందుకోవడం మంచి విషయమే అని సినీ వర్గాలు అంటున్నాయి. అయితే ప్రధాన నగరాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయకపోవడం కలెక్షన్లపై తీవ్రంగా ప్రభావం చూపిందని.. లేకపోతే ఇంకా ఎక్కువ రాబట్టేదని ట్రేడ్ నిపుణులు చెప్తున్నారు. రాబోయే వారం రోజుల కలెక్షన్లను బట్టి సినిమా రిజల్ట్ ని అంచనా వేయొచ్చని వాళ్లు అంటున్నారు.


పిడుగురాళ్లకు వెళ్తున్న బాలయ్య..ఎందుకో తెలుసా..??

లవ్ యూ వినీత్ కామెంట్స్ మీద అరియానా క్లారిటీ అంతకు మించి అట !

అనాస పండు డయాబెటిస్ రోగులకు ఎందుకు హానికరము తెలిస్తే షాక్ అవుతారు?

తెలంగాణ రాష్ట్రం లో మరో ఘోర రోడ్డు ప్రమాదం .. ఈసారి ఏకంగా నలుగురు

ఈ లక్షణాలుంటే మీరు హార్ట్ ఎటాక్‌కు దగ్గరపడ్డట్లే..!

పీరియడ్స్ దాచి పెట్టి పెళ్ళి

గుండె బాగుండాలంటే ఇవి తప్పక తినండి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>