EducationSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/ap-exams0ad9d801-467d-4768-8485-3278c82889ee-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/ap-exams0ad9d801-467d-4768-8485-3278c82889ee-415x250-IndiaHerald.jpgఎందుకని కరోనా వచ్చిందో గానీ ఒక్కసారిగా ప్రపంచం తల క్రిందులైంది.. వాణిజ్య , వ్యాపారాలు కూడా పూర్తిగా మారిపోయాయి.. ఇంకా చెప్పాలంటే విద్యార్థుల జీవితాలు పూర్తిగా మారి పోయాయి.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలకు కొత్త రకం కరోనా వైరస్ ముంచుకొస్తుంది. ఇకపోతే విద్యార్థులకు ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా ఈ ఏడాదిని పూర్తి చేయడానికి ప్రభుత్వం సత్వర ప్రయత్నాలు చేస్తున్నారు.. వచ్చే ఏడాదికి సంబందించిన విద్యా క్యాలెండర్ ను ఇటీవలే విడుదల చేసింది.ap exams;sathwara;2019;lie;coronavirusపదో తరగతి విద్యార్థులకు సంతోషాన్ని కలిగించే వార్త..పదో తరగతి విద్యార్థులకు సంతోషాన్ని కలిగించే వార్త..ap exams;sathwara;2019;lie;coronavirusSat, 26 Dec 2020 18:00:00 GMTకరోనా వైరస్ ముంచుకొస్తుంది. ఇకపోతే విద్యార్థులకు ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా ఈ ఏడాదిని పూర్తి చేయడానికి ప్రభుత్వం సత్వర ప్రయత్నాలు చేస్తున్నారు.. వచ్చే ఏడాదికి సంబందించిన విద్యా క్యాలెండర్ ను ఇటీవలే విడుదల చేసింది.



ఇది ఇలా ఉండగా, పరీక్షలను ఉన్నవాటి కంటే తక్కువ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్న విషయం తెలిసిందే.. పదో తరగతి పరీక్షలను ఈ ఏడాది ఆరు ప్రశ్నపత్రాలకే పరిమితం చేయనున్నారు. అంతకుముందు 11 ప్రశ్నపత్రాలు ఉండగా కరోనా కారణంగా గతేడాది ఆరు పేపర్లకు తగ్గించినట్లు ప్రకటించినా.. తుదకు పరీక్షలే జరపలేదు. అప్పట్లో ఈ ఉత్తర్వులు ఆ ఏడాదికేనని ప్రభుత్వం పేర్కొంది. అవే ఉత్తర్వులు ఈ ఏడాదికీ పొడిగించే అవకాశం ఉంది. 2019-20లో మొదట అంతర్గత మార్కులు, బిట్‌ పేపర్‌ను తొలగించారు. ప్రతి సబ్జెక్టు లోనూ 100 మార్కులకు ప్రశ్నలే ఉండేలా మార్పు చేశారు.. అయితే ఈ విధానం లో ఒక్క ప్రశ్న పత్రంతో పరీక్షలు నిర్వించనున్నట్లు తెలుస్తుంది..



సిలబస్ లో 30 శాతం తగ్గించిన ప్రభుత్వం ఇప్పుడు ప్రశ్నా పత్రాలను కూడా తగ్గించడం ఒకందుకు మంచిదేనని అభిప్రాయ పడుతున్నారు. ఆరు పేపర్లతో పాటు పరీక్ష సమయాన్ని అర గంట పెంచనున్నట్లు ప్రకటించారు. ఈ దఫా కూడా పరీక్ష సమయాన్ని 2.45 గంటల నుంచి 3.15 గంటల పాటు ఇవ్వనున్నారు. కొత్త విధానం లో ప్రశ్నల సంఖ్యను కాకుండా మార్కులను మాత్రమే పెంచనున్నారు. 50 మార్కుల పేపర్లు 100 అవుతాయి.గత ఏడాది పరీక్షలను కుదిస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం కరోనా కారణంగా ఆ ఆలోచనను విరమించుకొంది.. ఇప్పుడు అదే నిర్ణయాన్ని కొనసాగిస్తుంది..


బ్యాంకుల ముందు చెత్త... కేంద్రం రంగంలోకి

"ఆచార్య "మూవీలో సెకండ్ హీరోయిన్ గా ఆమెను ఎంచుకున్నారట.

ఆ సినిమా ప్లాప్ కావడంతో దుప్పటి కప్పుకుని ఏడ్చేశా: చిరంజీవి

ఎంత చేసినా పులివెందుల రుణం తీర్చుకోలేను: ముఖ్యమంత్రి జగన్

మసాలా దినుసులతో గుండెజబ్బులకు చెక్ పెట్టవచ్చా?

యస్.. రేవంత్ రెడ్డికే ఇవ్వాలి

విద్యార్థులకు గుడ్ న్యూస్.. దేశంలోనే తొలిసారి!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>