MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_oldisgold/relation-between-ntr-naa-desham-movie-and-tdp-party7e59a226-f837-454b-9fe1-305778fc3b88-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_oldisgold/relation-between-ntr-naa-desham-movie-and-tdp-party7e59a226-f837-454b-9fe1-305778fc3b88-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీకి, ఎన్టీఆర్ నటించిన నా దేశం సినిమాకి చాలా దగ్గర కనెక్షన్ ఉంది. 1982 లో వచ్చిన జస్టిస్ చౌదరి, బొబ్బిలిపులి సినిమాలు ఎన్టీఆర్ లోని మరో కోణాన్ని బయటపెట్టాయి. అప్పుడే ఆయన రాజకీయాల్లోకి రావాలనుకున్నారు.naa desham movie;koti;ntr;choudary actor;paruchuri brothers;tiru;andhra pradesh;congress;cinema;telugu;rajani kanth;history;october;nandamuri taraka rama rao;march;lie;partyఎన్టీఆర్ నా దేశం చిత్రానికి, తెలుగుదేశం పార్టీకి ఉన్న సంబంధం?ఎన్టీఆర్ నా దేశం చిత్రానికి, తెలుగుదేశం పార్టీకి ఉన్న సంబంధం?naa desham movie;koti;ntr;choudary actor;paruchuri brothers;tiru;andhra pradesh;congress;cinema;telugu;rajani kanth;history;october;nandamuri taraka rama rao;march;lie;partySat, 26 Dec 2020 19:00:00 GMTఎన్టీఆర్ నటించిన నా దేశం సినిమాకి చాలా దగ్గర కనెక్షన్ ఉంది. 1982 లో వచ్చిన జస్టిస్ చౌదరి, బొబ్బిలిపులి సినిమాలు ఎన్టీఆర్ లోని మరో కోణాన్ని బయటపెట్టాయి. అప్పుడే ఆయన రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. హీరోగా ప్రజలని రంజింపజేయడంలో ఉన్న తృప్తి కంటే, ప్రజాసేవ ద్వారా ప్రజలని రంజింపజేయడంలో ఉన్న సంతృప్తే ఎక్కువని నమ్మి 1982 మార్చి 29 నాడు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. జస్టిస్ చౌదరి, బొబ్బిలిపులి సినిమాలు తనలో నాయకుడు పుట్టడానికి కారణమైతే, అదే సంవత్సరంలో వచ్చిన 'నా దేశం' సినిమా ఎన్టీఆర్ లో ఉన్న నాయకుడు ప్రజల గుండెల్లో పుట్టడానికి కారణం అయ్యింది. పార్టీ పేరు అనౌన్స్ చేసిన దాదాపు మూడున్నర నెలల తర్వాత 1982 జూలై 22 న నా దేశం సినిమా షూటింగ్ మొదలైంది. అక్టోబర్ 27 న సినిమా రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయిన 70 రోజులకే సిఎం అయ్యారు. సినిమా రిలీజైన నెల రోజులకి నా దేశం సినిమా పది కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది. సినిమా అనేది కొన్ని వందల మందిని ప్రభావితం చేస్తుందనడానికి ఈ సినిమానే నిదర్శనం. కొన్ని సార్లు ఆయా సినిమాల్లో నటించేవారిని కూడా ప్రభావితం చేస్తుందనడానికి కూడా ఈ సినిమానే నిదర్శనం. అప్పటి వరకూ హీరోగా ఉన్న ఎన్టీఆర్ ను నాయకుడిగా చేసిందీ సినిమా. ప్రజానాయకుడిగా నిలబెట్టింది. రాజకీయాల్లో రావాలనుకున్నారు. నా దేశం సినిమాతో తను రాజకీయాల్లోకి రాబోతున్నానని హింట్ ఇచ్చారు. వచ్చారు. ప్రభంజనం సృష్టించారు. రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు. అప్పట్లో 40 లక్షలు పెట్టుబడి పెడితే కోటి రూపాయలకు పైగానే వసూలు చేసింది ఈ సినిమా. అంటే ఇప్పటి లెక్కల ప్రకారం 200 కోట్లకు పైమాటే. అంత పెద్ద రికార్డ్ సృష్టించిన ఈ సినిమా ఎన్టీఆర్ ని ఇంకో లెవల్ కి తీసుకెళ్లింది. కె.బాపయ్య దర్శకత్వం, పరుచూరి బ్రదర్స్ రాసిన పదునైన డైలాగులు, వాటిని ఎన్టీఆర్ పలికిన విధానం జనాన్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఒక రాజకీయ నాయకుడే మన ముందుకొచ్చి ప్రసంగం ఇస్తే ఎలా ఉంటుందో అంతలా ఎన్టీఆర్ చెప్పిన ఒక్కో డైలాగు ప్రేక్షకుల గుండెల్లో గుచ్చుకున్నాయి. అలా ఈ సినిమా అప్పటి వరకూ జనం దృష్టిలో సూపర్ స్టార్ గా ఉన్న ఎన్టీఆర్ ని జనానికి నాయకుడిగా పరిచయం చేసింది. అప్పటి కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ ని చూస్తున్న చిన్నచూపును అవమానంగా ఫీలయిన ఎన్టీఆర్, ఆంధ్రుల గౌరవాన్ని కాపాడేందుకు, హక్కులను సాధించేందుకు, తెలుగు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని అరికట్టేందుకు 1982 లో పార్టీ స్థాపించి 1983 లో ముఖ్యమంత్రిగా పోటీ చేసి తిరుగులేని మెజారిటీతో గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సిఎంగా చరిత్ర సృష్టించారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే సిఎం అవ్వడం అంటే మాటలు కాదు. అది ఒక్క ఎన్టీఆర్ కి మాత్రమే సాధ్యపడింది. అలా నా దేశం సినిమా ఎన్టీఆర్ ని తెలుగుదేశం పార్టీకి, ఎన్టీఆర్ కి ఎంతో ఉపయోగపడింది. సినిమాలు చూసే ప్రేక్షకులనే కాదు, సినిమాలు చేసే నటులని కూడా ప్రభావితం చేస్తాయని నిరూపించిందీ సినిమా. 


తెలుగు రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు గాలికొదిలిన థియేటర్లు!

రాదేశ్యామ్ కోసం అదిరిపోయే ప్లాన్ రెడీ..విడుదల అప్పుడేనట.?

సలార్ దిగేది అపుడే.... ప్రభాస్ ఫ్యాన్స్ హుషార్ ?

సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ మాములుగా లేదుగా...

ప్రమాణాలతో వేడెక్కిన విశాఖ రాజకీయం ?

కేటీఆర్ ను ఎందుకు సీఎం చేయబోతున్నారు..?

బ్యాంకుల ముందు చెత్త... కేంద్రం రంగంలోకి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>