EditorialMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrf82f91da-c372-46ef-800b-44d713cf6560-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrf82f91da-c372-46ef-800b-44d713cf6560-415x250-IndiaHerald.jpgమరక మంచిదే నా అంటే తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ విషయంలో అది మంచిదే అన్నట్లుగా కనిపిస్తోంది. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి చూసుకుంటే ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూనే 2014లో అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి తిరుగులేకుండా విజయాలను నమోదు చేసుకుంటూ, బలహీనంగా ఉన్న తమ రాజకీయ ప్రత్యర్థులను మరింత బలహీనపరిచి, టిఆర్ఎస్ బలోపేతం అయ్యింది. ఇక భవిష్యత్తులోనూ టిఆర్ఎస్ కు ఎదురు ఉండదు అనే అభిప్రాయంతో, ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఉంటూ వచ్చారు. దానికి తగ్గట్టుగానే ఆయన నిర్ణయాలు తీసుకున్నారు. ఇక తన కుమారుడు, కుమార్తె ఇkcr trs telangana bjp elections ktr hareesh;kcr;ktr;tiru;bharatiya janata party;telangana;government;minister;success;partyఎడిటోరియల్ : కేసీఆర్ లో ఏంటి ఈ మార్పు ? మరక మంచిదేనా ?ఎడిటోరియల్ : కేసీఆర్ లో ఏంటి ఈ మార్పు ? మరక మంచిదేనా ?kcr trs telangana bjp elections ktr hareesh;kcr;ktr;tiru;bharatiya janata party;telangana;government;minister;success;partySat, 26 Dec 2020 16:00:00 GMTతెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ విషయంలో అది మంచిదే అన్నట్లుగా కనిపిస్తోంది. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి చూసుకుంటే ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూనే 2014లో అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి తిరుగులేకుండా విజయాలను నమోదు చేసుకుంటూ, బలహీనంగా ఉన్న తమ రాజకీయ ప్రత్యర్థులను మరింత బలహీనపరిచి, టిఆర్ఎస్ బలోపేతం అయ్యింది. ఇక భవిష్యత్తులోనూ టిఆర్ఎస్ కు ఎదురు ఉండదు అనే అభిప్రాయంతో, ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఉంటూ వచ్చారు. దానికి తగ్గట్టుగానే ఆయన నిర్ణయాలు తీసుకున్నారు. ఇక తన కుమారుడు, కుమార్తె ఇద్దరూ రాజకీయాల్లో ఉన్నత పదవులను అనుభవిస్తున్నారు. ఇక అంతా తమ ఇష్టారాజ్యం అన్నట్లు గా వ్యవహరిస్తున్న సమయంలో, అకస్మాత్తుగా బిజెపి తెలంగాణలో బలం పెంచుకోవడంతో పాటు, ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ కి సవాల్ విసిరే స్థాయికి వెళ్లింది.



ఇలా ఎన్నో రకాలుగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, పై చేయి సాధిస్తూ ప్రతిదశలోనూ విజయం సాధించే విషయంలో సక్సెస్ అవుతూ వస్తోంది. దీంతో ప్రజల్లోనూ టిఆర్ఎస్ పరిపాలన పై చర్చ మొదలైంది. ఎన్నికలలో సిట్టింగ్ స్థానం కోల్పోవడం, గ్రేటర్  ఎన్నికలలో వందకు పైగా డివిజన్లను సాధిస్తామనే ధీమాతో ఉంటూ వచ్చినా, బొటాబొటిగా విజయం దక్కడం, ఇప్పుడు సొంతంగా అభ్యర్థిని సైతం నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో ఉండడం, ఇలా ఎన్నో వ్యవహారాలు టిఆర్ఎస్ లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఒకవేళ దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు వస్తే పరిస్థితి ఏమిటనే విషయంపైనా కెసిఆర్ దృష్టి సారించారు. అందుకే ఇప్పటి నుంచే పూర్తిగా పరిపాలనపై దృష్టి పెట్టారు.


అలాగే పార్టీని ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారు. ముందుగా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తన మేనల్లుడు హరీష్ రావు కు అప్పగించి, ఇక ఆయనకు పూర్తిగా పార్టీ బాధ్యతలు అప్పగించి స్వతంత్రం గా ఆయన వ్యవహరించేలా చేసేందుకు సిద్ధమయ్యారు. గతంలో హరీష్ కు కేసీఆర్ పై పెద్దగా నమ్మకం లేనట్టుగానే వ్యవహరించారు. రెండోసారి గెలిచిన తర్వాత మొదటి విడతలో ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా చేశారు. అయినా ఎక్కడా అసంతృప్తికి గురి అవకుండా హరీష్ పార్టీ వీర విధేయుడిగా పనిచేస్తూ వచ్చారు.


 ఇక తన కుమారుడు కేటీఆర్ కు తెలంగాణ సీఎం బాధ్యతలు అప్పగించి, ఆయన వద్ద ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి హరీష్ కు ఇచ్చి తెరవెనుక ఉండి రాజకీయ చక్రం తిప్పాలనే ఆలోచనలో కెసిఆర్ ఉన్నారు. అలాగే పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ, క్షేత్రస్థాయిలో జరుగుతున్న లోటు పాట్లను గుర్తించి, వాటిని సరిదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పథకాలనుప్రజల్లో తీసుకెళ్లినా, టిఆర్ఎస్ పార్టీపై సానుకూలత ఉంది అని భావిస్తూ వచ్చినా అవేమీ కాపాడలేవు అనే విషయాన్ని కెసిఆర్ కాస్త ఆలస్యంగా గుర్తించారు. ఇప్పుడు పూర్తిగా పార్టీని, ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేసి, రాబోయే ఎన్నికల్లో బీజేపీకి అవకాశం లేకుండా చేసేందుకు కెసిఆర్ నడుం బిగించారు.



అలాగే యువతలో పార్టీపై వ్యతిరేకత ఉండడాన్ని గుర్తించి, పెద్దఎత్తున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అలాగే ప్రతి ఎన్నికల్లోనూ కీలకంగా ఉంటూ వస్తున్న ఉద్యోగులను ఆకట్టుకునేందుకు వారికి పీఆర్సీ ప్రకటించారు. ఇలా ఎన్నో కార్యక్రమాల ద్వారా టిఆర్ఎస్ కు ఎదురు లేకుండా చేసుకునేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఈ మార్పు ఖచ్చితంగా టీఆర్ ఎస్ ప్రభుత్వంపై సానుకూలత పెంచేదిగానే కనిపిస్తోంది.


ఎంత చేసినా పులివెందుల రుణం తీర్చుకోలేను: ముఖ్యమంత్రి జగన్

మసాలా దినుసులతో గుండెజబ్బులకు చెక్ పెట్టవచ్చా?

యస్.. రేవంత్ రెడ్డికే ఇవ్వాలి

విద్యార్థులకు గుడ్ న్యూస్.. దేశంలోనే తొలిసారి!

పోలీసులదే తప్పా...? అనంతపురం ఘటనపై జగన్ స్పీడ్ గా స్పందించలేదా...?

నునుపైన" ముఖ చర్మాని"కి ఆరోగ్య చిట్కాలు.

సీఎం చంద్రబాబు చేసేందేమిటి..?: ఎమ్మెల్యే వల్లభనేని వంశీ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>