PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/apsrtc-new-app-for-passengersedbfafff-6e74-42c3-8675-f688ddcde573-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/apsrtc-new-app-for-passengersedbfafff-6e74-42c3-8675-f688ddcde573-415x250-IndiaHerald.jpgఏపీలో ఇకపై బస్ కండక్టర్ల వద్ద టికెట్ కొట్టే మిషన్లు కనిపించవు. అతి త్వరలో వీటికి ప్రత్యామ్నాయం రాబోతోంది. ఇప్పటి వరకూ టికెట్ కొట్టి ఇచ్చే టిమి మిషన్లలో కేవలం టికెట్ ప్రింటింగ్ మినహా ఇతర సాఫ్ట్ వేర్ ఏదీ ఉండదు. అయితే తొలిసారిగా టిమి మిషన్ల స్థానంలో ఈపోస్ యంత్రాలను ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఇది రేషన్ షాపుల్లో వేలిముద్రలు వేయించుకునే మిషన్ లాంటిది అనమాట. ఇకపై ఏ బస్సులో అయినా కండక్టర్ టికెట్ కొడితే వెంటనే ఆ సమాచారం సెంట్రల్ సర్వర్ కి ఈపోస్ మిషన్ ద్వారా చేరిపోతుంది. ఏ బస్ లో ఎంతమందికి టapsrtc;bus;king;conductor;king 1;software;central governmentఇకపై బస్ కండక్టర్ల దగ్గర టిమ్ మిషన్లు ఉండవు..ఇకపై బస్ కండక్టర్ల దగ్గర టిమ్ మిషన్లు ఉండవు..apsrtc;bus;king;conductor;king 1;software;central governmentSat, 26 Dec 2020 11:00:00 GMTసాఫ్ట్ వేర్ ఏదీ ఉండదు. అయితే తొలిసారిగా టిమి మిషన్ల స్థానంలో ఈపోస్ యంత్రాలను ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఇది రేషన్ షాపుల్లో వేలిముద్రలు వేయించుకునే మిషన్ లాంటిది అనమాట. ఇకపై ఏ బస్సులో అయినా కండక్టర్ టికెట్ కొడితే వెంటనే ఆ సమాచారం సెంట్రల్ సర్వర్ కి ఈపోస్ మిషన్ ద్వారా చేరిపోతుంది. ఏ బస్ లో ఎంతమందికి టికెట్ కొట్టారు, ఏ సీటు రిజర్వేషన్ అయింది, అనే విషయం ఎప్పటికప్పుడు సెంట్రల్ సర్వర్ లో నిక్షిప్తం అవుతుంది. దీంతో ప్రయాణికులకు మరింత వెసులుబాటు కలుగుతుందని, బస్సు స్టేషన్ కి వచ్చే లోపే లోపల ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయనే విషయం తెలిసిపోతుందని అంటున్నారు అధికారులు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఓ యాప్ ని డిజైన్ చేస్తున్నారు. అతి త్వరలో ఇది ఏపీలోని ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది.

ముందుగా టికెట్‌ బుక్‌ చేసుకున్న బస్ ‌ను ప్రయాణికుడు అందుకోలేకపోయినా.. అదే రూట్‌లో తర్వాత వచ్చే మరో సర్వీసులోకి మార్చుకునే అవకాశం వస్తుంది. ఇలా దాదాపు 12-15 రకాల సేవలను ఒకే యాప్‌లో లభించేలా యూనిఫైడ్‌ టికెటింగ్‌ సొల్యూషన్‌ యాప్‌ ను ఏపీఎస్‌ఆర్టీసీ సిద్ధం చేస్తోంది. గతంలో దీన్ని ప్రథమ్ అనే పేరుతో పిలుస్తున్నా.. పూర్తి స్థాయి మార్పులతో ఇప్పుడీ యాప్ ని సిద్ధం చేస్తున్నారు. ఆర్టీసీలో ఆన్‌ లైన్‌ అడ్వాన్స్‌ టికెట్‌ బుకింగ్‌, బస్‌ ట్రాకింగ్‌, పార్శిల్‌ బుకింగ్ ‌లకు మూడు వేర్వేరు యాప్‌లున్నాయి. ఇకపై ఈ సేవలన్నీ ఒకే యాప్‌లో లభిస్తాయి. ఈ ప్రాజెక్ట్‌ మొత్తానికి రూ.70 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.

డిజిటలైజేషన్‌ ప్రోత్సాహంలో భాగంగా ఈ ప్రాజెక్ట్‌ కు కేంద్రం 10నుంచి 20 కోట్ల రూపాయల సాయం అందిస్తుంది. వచ్చేనెలలో దీనికి సంబంధించి టెండర్లు పిలుస్తారు. ఈ యాప్‌ ద్వారా బుక్‌ అయ్యే ఒక్కో టికెట్‌కు సగటున 15 పైసల చొప్పున టెండరు దక్కించుకునే సంస్థకు కమిషన్‌ ఇస్తారు. పల్లెవెలుగు, సిటీ బస్సులు మొదలు దూర ప్రాంతాలకు వెళ్లే అన్ని తరహా బస్సుల టికెట్లను యాప్‌లో బుక్‌ చేసుకోవచ్చు. ప్రతి బస్సు ట్రాకింగ్ ‌లో కనిపిస్తుంది. ఎంత సమయానికి బస్టాండ్‌ వస్తుందో చూసుకొని ప్రయాణికులు వెళ్లేందుకు వీలుంటుంది. ప్రస్తుతానికి ఆన్‌ లైన్‌ టికెట్‌ బుకింగ్‌ సదుపాయం ఉన్న బస్సుల ట్రాకింగ్‌ మాత్రమే అందుబాటులో ఉంది. ఇకపై దీన్ని అన్ని బస్సులకు అనుసంధానిస్తారు.


రవితేజ కథని గోపీచంద్ చేస్తున్నాడా..?

ప్రభాస్ సినిమాల రిలీజ్ డేట్ లు ఇవేనా..?

పుష్ప లో విలన్ ని ఎందుకు సస్పెన్స్ గా ఉంచుతున్నారు..?

ఆ స్టార్ హీరోయిన్ కు అందంతో పాటు చదువు ఆమె సొంతం?

నిజమైన శాంతా క్లాస్.. అనాధల కోసం కాళ్ళు లేకపోయినా...

హైదరాబాద్‌ రోడ్డుపై సోనూసూద్ హల్‌చల్..

తిరుప‌తిపై వైసీపీ సైలెంట్‌ స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్... ‌!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>