PoliticsP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/murder153d7b0f-74ef-44d5-882c-5b5c46159826-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/murder153d7b0f-74ef-44d5-882c-5b5c46159826-415x250-IndiaHerald.jpgఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు నెలవెల్లి రామారావుపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. ఇలా బీజేపీ నేతపై గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.murder;bharatiya janata party;district;police;mandalam;court;murder.;local language;central government;khammam;partyబీజేపీ నేత హత్య.. జిల్లాలో టెన్షన్ టెన్షన్!బీజేపీ నేత హత్య.. జిల్లాలో టెన్షన్ టెన్షన్!murder;bharatiya janata party;district;police;mandalam;court;murder.;local language;central government;khammam;partySat, 26 Dec 2020 12:00:35 GMTజిల్లా వైరా మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు నెలవెల్లి రామారావుపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. ఇలా బీజేపీ నేతపై గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వైరా మండలంలో బీజేపీ నాయకుడు నేలవెళ్లి రామారావుపై ఈ హత్యాయత్నం జరిగింది. ఆయనపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు శనివారం తెల్లవారుజామున కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆయనను చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడి ఘటనపై విచారణ చేపట్టారు. ఆర్థిక లావాదేవీల కారణంగానే రామారావుపై దాడి జరిగిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కాగా దాడికి పాల్పడిన నిందితుడు మాడపాటి రాజేష్‌ ఇవాళ ఉదయం మధిర కోర్టులో లొంగిపోయాడు.

శనివారం నాడు జరిగిన ఈ దాడిలో రామారావు తీవ్రంగా గాయపడ్డారు.  వెంటనే చికిత్స కోసం ఆయనన్ను ఖమ్మం తరలించారు.  ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రామారావు మృతి చెందారు. దీంతో ఖమ్మంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరి కొన్ని రోజుల్లో ఖమ్మం కార్పొరేషన్ కు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇలాంటి సమయంలో బీజేపీ నేత హత్య జరగడంతో స్థానంకగా ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక విచారణలో తేలినట్లు కేవలం ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అని కూడా విచారణ చేస్తున్నారు. ఇలా బీజేపీ నేత హత్య కావడంపై పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇది రాజకీయ హత్య కూడా కావొచ్చని కొందరు బీజేపీ వాళ్లు అంటున్నారు. పోలీసుల దర్యాప్తు పూర్తయితేనే కానీ ఈ హత్యకు కారణం ఏంటనేది కచ్చితంగా తెలియదు.


రవితేజ కథని గోపీచంద్ చేస్తున్నాడా..?

ప్రభాస్ సినిమాల రిలీజ్ డేట్ లు ఇవేనా..?

పుష్ప లో విలన్ ని ఎందుకు సస్పెన్స్ గా ఉంచుతున్నారు..?

ఆ స్టార్ హీరోయిన్ కు అందంతో పాటు చదువు ఆమె సొంతం?

నిజమైన శాంతా క్లాస్.. అనాధల కోసం కాళ్ళు లేకపోయినా...

హైదరాబాద్‌ రోడ్డుపై సోనూసూద్ హల్‌చల్..

తిరుప‌తిపై వైసీపీ సైలెంట్‌ స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్... ‌!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>