PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-govt-will-announce-prc-to-employees-soon2f971fa8-41e9-4b60-b3a0-854673f292be-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-govt-will-announce-prc-to-employees-soon2f971fa8-41e9-4b60-b3a0-854673f292be-415x250-IndiaHerald.jpgతెలంగాణ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ కొత్త సంవత్సర కానుక అందించబోతున్నారని తెలుస్తోంది. చాలా కాలంగా పెండింగులో ఉన్న పీఆర్సీని ముఖ్యమంత్రి ప్రకటించనున్నారని సమాచారం. ఇప్పటికే పీఆర్సీ నివేదిక సిద్ధమైందని, పీఆర్సీ నివేదిక సీఎం కేసీఆర్ చేతికి చేరిందని చెబుతున్నారు. ఈ నెల 29న ప్రధాన కార్యదర్శికి లాంఛనంగా బిశ్వాల్ కమిషన్ నివేదికను ఇవ్వనుందిprc;kcr;amala akkineni;telangana;district;chief minister;qualification;central government;march;lieతెలంగాణ ఉద్యోగులకు 33 శాతం ఫిట్ మెంట్?తెలంగాణ ఉద్యోగులకు 33 శాతం ఫిట్ మెంట్?prc;kcr;amala akkineni;telangana;district;chief minister;qualification;central government;march;lieSat, 26 Dec 2020 08:54:43 GMTతెలంగాణ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ కొత్త సంవత్సర కానుక అందించబోతున్నారని తెలుస్తోంది. చాలా కాలంగా పెండింగులో ఉన్న పీఆర్సీని ముఖ్యమంత్రి ప్రకటించనున్నారని సమాచారం. ఇప్పటికే
పీఆర్సీ నివేదిక  సిద్ధమైందని,  పీఆర్సీ నివేదిక సీఎం కేసీఆర్ చేతికి చేరిందని చెబుతున్నారు. ఈ నెల 29న ప్రధాన కార్యదర్శికి లాంఛనంగా బిశ్వాల్ కమిషన్ నివేదికను ఇవ్వనుంది. ఉద్యోగ సంఘాల నేతలతో ఈ నెల 30న జరగనున్న సమావేశం తర్వాత.. పీఆర్సీపై కేసీఆరే స్వయంగా ప్రకటన చేస్తారని చెబుతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రగతిభవన్ వర్గాలు ఉద్యోగ జేఏసీకి ప్రాథమికంగా సమాచారం అందించినట్లు సమాచారం.


సెంట్రల్ పే రివిజన్ కమిషన్ తరహాలోనే  పదేళ్లకోసారి పీఆర్సీ ఇచ్చేలా తెలంగాణ సర్కార్ కొత్త నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కేంద్రం ప్రకటించే డీఏ తరహాలోనే ఇక్కడ కూడా అమలుచేయాలని, మూడు శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలని, జిల్లా కేంద్రాలలో పనిచేసే ఉద్యోగులకు 20 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పూర్తిస్థాయి పింఛన్ పొందడానికి ఇప్పుడున్న 33 ఏళ్ల సర్వీసు కాలాన్ని 31 ఏళ్లకు కుదించనున్నట్లు తెలిసింది. ఉద్యోగ సంఘాలతో జరిగే చర్చల అనంతరం మార్పులు చేర్పులకు అవకాశం ఉంది.

 కనీస పెన్షన్, పూర్తి పెన్షన్ అర్హత, హెచ్ఆర్ఏ, ఏఏఎస్ వంటి అంశాలలో ఉద్యోగ వర్గాలకు సంతృప్తి కల్పించే విధంగా మార్పులు చేసినట్లు సమాచారం. 33 శాతం ఫిట్ మెంట్ ఖరారు చేసినట్లు తెలిసింది. ముందుగా 30 శాతం అనుకున్నా ఉద్యోగుల డిమాండ్లకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఉద్యోగ వర్గాలు 63 శాతం డిమాండ్ చేశాయి. వేతన సవరణకు కేంద్రం దారిలోనే వెళ్లనున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. పదేండ్లకోసారి ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలపై సమీక్ష చేయాలని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇది ఐదేండ్లకోసారిగా ఉంది. ఏఏఎస్లో కూడా మార్పులు చేసినట్లు తెలిసింది. ఏఏఎస్ ప్రస్తుతానికి 6,12,18,24 సంవత్సరాలుగా ఉంది. తాజా నివేదికలో దీన్ని 5, 10, 15, 20, 25గా సవరించినట్లు సమాచారం. ఏఏఎస్ ప్రకారం ఒక ఉద్యోగికి పదోన్నతి రాకున్నా ఆరేండ్లకోసారి ఇంక్రిమెంట్ ఆటోమేటిక్ గానే జమ అవుతోంది. ఇది ఇప్పటి వరకు ఆరేండ్ల స్లాబ్గా ఉండగా ఐదేండ్లకు సవరించినట్లు తెలిసింది. ఇంక్రిమెంట్ మూడు శాతాన్ని యదాతథంగా కొనసాగించనున్నారు.

  పీఆర్సీ అమలు, నగదు రూపంలో అందించే అంశాలపై నివేదికలో స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది. జూలై 2018 నుంచి పీఆర్సీ రావాల్సి ఉండగా అప్పటి నుంచి పెంపును వర్తింపచేసినా 2021 మార్చి వరకు కాలాన్ని నోషనల్గా ప్రకటించనున్నారు. 2021 ఏప్రిల్ నుంచి ఉద్యోగుల వేతన ఖాతాలలో జమ అవుతుంది. ఉద్యోగులు దాదాపు రెండున్నరేండ్లు నష్టపోయే అవకాశం ఉంది. వారికి సర్దిచెప్పే బాధ్యతలను ఉద్యోగ సంఘాల నేతలకే సీఎం అప్పజెప్పే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను వివరిస్తూ ప్రభుత్వం కూడా ప్రకటన చేసే అవకాశం ఉంది. పూర్తి పెన్షన్కు అర్హత సర్వీసు ఇప్పటివరకు 33 ఏండ్లు ఉండగా 31 ఏండ్లకు కుదించారు. ఇప్పటివరకు ఐదేండ్ల గ్రాస్ పిరియడ్తో 28 ఏండ్ల సర్వీసు ఉంటే ఉద్యోగి పూర్తి పెన్షన్కు అర్హత ఉంటోంది. ఇప్పుడు ఐదేండ్ల గ్రాస్ పిరియడ్తో 26 ఏండ్ల సర్వీసు ఉంటే చాలు. కేంద్రం ప్రకటించే డీఏనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అమలు చేయనుంది. ఇప్పటివరకు కేంద్రం ప్రకటించే డీఏకు రాష్ట్రం నుంచి 0.84 వరకు కలిపి ఇచ్చేవారు. పదవీ విరమణ పెంపు అంశాన్ని కూడా వచ్చే ఏడాది ఏప్రిల్ తర్వాత నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. దీనిపై ఇంకా క్లారిటీ రావడం లేదు.




సాగర్ లో టీ ఆర్ ఎస్ అభ్యర్థి ఖరారు అయినట్లేనా..?

ఆ మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీలను ఎలా అవుట్ చేశానంటే.. సీక్రెట్ చెప్పిన పాక్ పేసర్

విక్రమ్ ‘కోబ్రా’ కొత్త లుక్ చూశారా..? వామ్మో ఇలా ఉన్నాడేంటి..!

ఆ సినిమా అర్ధంతరంగా తప్పుకున్న రవితేజ.. కారణం ఏంటంటే?

చిన్నారి ఫ్యాన్‌‌కు బన్నీ సర్‌ప్రైజ్ గిఫ్ట్

పాదయాత్రలోనే నిర్ణయం తీసుకున్నా: సీఎం జగన్

యాలకుల టీ వల్ల కలిగే ప్రయోజనాలు వింటే షాక్ అవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>