MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/baba-movie-produced-by-abba35c529ad-b19a-4fc5-8a63-f95a2c10da83-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/baba-movie-produced-by-abba35c529ad-b19a-4fc5-8a63-f95a2c10da83-415x250-IndiaHerald.jpgబాబాయ్‌ బ్యానర్‌లో అబ్బాయ్ సినిమా చేస్తాడని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ బాబాయ్ మాత్రం ఇప్పటివరకు అబ్బాయ్‌తో సినిమా తీయలేదు. దీంతో అబ్బాయే రంగంలోకి దిగి బాబాయ్‌తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. తండ్రితో వరుస సినిమాలు తీసిన చిరుత ఇప్పుడు చిన్నాన్నతో సినిమా చేయబోతున్నాడు. పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్‌ బ్యానర్‌లో రామ్‌ చరణ్‌ సినిమా చేస్తాడని, పవన్ ప్రియ స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహిస్తాడని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పటి వరకు ఈ baba movie produced by abba;pawan;chiranjeevi;ram charan teja;kalyan;pawan kalyan;ram pothineni;trivikram srinivas;cinema;konidela production;saira narasimhareddy;khaidi.;khaidi new;kavuru srinivas;chiruthaఅబ్బాయ్ నిర్మాణంలో బాబాయ్ సినిమా..!అబ్బాయ్ నిర్మాణంలో బాబాయ్ సినిమా..!baba movie produced by abba;pawan;chiranjeevi;ram charan teja;kalyan;pawan kalyan;ram pothineni;trivikram srinivas;cinema;konidela production;saira narasimhareddy;khaidi.;khaidi new;kavuru srinivas;chiruthaSat, 26 Dec 2020 22:30:00 GMTసినిమా చేస్తాడని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ బాబాయ్ మాత్రం ఇప్పటివరకు అబ్బాయ్‌తో సినిమా తీయలేదు. దీంతో అబ్బాయే రంగంలోకి దిగి బాబాయ్‌తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. తండ్రితో వరుస సినిమాలు తీసిన చిరుత ఇప్పుడు చిన్నాన్నతో సినిమా చేయబోతున్నాడు.

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్‌ బ్యానర్‌లో రామ్‌ చరణ్‌ సినిమా చేస్తాడని, పవన్ ప్రియ స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహిస్తాడని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్‌ గురించి ఎలాంటి అనౌన్స్‌మెంట్ రాలేదు. అయితే బాబాయ్ నిర్మాణంలో అబ్బాయ్ సినిమా గురించి క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు కొత్తగా అబ్బాయ్ నిర్మాణంలో బాబాయ్ సినిమా చేయబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది.

చిరంజీవి కమ్‌బ్యాక్‌ మూవీ కోసం నిర్మాతగా మారాడు రామ్ చరణ్. కొణిదెల ప్రొడక్షన్స్‌ కంపెనీలో చిరుతో 'ఖైదీ నం.150, సైరా' సినిమాలు తీశాడు. ఇప్పుడు మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి 'ఆచార్య' సినిమా తీస్తున్నాడు చరణ్. ఇప్పటివరకు నాన్నతోనే సినిమాలు తీసిన చెర్రీ, ఇప్పుడు చిన్నాన్నతో ఒక మూవీ ప్లాన్ చేస్తున్నాడట.

పవన్ కళ్యాణ్ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఫుల్‌ స్పీడ్‌గా సినిమాలు చేస్తున్నాడు. 'వకీల్‌సాబ్‌'తో పాటు మొత్తంగా అయిదు సినిమాలు లైన్‌లో పెట్టాడు పవన్. ఈ స్పీడ్‌లోనే కొణిదెల ప్రొడక్షన్స్‌లో ఒక ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పించాలనుకుంటున్నాడట చరణ్‌. ఇప్పటికే డైరెక్టర్స్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయని, త్వరలోనే అనౌన్స్‌మెంట్‌ వస్తుందనే టాక్ వస్తోంది. మరి  ఈ మూవీకి రామ్ చరణ్‌ ప్రొడక్షన్‌ వరకే పరిమితమవుతాడా, బాబాయ్‌ సినిమాలో స్పెషల్‌ రోల్ ఏమైనా చేస్తాడా అనేది చూడాలి.

మొత్తానికి రామ్ చరణ్ నిర్మాణంలో పవన్ కళ్యాణ్ సినిమా రాబోతోంది. బాబాయ్ కోసం దర్శకుడిని వెతుకుతున్నాడు అబ్బాయ్. ఈ ప్రాజెక్ట్ పై మెగా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. చూద్దాం ఆ మెగా ప్రాజెక్ట్ ఎపుడొస్తుందో.





కుర్రహీరో ఆలోచనలు మామాలుగా లేవు..!

ప్రభాస్‌తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్.. ఏమన్నాడంటే..

యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన 8 మంది.. అందరికీ కరోనా!

తెలుగు రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు గాలికొదిలిన థియేటర్లు!

రాదేశ్యామ్ కోసం అదిరిపోయే ప్లాన్ రెడీ..విడుదల అప్పుడేనట.?

సలార్ దిగేది అపుడే.... ప్రభాస్ ఫ్యాన్స్ హుషార్ ?

సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ మాములుగా లేదుగా...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>