MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/why-is-this-happening-to-rajinikanth8800f71b-db30-4f7f-813e-8db0df386922-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/why-is-this-happening-to-rajinikanth8800f71b-db30-4f7f-813e-8db0df386922-415x250-IndiaHerald.jpgడిసెంబర్‌ 31న పార్టీ ప్రకటిస్తానని చెప్పిన రజినీకాంత్‌.. మేలో జరిగే తమిళనాడు ఎలక్షన్స్‌కు ముందే ప్రస్తుతం నటిస్తున్న అన్నాత్తే సినిమా రిలీజ్‌ చేయాలన్న పట్టుదలతో షూటింగ్‌ మొదలు పెట్టాడు. హైదరాబాద్‌లో 45 రోజుల షెడ్యూల్‌ ప్లాన్‌ చేశారు. అయితే 10 రోజుల్లోనే చిత్ర యూనిట్‌లో ఏడుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో.. రజనీకాంత్‌ కూడా టెస్ట్‌ చేయించుకోగా నెగిటివ్‌ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. బ్లడ్‌ ప్రెషర్‌లో హెచ్చుతగ్గులు రావడంతో... ఆసుపత్రిలో జాయిన్‌ అయ్యాడు రజినీకాంత్‌. why is this happening to rajinikanth;kushi;cinema;rajani kanth;partyసూపర్ స్టార్ కే ఎందుకిలా జరుగుతోంది?సూపర్ స్టార్ కే ఎందుకిలా జరుగుతోంది?why is this happening to rajinikanth;kushi;cinema;rajani kanth;partySat, 26 Dec 2020 22:00:00 GMTపార్టీ ప్రకటిస్తామని చెప్పి అభిమానులను ఖుషీ చేయించిన రజినీకాంత్‌ ఆసుపత్రిలో చేరడంతో మళ్లీ కలకలం మొదలైంది. రజనీకాంత్‌తో పాలిటిక్సే కాదు.. ఆరోగ్యం కూడా ఆడుకుంటోంది.

డిసెంబర్‌ 31న పార్టీ ప్రకటిస్తానని చెప్పిన రజినీకాంత్‌.. మేలో జరిగే తమిళనాడు ఎలక్షన్స్‌కు ముందే ప్రస్తుతం నటిస్తున్న అన్నాత్తే సినిమా రిలీజ్‌ చేయాలన్న పట్టుదలతో షూటింగ్‌ మొదలు పెట్టాడు. హైదరాబాద్‌లో 45 రోజుల షెడ్యూల్‌ ప్లాన్‌ చేశారు. అయితే 10 రోజుల్లోనే చిత్ర యూనిట్‌లో ఏడుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో.. రజనీకాంత్‌ కూడా టెస్ట్‌ చేయించుకోగా నెగిటివ్‌ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. బ్లడ్‌ ప్రెషర్‌లో హెచ్చుతగ్గులు రావడంతో... ఆసుపత్రిలో జాయిన్‌ అయ్యాడు రజినీకాంత్‌.

70 ఏళ్ల  వయసులో రజనీకాంత్‌కు ఆరోగ్యం సహకరించడం లేదనే చెప్పాలి. రాజకీయాలకు సంబంధించిన డెసిషన్‌ తీసుకోవడానికి అనారోగ్యం పెద్ద ఇబ్బందిగా మారింది. లింగా సినిమా మొదలైందో లేదో ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. చెన్నయ్‌లో ట్రీట్‌మెంట్ తీసుకున్న రజనీ మెరుగైన చికిత్స కోసం సింగపూర్‌ వెళ్లాడు. లంగ్స్‌ ప్రాబ్లమ్‌తో బాధపడిన రజనీ నెల రోజులపాటు చికిత్స అనంతరం తిరిగివచ్చాడు. సూపర్‌స్టార్‌కు ఇది రెండో జన్మేనని చెబుతుంటారు.

రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తాడా? రాడా? అనే డౌట్‌కు రీసెంట్‌గా క్లారిటీ వచ్చింది. పాలిటిక్స్‌లోకి వస్తారా? రారా అనే డైలామాకు ఎట్టకేలకు తెరదించుతూ.. రాజకీయాల్లోకి వస్తానని.. ఈనెల 31న పార్టీ ప్రకటిస్తానన్నాడు రజనీ. అంతా బాగుందనుకున్న సమయంలో... మరోసారి ఆరోగ్య సమస్యంతో ఆసుపత్రిలో చేరడం ఆందోళన కలిగిస్తోంది. హెల్త్‌ రీత్యా  పొలిటికల్‌ ఎంట్రీపై మరోసారి యు టర్న్‌ తీసుకుంటారన్న భయం అభిమానుల్లో ఉన్నా.. ముందు ఆరోగ్యం కుదుటపడితే చాలని ప్రార్ధనలు చేస్తున్నారు. మొత్తానికి రజినీకాంత్ ఆరోగ్య పరిస్థితి రాజకీయ పార్టీపై పడుతుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.






మానవుడి అంతానికి అపుడే ముహూర్తం..?

ప్రభాస్‌తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్.. ఏమన్నాడంటే..

యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన 8 మంది.. అందరికీ కరోనా!

తెలుగు రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు గాలికొదిలిన థియేటర్లు!

రాదేశ్యామ్ కోసం అదిరిపోయే ప్లాన్ రెడీ..విడుదల అప్పుడేనట.?

సలార్ దిగేది అపుడే.... ప్రభాస్ ఫ్యాన్స్ హుషార్ ?

సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ మాములుగా లేదుగా...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>