Healthyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/health/movies_news/heart-attack1c6079ca-44ae-421f-b007-44b936b27820-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/health/movies_news/heart-attack1c6079ca-44ae-421f-b007-44b936b27820-415x250-IndiaHerald.jpgగుండెపోటు.. ప్రపంచంలో ఎంతోమంది మరణానికి కారణం ఈ మహమ్మారి. ఈ మధ్య కాలంలో యువకులు కూడా దీనిబారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. మరి ఈ గుండెపోటును ముందుగా గుర్తించేదెలా..? దీనిపై బ్రిటన్‌కు చెందిన ఓ యూనివర్సిటీ పరిశోధన చేసింది. దాని ప్రకారం గుండెపోటును ముందుగా గుర్తించేందుకు..heart attack;chiranjeevi;university;heart;air;sugar;cholesterol;heart attackఈ లక్షణాలుంటే మీరు హార్ట్ ఎటాక్‌కు దగ్గరపడ్డట్లే..!ఈ లక్షణాలుంటే మీరు హార్ట్ ఎటాక్‌కు దగ్గరపడ్డట్లే..!heart attack;chiranjeevi;university;heart;air;sugar;cholesterol;heart attackSat, 26 Dec 2020 14:02:00 GMTయూనివర్సిటీ పరిశోధన చేసింది. దాని ప్రకారం కొన్ని లక్షణాల ద్వారా గుండెపోటును ముందుగా గుర్తించవచ్చని తెలిపింది. ఈ అంశంపై యూనివర్సిటీ ఆఫ్ లివర్‌పూల్‌కు చెందిన బయోలాజికల్ సైంటిస్టులు పరిశోధన చేశారు.

ఈ పరిశోధనలో ఓ షాకింగ్ నిజం బయటపడింది. అదేంటంటే వ్యక్తి చేతివేళ్లను బట్టి గుండెపోటు వస్తుందో రాదో ముందుగానే చెప్పొచ్చని తేలింది. గుండెపోటు వచ్చిన 151 మందిపైన పరిశోధన చేసిన తరువాత ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్లు సైంటిస్టులు తెలిపారు. అయితే హార్ట్ ఎటాక్‌కు గురయ్యే ముందు వారి చేతి వేళ్లలో కొన్ని మార్పులు వస్తాయని, వాటిని బట్టే ఆ వ్యక్తి గుండె పోటుకు గురయ్యే అవకాశం ఉందా లేదా అని గుర్తించవచ్చని తెలిపారు.

అందులో మొదటిది.. చూపుడు వేలు, ఉంగరం వేలు రెండూ సమానంగా ఉన్నవారికి గుండెపోటు రావడం చాలా అరుదట. అయితే ఉంగరం వేలి కంటే చూపుడు వేలు పొడవుగా ఉన్న వారికి గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. అంతేకాదు 35 నుంచి 80 సంవత్సరాల మధ్య వయసు గలవారికి గుండె పోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని లివర్‌పూల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇక స్థూలకాయం ఉన్నవారు, చిరుతిళ్లు ఎక్కువగా తినేవారికి, ఒత్తిడి అధికంగా ఉన్నవారికి గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. అందువల్ల ఒత్తిడిని దరిచేరనీయకుండా, చిరుతిళ్లకు దూరంగా ఉంటే అంత మంచిదని సూచిస్తున్నారు.

హార్ట్ ఎటాక్ సమస్యను శ్వాస తీసుకునే విధానాన్ని బట్టి కూడా గుర్తించవచ్చట. శ్వాస సరిగా ఆడకపోవడం, గాలి పీల్చుకోవడంలో తరచుగా ఇబ్బందులు ఎదురవుతుండడం వంటి లక్షణాలు హార్ట్ ఎటాక్‌కు దారి తీస్తాయని చెబుతున్నారు. విపరీతంగా అలసిపోవడం, ఒళ్లు నెప్పులు దీర్ఘ కాలం బాధపెడుతుండడం,  మత్తుగా నిద్రవస్తున్నట్లుండడం, అధికంగా చెమటలు పడుతుండడం వంటి లక్షణాలన్నీ గుండెపోటు లక్షణాలేనని, వీటిని ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దని హెచ్చరిస్తున్నారు.

ఇక పొగ తాగేవారు, మద్యం సేవించేవారు, డయాబెటిస్, హైబీపీ, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారికి గుండెపోటు వచ్చే అవకాశాలు అత్యధికంగా ఉంటాయని, వీలైనంత వరకు ఈ అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిదని, కనీసం తగ్గించుకునేందుకైనా ప్రయత్నించడం అవసరమని సూచిస్తున్నారు.


తెలంగాణ రాష్ట్రం లో మరో ఘోర రోడ్డు ప్రమాదం .. ఈసారి ఏకంగా నలుగురు

పీరియడ్స్ దాచి పెట్టి పెళ్ళి

గుండె బాగుండాలంటే ఇవి తప్పక తినండి

2028కల్లా చైనా నెంబర్ వన్.. అమెరికాకు షాక్ తప్పదు

రాజ్ తరుణ్‌ ఇంటికెళ్లి మరీ ఐలవ్యూ చెప్పిన ఆవికా గోర్

రవితేజ కథని గోపీచంద్ చేస్తున్నాడా..?

ప్రభాస్ సినిమాల రిలీజ్ డేట్ లు ఇవేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>