SportsSreekanth Eeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/siraj79157e3c-5b3e-4fde-9f6c-b16eb0cb2224-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/siraj79157e3c-5b3e-4fde-9f6c-b16eb0cb2224-415x250-IndiaHerald.jpgటెస్టు జట్టులో చోటు దక్కడం పట్ల సిరాజ్ భావోద్వేగానికి గురయ్యాడు. టీమిండియా క్యాప్‌ అందుకున్న తర్వాత నా జీవితంలో విలువైనది సాధించనట్లుగా అనిపించిందని అన్నాడు. సిరాజ్‌ భారత్‌ తరఫున టెస్టుల్లో, వన్డేల్లో ఆడాలన్నది మా నాన్న కల అని సిరాజ్‌ సోదరుడు ఇస్మాయిల్‌ అన్నాడు. ఆ కల ఈ రోజుతో నేరవేరినట్లు చెప్పాడు.siraj;jeevitha rajaseskhar;cricket;india;australia;naga aswin;yuva;melbourne;father;mayank agarwal;paruguటెస్టు జట్టులో చోటు... సిరాజ్ భావోద్వేగంటెస్టు జట్టులో చోటు... సిరాజ్ భావోద్వేగంsiraj;jeevitha rajaseskhar;cricket;india;australia;naga aswin;yuva;melbourne;father;mayank agarwal;paruguSat, 26 Dec 2020 23:19:59 GMTబోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బోర్న్‌ వేదికగా  ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్టు (రెండో టెస్టు)లో  తొలి రోజు అట ముగిసింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసీస్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే తొలి రోజు ఆసీస్ బ్యాట్స్ మెన్ పై భారత బౌలర్లు పూర్తి ఆధిపత్యం కొనసాగించారు. జస్ప్రిత్ బుమ్రా (4/56),  మహ్మద్ సిరాజ్  (2/40) పేస్ కు రవిచంద్రన్ అశ్విన్ (3/35) స్పిన్ మాయాజాలం తోడవడంతో ఆసీస్ 195 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన భారత్ సున్నా పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో మయాంక్ అగర్వాల్ డకౌట్ అయ్యాడు. మొదటి రోజు ఆట ముగిసేసరికి భారత్‌ ఒక వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది.ప్రస్తుతం శుభమన్ గిల్ (28), పూజారా (7) లు క్రీజులో ఉన్నారు. 

ఇక ఈ మ్యాచ్ లో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ తో పాటు యువ ఆటగాడు శుభమన్ గిల్ టెస్టు క్రికెట్ లోకి అర్రంగేట్రం చేసారు. లబుషేన్‌, గ్రీన్‌ల వికెట్లు తీసి సిరాజ్  మెరుగైన ప్రదర్శన చేయగా... గిల్ తొలి రోజు చక్కని షాట్లతో అలరించాడు. కాగా టెస్టు జట్టులో చోటు దక్కడం పట్ల సిరాజ్ భావోద్వేగానికి గురయ్యాడు. తొలి రోజు ఆట ముగిసిన అనంతరం సిరాజ్ మాట్లాడాడు. టీమిండియా క్యాప్‌ అందుకున్న తర్వాత నా జీవితంలో విలువైనది సాధించనట్లుగా అనిపించిందని అన్నాడు. మ్యాచ్ ప్రారంభం అయ్యాక  తర్వాత బౌలింగ్ చేయాలని ఎంతో ఆతృతగా ఎదురుచూశానని, కానీ తొలి సెషన్ తర్వాత లంచ్‌ అనంతరం  బౌలింగ్‌ చేయాలని కెప్టెన్ రహానె చెప్పాడని వివరించాడు. రహానె, బుమ్రాతో మాట్లాడిన అనంతరం ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని అన్నాడు.

కాగా సిరాజ్‌ భారత్‌ తరఫున టెస్టుల్లో, వన్డేల్లో ఆడాలన్నది మా నాన్న కల అని సిరాజ్‌ సోదరుడు ఇస్మాయిల్‌ అన్నారు. ఆ కల ఈ రోజుతో నేరవేరినట్లు చెప్పాడు. కాగా ఐపీఎల్ అనంతరం ఆస్ట్రేలియా పర్యటనకు మహ్మద్ సిరాజ్ ఎంపిక అయ్యాడు. అయితే సిరాజ్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగానే అతని తండ్రి మరణించాడు. అయితే సిరాజ్ తండ్రి కల కోసం.. బాధను భరిస్తూ ఆసీస్‌లోనే ఉండిపోయాడు. తండ్రి అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదు. ఇక తొలి టెస్టులో సిరాజ్ కు చోటు దక్కలేదు. అయితే, సీనియర్ పేసర్ షమి గాయంతో సిరీస్ నుంచి వైదొలగడంతో బాక్సింగ్ డే టెస్టులో చోటు సంపాదించాడు.




కుర్రహీరో ఆలోచనలు మామాలుగా లేవు..!

ప్రభాస్‌తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్.. ఏమన్నాడంటే..

యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన 8 మంది.. అందరికీ కరోనా!

తెలుగు రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు గాలికొదిలిన థియేటర్లు!

రాదేశ్యామ్ కోసం అదిరిపోయే ప్లాన్ రెడీ..విడుదల అప్పుడేనట.?

సలార్ దిగేది అపుడే.... ప్రభాస్ ఫ్యాన్స్ హుషార్ ?

సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ మాములుగా లేదుగా...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sreekanth E]]>