PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nagarjuna-sagar-assembly-bypoll-in-march-first-week87101ace-e567-454a-b865-618cdcf9d3a0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nagarjuna-sagar-assembly-bypoll-in-march-first-week87101ace-e567-454a-b865-618cdcf9d3a0-415x250-IndiaHerald.jpgనల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీకి మార్చి తొలివారంలో ఉప ఎన్నిక జరిగే అవకాశం కనిపిస్తోంది. ఏపీలోని తిరుపతి ఎంపీ సీటుతో కలిపి సాగర్ ఉప ఎన్నికను నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.జనవరి చివరి వారంలోగానీ, ఫిబ్రవరి తొలివారంలోగానీ ఎలక్షన్ షెడ్యూల్ విడుదలయ్యే చాన్స్ ఉందని ఎలక్షన్ కమిషన్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.nagarjuna sagar;nagarjuna akkineni;raghu;tiru;bharatiya janata party;telangana rashtra samithi trs;pithe;congress;mp;district;backward classes;january;tirupati;nalgonda;assembly;mla;february;minister;husband;wife;letter;tdp;janareddy;local language;election commission;march;reddy;josh;leader;partyమార్చి తొలి వారంలో సాగర్ బై పోల్!మార్చి తొలి వారంలో సాగర్ బై పోల్!nagarjuna sagar;nagarjuna akkineni;raghu;tiru;bharatiya janata party;telangana rashtra samithi trs;pithe;congress;mp;district;backward classes;january;tirupati;nalgonda;assembly;mla;february;minister;husband;wife;letter;tdp;janareddy;local language;election commission;march;reddy;josh;leader;partySat, 26 Dec 2020 08:33:05 GMTటీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో ఖాళీ అయిన నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీకి మార్చి తొలివారంలో ఉప ఎన్నిక జరిగే అవకాశం కనిపిస్తోంది. ఏపీలోని తిరుపతి ఎంపీ సీటుతో కలిపి సాగర్ ఉప ఎన్నికను నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.జనవరి చివరి వారంలోగానీ, ఫిబ్రవరి తొలివారంలోగానీ ఎలక్షన్ షెడ్యూల్ విడుదలయ్యే చాన్స్ ఉందని  ఎలక్షన్ కమిషన్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.  తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ చనిపోవడంతో.. అక్కడ మార్చి 16వ తేదీలోపు బైఎలక్షన్ జరగాల్సి ఉంది.  ఈ రెండింటికీ ఒకేసారి ఎలక్షన్ నిర్వహించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

     నాగార్జున సాగర్  ఉప ఎన్నికపై ఇప్పటికే పార్టీలు ఫోకస్ చేశాయి. గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. సాగర్ టికెట్ కోసం అధికార పార్టీలో పోటీ తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. నోముల నర్సింహయ్య భార్య లక్ష్మిగానీ, కొడుకు భగత్ యాదవ్ గానీ పోటీకి రెడీగా ఉన్నట్టు పార్టీనేతలు చెప్తున్నారు. అయితే శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నాగార్జున సాగర్ నుంచి పోటీ చేసేందుకు రెడీగా ఉన్నారని  ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఉన్న సుఖేందర్ పదవీ కాలం వచ్చే మే నెలలో ముగుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఉన్న తేరా చిన్నపరెడ్డి,  లోకల్ లీడర్ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి యాదవ్ మనవడు మన్నెం రంజిత్ యాదవ్  కూడా టీఆర్ఎస్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.  దుబ్బాకలో సానుభూతి కలిసి రాకపోవడంతో నాగార్జున సాగర్ టికెట్ ను నోముల కుటుంబానికి ఇవ్వాలా, వద్దా? అన్న దానిపై టీఆర్ఎస్  హైకమాండ్ మల్లగుల్లాలు పడ్తున్నట్టు సమాచారం.


       కాంగ్రెస్  నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి పోటీకి రెడీ అయినట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ముందుగా తన కొడుకు రఘువీర్ రెడ్డిని బరిలోకి దింపాలని ఆయన భావించారు. దీనిపై జానారెడ్డి లోకల్ లీడర్లతో ప్రత్యేకంగా ఓ మీటింగ్ నిర్వహించి, వారి అభిప్రాయాలను తీసుకున్నట్టు తెలిసింది. మెజార్టీ లీడర్లు జానారెడ్డినే పోటీ చేయాలని, ఒకవేళ రఘువీర్ పోటీ చేస్తే ప్రయోజనం ఉండదని డైరెక్ట్గా చెప్పడంతో జానారెడ్డి బరిలోకి దిగేందుకు రెడీ అయినట్టు కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది.

  ఇక దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలతో మంచి జోష్ లో ఉన్న బీజేపీ..నాగార్జున సాగర్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది.బలమైన క్యాండిడేట్ కోసం సెర్చ్ చేస్తోంది. టీఆర్ఎస్ క్యాండిడేట్ పై స్పష్టత వచ్చిన తర్వా తే బీజేపీ క్యాండిడేట్ ఎంపిక ఉంటుందని ఆ పార్టీ లీడర్లు చెప్తున్నారు. టీఆర్ఎస్ బీసీలకు టికెటిస్తే బీజేపీ నుంచి ఓసీ క్యాండిడేట్ని.. ఒకవేళ ఆ పార్టీ ఓసీ నేతను బరిలోకి దింపితే బీజేపీ నుంచి బీసీ క్యాండిడేట్ను రంగంలోకి దింపాలని భావిస్తున్నట్టు తెలిసింది. 2014 అసెంబ్లీ ఎలక్షన్లలో టీడీపీ నుంచి పోటీచేసి దాదాపు 22 వేల ఓట్లు సాధించిన కడారి అంజయ్య యాదవ్ ప్రస్తుతం బీజేపీ నుంచి పోటీ కోసం ప్రయత్నిస్తున్నారు. 


ఫాస్టాగ్ సరికొత్త రికార్డ్ !

ఆ మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీలను ఎలా అవుట్ చేశానంటే.. సీక్రెట్ చెప్పిన పాక్ పేసర్

విక్రమ్ ‘కోబ్రా’ కొత్త లుక్ చూశారా..? వామ్మో ఇలా ఉన్నాడేంటి..!

ఆ సినిమా అర్ధంతరంగా తప్పుకున్న రవితేజ.. కారణం ఏంటంటే?

చిన్నారి ఫ్యాన్‌‌కు బన్నీ సర్‌ప్రైజ్ గిఫ్ట్

పాదయాత్రలోనే నిర్ణయం తీసుకున్నా: సీఎం జగన్

యాలకుల టీ వల్ల కలిగే ప్రయోజనాలు వింటే షాక్ అవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>