PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/what-if-the-pcc-chief-gives-himf1720cb4-9e07-4e78-9747-f1992aba5e50-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/what-if-the-pcc-chief-gives-himf1720cb4-9e07-4e78-9747-f1992aba5e50-415x250-IndiaHerald.jpgరైతు ర్యాలీకి వెళ్లిన కాంగ్రెస్ నాయకులు కొద్దీ మంది ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి... రేవంత్ టీంలోని కొందరు నాయకులు ఢిల్లీలోనే మకాం వేశారు. ఒకటి... రెండు రోజుల్లో పీసీసీ చీఫ్ ప్రకటన అధికారికంగా రాబోతుందని చర్చ జరుగుతున్న క్రమంలో అందరూ ఆఖరి ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే పదవుల కూర్పుకు సంబంధించి... పార్టీ నాయకులు ఎవరికి వారు లెక్కలు వేస్తున్నారు. రేవంత్... సీఎల్పీ నేత భట్టి మధ్యనే ప్రధాన పోటీ ఉన్న నేపథ్యంలో ఎవరికి పీసీసీ ఇస్తారు. .? ఎవరిని నచ్చ చెప్తారు అనేది ఇప్పుడు ఆసక్తిగా what if the pcc chief gives him;cbn;revanth;sridhar;telangana;congress;mp;panchayati;reddy;partyపీసీసీ చీఫ్ అతనికిస్తే..?పీసీసీ చీఫ్ అతనికిస్తే..?what if the pcc chief gives him;cbn;revanth;sridhar;telangana;congress;mp;panchayati;reddy;partySat, 26 Dec 2020 20:38:50 GMTకాంగ్రెస్ లో పీసీసీ పంచాయతీ ఇంకా రంజుగా మారింది. పీసీసీ ఛీఫ్‌ ఎవరనేది ఖరారైందన్న ప్రచారంతో  సీనియర్లు గళం విప్పారు. తమ అభ్యంతరాల్ని కాదని.. నిర్ణయం తీసుకుంటే పార్టీ వీడతామని హెచ్చరించారు.

తెలంగాణ కాంగ్రెస్ సారధి ఎంపిక కొలిక్కి వచ్చింది. అయితే... ఏఐసీసీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. రేవంత్ పేరు ఖరారు అయిందనే ప్రచారం జరగడంతో.. రేవంత్ వ్యతిరేకులు మండిపడుతున్నారు. పార్టీ సీనియర్ నేత  హన్మంత రావు... రేవంత్ కి పదవి ఎలా ఇస్తారు..? అని ప్రశ్నించారు.

రైతు ర్యాలీకి వెళ్లిన కాంగ్రెస్ నాయకులు కొద్దీ మంది ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి... రేవంత్ టీంలోని కొందరు నాయకులు ఢిల్లీలోనే మకాం వేశారు. ఒకటి... రెండు రోజుల్లో పీసీసీ చీఫ్ ప్రకటన అధికారికంగా రాబోతుందని చర్చ జరుగుతున్న క్రమంలో అందరూ ఆఖరి ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే పదవుల కూర్పుకు సంబంధించి... పార్టీ నాయకులు ఎవరికి వారు లెక్కలు వేస్తున్నారు. రేవంత్... సీఎల్పీ నేత భట్టి మధ్యనే ప్రధాన పోటీ ఉన్న నేపథ్యంలో ఎవరికి పీసీసీ ఇస్తారు. .? ఎవరిని నచ్చ చెప్తారు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. పీసీసీ చీఫ్ పదవి రేవంత్ ని వరిస్తే...పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లుగా మధు యాష్కీ... శ్రీధర్ బాబుల పేర్లు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక ప్రచార కమిటీ కానీ... సిడబ్ల్యూసీ  ఆహ్వానితునిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి అవకాశం ఉండొచ్చు.

అయితే కోమటిరెడ్డి మాత్రం పీసీసీ మనదే... అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక సీఎల్పీ నేత భట్టి కి పీసీసీ వస్తే... రేవంత్ ని ప్రచార కమిటి ఇస్తారని... ప్రచారం నడుస్తోంది. భట్టి...పీసీసీ అధ్యక్ష పదవి తనకు... సీఎల్పీ శ్రీధర్ బాబుకు ఇవ్వాలనే ప్రతిపాదన కూడా చేసినట్టు తెలుస్తోంది. అయితే  రెండు ఒకే టీం కి ఇవ్వడం కుదిరే పనేనా..? అనే చర్చ కూడా నడుస్తోంది.  భట్టి పీసీసీ చీఫ్‌ అయితే... పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా సీఎల్పీ పదవులలో ఒకదాన్ని రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలనే చర్చ నడుస్తోంది. అయితే ఇదంతా కేవలం పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ మాత్రమే.

పార్టీలో సీనియర్లు అంతా ఒక అభిప్రాయంతో ఉన్నారు. రేవంత్ కి పార్టీ పగ్గాలు ఇస్తే...సీనియర్లు ఉంటారా..? బయటకు వెళ్తారా. ? అనే చర్చ జరుగుతోంది.  దీనికి హన్మంత రావు బీజం వేశారు. ఇవన్నీ ఒక ఎత్తయితే... పార్టీలో అందరి అభిప్రాయాలు మరోసారి సేకరించిన తర్వాతే ఫైనల్ నిర్ణయం ఉంటుందని అంటున్నారు.  మొత్తనికి పీసీసీ చీఫ్‌ ఎంపిక.. కాంగ్రెస్ లో కాక రేపుతోంది.!


కులాలను సూచించే కాలనీలకు ఇక చెల్లుచీటీ! మనతోనే మొదలు...

రాదేశ్యామ్ కోసం అదిరిపోయే ప్లాన్ రెడీ..విడుదల అప్పుడేనట.?

సలార్ దిగేది అపుడే.... ప్రభాస్ ఫ్యాన్స్ హుషార్ ?

సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ మాములుగా లేదుగా...

ప్రమాణాలతో వేడెక్కిన విశాఖ రాజకీయం ?

కేటీఆర్ ను ఎందుకు సీఎం చేయబోతున్నారు..?

బ్యాంకుల ముందు చెత్త... కేంద్రం రంగంలోకి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>