Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chinac997a124-1747-4fba-bc3b-fbd433f7fa61-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chinac997a124-1747-4fba-bc3b-fbd433f7fa61-415x250-IndiaHerald.jpgకరోనా కారణంగా ప్రపంచం మొత్తం వెనకబడిపోతుంటే.. ఆ మహమ్మారి పుట్టినిల్లు చైనా మాత్రం అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఆర్థిక శక్తిలో చైనా అమెరికాను ఓవర్ టేక్ చేసేందుకు అతి చేరువకు చేరుకుంది. కరోనా దెబ్బకు ప్రపంచం మొత్తం ప్రస్తుతం విలవిల్లాడిపోతోంది. ఇందుకు అగ్రరాజ్యం అమెరికా..china;ganga;ganges;japan;american samoa;nijam;parugu2028కల్లా చైనా నెంబర్ వన్.. అమెరికాకు షాక్ తప్పదు2028కల్లా చైనా నెంబర్ వన్.. అమెరికాకు షాక్ తప్పదుchina;ganga;ganges;japan;american samoa;nijam;paruguSat, 26 Dec 2020 12:37:13 GMTఅమెరికా కూడా మినహాయింపు కాదు. అయితే కరోనా జన్మస్థలమైన చైనా మాత్రం కరోనాతో ఎంతో లాభపడుతోంది. అర్థిక పెరుగుదలలో అమెరికాను సైతం వెనక్కి నెట్టేసి ముందుకు వెళ్లబోతోంది.

2033 సంవత్సరంలో చైనా ఆర్థికంగా ప్రపంచ నెంబర్ వన్ దేశంగా అవతరిస్తుందని ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. అయితే కరోనా నేపథ్యంలో అంతకంటే ముందే చైనా ఆ ఫీట్ సాధించేలా ఉంది. చైనాలోనే పుట్టిన కరోనాను అందరికంటే ముందే అదుపులోకి తెచ్చామని చైనా ఇప్పటికే చెబుతోంది. అంతేకాదు ప్రస్తుతం మరింత కసి, పట్టుదలతో ఆర్థిక రంగాన్నీ పరుగులు పెట్టిస్తోంది. కరోనా ప్రతికూల ప్రభావం నుంచి అమెరికా కంటే వేగంగా కోలుకుంటోంది. ఇదే స్పీడు కొనసాగితే నిపుణులు అంచనా కంటే ఏకంగా 5ఏళ్లు ముందే నెంబర్ వన్ ఆర్థికరంగంగా మారుతుందని తాజా అధ్యయనాల్లో వెల్లడవుతోంది.

కరోనా నేపథ్యంలో చైనా ఆర్థిక వ్యవస్థ పురోగతిపై సెంటర్ ఫర్ ఎకానామిక్స్ ఎండ్ బిజినస్ రీసెర్చ్ అధ్యయనం చేసింది. 'కరోనా సంక్షోభం తరువాతి పరిస్థితులు చైనాకు ఎంతో లాభం చేకూర్చాయి. అమెరికాతో రేసులో చైనా దూసుకుపోతోంది. ఇలానే కొనసాగితే అనుకున్నదానికంటే ముందుగానే నెంబర్ వన్‌గా అవతరించే అవకాశం ఉంది' అని ఈ అధ్యయనం వెల్లడించింది. చైనాలో ముందుగా లాక్‌డౌన్లు విధించడం, సంక్షోభ సమయంలో నేర్పుగా వ్యవహరించడంతో దీర్ఘ కాలిక అభివృద్ధి అంచనాల్లో పాశ్చాత్య దేశాలతో పోల్చితే చైనా మరింత ముందుందని తెలుస్తోంది. దీని ప్రకారం.. 2021-25 మధ్య చైనా ఆర్థిక వ్యవస్థ 5.7% వేగంతో, 2026-30మధ్య 4.5% వేగంతో దూసుకుపోనుంది. అదే సమయంలో కరోనా కారణంగా అమెరికా ఆర్థికాభివృద్ధి వేగం 1.6%-1.9% పరిమితం కానుంది. దీంతో చైనా 2028 కల్లా ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంద’ని అధ్యయనకారులు అంచనా వేస్తున్నారు. ఇక జపాన్ మాత్రం మునుపటి లాగానే మూడో స్థానంలో కొనసాగుతుందని చెబుతున్నారు.

ఇదంతా చూస్తుంటే ఆర్థికంగా ఎదగాలనే దురాలోచనతో కరోనాను చైనా కావాలనే ప్రపంచంపైకి విడిచిపెట్టిందనే వాదన నిజంలానే అనిపిస్తోంది కదా. అయితే దేనికీ ఆధారాలు దొరకనంత వరకు మనం నమ్మలేం. ఇప్పటివరకైతే చైనానే కరోనా వైరస్‌ను తయారు చేసి వదిలిందనడానికి ఎటువంటి ఆధారాలూ ప్రపంచానకి లభించలేదు.


రాజ్ తరుణ్‌ ఇంటికెళ్లి మరీ ఐలవ్యూ చెప్పిన ఆవికా గోర్

రవితేజ కథని గోపీచంద్ చేస్తున్నాడా..?

ప్రభాస్ సినిమాల రిలీజ్ డేట్ లు ఇవేనా..?

పుష్ప లో విలన్ ని ఎందుకు సస్పెన్స్ గా ఉంచుతున్నారు..?

ఆ స్టార్ హీరోయిన్ కు అందంతో పాటు చదువు ఆమె సొంతం?

నిజమైన శాంతా క్లాస్.. అనాధల కోసం కాళ్ళు లేకపోయినా...

హైదరాబాద్‌ రోడ్డుపై సోనూసూద్ హల్‌చల్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>