SmaranaSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/baba-amte066347fb-428e-4bec-8fe9-6376ffb42e56-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/baba-amte066347fb-428e-4bec-8fe9-6376ffb42e56-415x250-IndiaHerald.jpg బాబా ఆమ్టే స్థాపించిన మూడు ఆశ్రమాల్లో ఆనంద్‌వన్ మొదటిది. కుష్టురోగుల సంక్షేమానికి మహారాష్ట్రలోని చంద్రాపుర్ జిల్లాలో ఈ ఆశ్రమాన్ని 1951లో స్థాపించాడు. ఆనంద్‌వన్ అనగా అర్థం ఆనందపు అడవి. వరోరాకు దగ్గరలోని అటవీ ప్రాంతంలో 50 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ప్రారంభించాడు. అది క్రమక్రమంగా పెద్దదై నేడు 500 ఎకరాలకు విస్తరించింది. ఆ రోజులలో కుష్టురోగులకు సమాజం నుంచి వెలివేసేవారు. అలాంటి వారి కొరకు ఆశ్రమాన్ని స్థాపించి కుష్టురోగులను చేరదీసి వారితో పాటు అతడు కూడా అక్కడే వారి సంక్షేమం చూస్తూ గడపటం గొప్పవిషయం. baba amte;india;somnath temple;mohandas karamchand gandhi;muralidhar rao;district;baba bhaskar;school;december;february;devadas;padma shri;wardhaహెరాల్డ్ స్మ‌రామీ : స‌మాజ సేవ‌కై ప‌రిత‌పించిన బాబా ఆమ్టే... నేడు జ‌యంతి...హెరాల్డ్ స్మ‌రామీ : స‌మాజ సేవ‌కై ప‌రిత‌పించిన బాబా ఆమ్టే... నేడు జ‌యంతి...baba amte;india;somnath temple;mohandas karamchand gandhi;muralidhar rao;district;baba bhaskar;school;december;february;devadas;padma shri;wardhaSat, 26 Dec 2020 08:14:54 GMTబాబా ఆమ్టే ప్రముఖ సంఘసేవకుడు. కుష్టువ్యాధి రోగులకోసం పూనేకు సమీపంలో ఆశ్రమాన్ని నిర్వహించారు. ఆశ్రమంలోని చివరివరకు గడిపాడు. వీరి పూర్తిపేరు మురళీధర్ దేవదాస్ ఆమ్టే. బాబా అనేది వీరి తల్లిదండ్రుల పెట్టిన ముద్దుపేరు.ఈ మహనీయుడు 1914 డిసెంబర్ 26వ తేదీన మహారాష్ట్రలోని వార్ధా జిల్లా హింగస్ ఘాట్ లో జన్మించారు. న్యాయశాస్త్రం చదువుకొని న్యాయవాద వృత్తి ప్రారంభించాడు. ఇదే సమయంలో భారత స్వాతంత్ర్య పోరాటం జరుగుతుంది. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుపాలైన జాతీయ నాయకుల తరపున వాదించేవాడు. క్రమంగా గాంధీవైపు ఆకర్షితుడయ్యడు. గాంధీ సిద్ధాంతలకు కట్టుబడి జీవితాంతం అణగారిన వర్గాల అభ్యున్నతికై కృషి చేసారు.


1951లో తొలిసారిగా ‘ఆనందవన్’ అనే ఆశ్రమాన్ని కుష్టురోగులకోసం ప్రారంభించారు. నేడు ఈ ఆశ్రమం 500 ఎకరాలకు విస్తరించింది. తరువాత సోమనాథ్, అశోకవన్ ఆశ్రమాలను కూడా స్థాపించారు. ఆనందవన్లో రెండు ఆసుపత్రులు, ఒక విశ్వవిద్యాలయం, అంధుల పాఠశాల, ఒక అనాధ శరణాలచం ఉన్నాయి.94 సంవత్సారాల వయసులో 2008 ఫిబ్రవరి 9వ తేదీన ఆనందవన్ ఆశ్రమంలో మరణించారు.ఈయనకు గాంధీ శాంతిబహుమతి, రామన్ మెగసేసే ఆవార్డులు లభించాయి. భారతదేశపు అత్యున్నతపు పురస్కారాలు ‘పద్మశ్రీ’, ‘పద్మవిభూషణ్’ లభించాయి..


బాబా ఆమ్టే స్థాపించిన మూడు ఆశ్రమాల్లో ఆనంద్‌వన్ మొదటిది. కుష్టురోగుల సంక్షేమానికి మహారాష్ట్రలోని చంద్రాపుర్ జిల్లాలో ఈ ఆశ్రమాన్ని 1951లో స్థాపించాడు. ఆనంద్‌వన్ అనగా అర్థం ఆనందపు అడవి. వరోరాకు దగ్గరలోని అటవీ ప్రాంతంలో 50 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ప్రారంభించాడు. అది క్రమక్రమంగా పెద్దదై నేడు 500 ఎకరాలకు విస్తరించింది. ఆ రోజులలో కుష్టురోగులకు సమాజం నుంచి వెలివేసేవారు. అలాంటి వారి కొరకు ఆశ్రమాన్ని స్థాపించి కుష్టురోగులను చేరదీసి వారితో పాటు అతడు కూడా అక్కడే వారి సంక్షేమం చూస్తూ గడపటం గొప్పవిషయం.


కుష్టువ్యాధి ఒక అంటురోగమని, కుష్టురోగులను తాకినా ఆ వ్యాధి వస్తుందనే ప్రచారంలో ఉన్న సమయంలో బాబాఆమ్టే ఆ వదంతులను త్రిప్పికొట్టడానికి స్వయంగా ఒక కుష్టురోగి నుంచి బాసిల్లి క్రిములను తన శరీరంలో ఇంజెక్షన్ ద్వారా ఎక్కించుకున్నాడు.  కుష్టురోగులకై బాబాఆమ్టే తదనంతరం సోమనాథ్, అశోకవన్ ఆశ్రమాలను కూడా స్థాపించాడు. సమాజసేవ విషయంలో ఆనంద్‌వన్ ఆశ్రమం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది. ఆనంద్‌వన్ కై బాబాఆమ్తేకు 1983లో డేమియన్ డట్టన్ లెప్రసీ సంస్థనుంచి డేమియన్ డట్టన్ అవార్డు కూడా లభించింది. ప్రస్తుతం ఆనంద్‌వన్ రెండు ఆసుపత్రులను, ఒక విశ్వవిద్యాలయాన్ని, ఒక అంధుల కొరకు పాఠశాలను, ఒక అనాథశరణాలయాన్ని కలిగిఉంది. ఈ ఆశ్రమంలో ప్రస్తుతం 5000కు పైగా నివసిస్తున్నారు.




ఫాస్టాగ్ సరికొత్త రికార్డ్ !

ఆ మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీలను ఎలా అవుట్ చేశానంటే.. సీక్రెట్ చెప్పిన పాక్ పేసర్

విక్రమ్ ‘కోబ్రా’ కొత్త లుక్ చూశారా..? వామ్మో ఇలా ఉన్నాడేంటి..!

ఆ సినిమా అర్ధంతరంగా తప్పుకున్న రవితేజ.. కారణం ఏంటంటే?

చిన్నారి ఫ్యాన్‌‌కు బన్నీ సర్‌ప్రైజ్ గిఫ్ట్

పాదయాత్రలోనే నిర్ణయం తీసుకున్నా: సీఎం జగన్

యాలకుల టీ వల్ల కలిగే ప్రయోజనాలు వింటే షాక్ అవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>