MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/new-angle-in-super-star-mahesh-babuc554b62c-a4e7-4210-ac17-1542452a353c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/new-angle-in-super-star-mahesh-babuc554b62c-a4e7-4210-ac17-1542452a353c-415x250-IndiaHerald.jpgమహేశ్ బాబు ప్రొడక్షన్‌పై మరింత ఫోకస్‌ పెడుతున్నాడు. ఇన్నాళ్లు సొంత సినిమాలకి సహ నిర్మాతగా వ్యవహరించిన మహేశ్, ఇప్పుడు బయటి హీరోలతోనూ సినిమాలు చేస్తున్నాడు. యంగ్ ‌హీరోస్‌తో వరుస సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు మహేశ్‌ బాబు. మహేశ్ బాబు సొంత బ్యానర్‌ స్టార్ట్ చేసినా బయటి హీరోలతో పెద్దగా సినిమాలు తీయలేదు. 'శ్రీమంతుడు, సరిలేరు నీకెవ్వరు' లాంటి సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించాడు. ఇన్నాళ్లూ రెమ్యునరేషన్‌ని పార్టనర్‌షిప్‌గా పెట్టి, జాయింట్‌ ప్రొడ్యూసర్‌గా చేసిన మహేశ్ ఇప్పుడు సొంత సినిమాలు తీస్తున్నాడు. అడవnew angle in super star mahesh babu;cbn;mahesh;atreya;naveen polishetty;raj tharun;sandeep;srinivas;mumbai;cinema;rajani kanthమహేశ్ బాబులో కొత్త కోణం..!మహేశ్ బాబులో కొత్త కోణం..!new angle in super star mahesh babu;cbn;mahesh;atreya;naveen polishetty;raj tharun;sandeep;srinivas;mumbai;cinema;rajani kanthSat, 26 Dec 2020 22:15:00 GMTమహేశ్ బాబు ప్రొడక్షన్‌పై మరింత ఫోకస్‌ పెడుతున్నాడు. ఇన్నాళ్లు సొంత సినిమాలకి సహ నిర్మాతగా వ్యవహరించిన మహేశ్, ఇప్పుడు బయటి హీరోలతోనూ సినిమాలు చేస్తున్నాడు. యంగ్ ‌హీరోస్‌తో వరుస సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు మహేశ్‌ బాబు.

మహేశ్ బాబు సొంత బ్యానర్‌ స్టార్ట్ చేసినా బయటి హీరోలతో పెద్దగా సినిమాలు తీయలేదు. 'శ్రీమంతుడు, సరిలేరు నీకెవ్వరు' లాంటి సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించాడు. ఇన్నాళ్లూ రెమ్యునరేషన్‌ని పార్టనర్‌షిప్‌గా పెట్టి, జాయింట్‌ ప్రొడ్యూసర్‌గా చేసిన మహేశ్ ఇప్పుడు సొంత సినిమాలు తీస్తున్నాడు. అడవిశేష్, నవీన్‌ పోలిశెట్టి లాంటి కుర్రాళ్లతో సినిమాలు తీస్తున్నాడు మహేశ్.

మహేశ్ బాబు, సోని పిక్చర్స్‌తో కలిసి 'మేజర్' అనే సినిమా తీస్తున్నాడు. ముంబాయి '26/11' దాడుల్లో అమరుడైన వీరజవాన్‌ సందీప్ ఉన్నిక్రిష్ణన్‌ కథాంశంతో వస్తోందీ సినిమా. ఈ మూవీలో అడవి శేష్, మేజర్ సందీప్ పాత్ర పోషిస్తున్నాడు. పాన్‌ ఇండియన్‌ మూవీగా రూపొందిన 'మేజర్' వచ్చే ఏడాది రిలీజ్  కాబోతోంది.

'ఏజెంట్‌ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' సినిమాతో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి, మహేశ్ బాబు బ్యానర్‌లో సినిమా చేస్తాడని టాక్ వస్తోంది. అలాగే రాజ్‌తరుణ్‌ హీరోగా మహేశ్ బాబు బ్యానర్‌లో ఒక సినిమా వస్తోందని ప్రచారం జరుగుతోంది. మరి ఇప్పుడు చిన్న సినిమాలు నిర్మిస్తోన్న మహేశ్‌ మున్ముందు టాప్‌ హీరోలతో కూడా సినిమాలు తీస్తాడేమో చూడాలి.

మొత్తానికి సూపర్ స్టార్ మహేశ్ బాబు నిర్మాతగా బిజీ అవుతున్నాడు. చిన్న హీరోలతో వరుస సినిమాలు చేస్తూ తన ప్రత్యేకతను చాటుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాడు. ఇప్పటికే మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథాంశంతో అడివిశేష్ తో మేజర్ సినిమా తీస్తున్నాడు.26/11 ముంబయి దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ పాత్రలో అడివిశేష్ నటిస్తుండటంతో సినీ అభిమానుల్లో ఒకింత ఆసక్తి నెలకొంది. మరోవైపు మహేశ్ బాబు బ్యానర్‌లో రాజ్‌తరుణ్‌ సినిమా ఉంటుందనే ప్రచారం కూడా జరుగుతోంది.










అబ్బాయ్ నిర్మాణంలో బాబాయ్ సినిమా..!

ప్రభాస్‌తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్.. ఏమన్నాడంటే..

యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన 8 మంది.. అందరికీ కరోనా!

తెలుగు రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు గాలికొదిలిన థియేటర్లు!

రాదేశ్యామ్ కోసం అదిరిపోయే ప్లాన్ రెడీ..విడుదల అప్పుడేనట.?

సలార్ దిగేది అపుడే.... ప్రభాస్ ఫ్యాన్స్ హుషార్ ?

సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ మాములుగా లేదుగా...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>