MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chirangeevib35ea072-fed1-4014-8494-45ee1fc72abd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chirangeevib35ea072-fed1-4014-8494-45ee1fc72abd-415x250-IndiaHerald.jpgమోహన్ బాబు చిరంజీవిలు తమ కెరియర్ ప్రారంభంలో మంచి స్నేహితులు. అప్పట్లో వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు కూడ మంచి విజయాన్ని సాధించాయి. అయితే ఆ తరువాత వీరిద్దరి మధ్య చిన్న గ్యాప్ ఏర్పడింది అని అంటారు. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీ వజ్రోత్సవాల సందర్భంగా వీరిద్దరి మధ్య ఏర్పడిన అభిప్రాయ భేదాలు ఓపెన్ గా అందరికి తెలిసిపోయాయి.అయితే ఆ తరువాత తమ ఇద్దరి మధ్య ఎలాంటి గ్యాప్ లేదు అని అనేక సార్లు వీరిద్దరూ ఓపెన్ గా క్లారిటీ ఇచ్చినా వీరిద్దరి మధ్య ఇంకా గ్యాప్ కొనసాగుతూనే ఉంది అంటూ అనేక సార్లు అనేక సందర్భాలలోchirangeevi;chiranjeevi;editor mohan;mithra;rajamouli;india;tollywood;rrr movie;cinema;writer;industryమోహన్ బాబు చిరంజీవిలను కలిపిన సన్నాఫ్ ఆఫ్ ఇండియా !మోహన్ బాబు చిరంజీవిలను కలిపిన సన్నాఫ్ ఆఫ్ ఇండియా !chirangeevi;chiranjeevi;editor mohan;mithra;rajamouli;india;tollywood;rrr movie;cinema;writer;industrySat, 26 Dec 2020 09:00:00 GMTమోహన్ బాబు చిరంజీవిలు తమ కెరియర్ ప్రారంభంలో మంచి స్నేహితులు. అప్పట్లో  వీరిద్దరూ కలిసి నటించిన  సినిమాలు కూడ మంచి విజయాన్ని సాధించాయి. అయితే ఆ తరువాత వీరిద్దరి మధ్య చిన్న గ్యాప్ ఏర్పడింది అని అంటారు. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీ వజ్రోత్సవాల సందర్భంగా వీరిద్దరి మధ్య ఏర్పడిన అభిప్రాయ భేదాలు ఓపెన్ గా అందరికి తెలిసిపోయాయి.


అయితే ఆ తరువాత  తమ ఇద్దరి మధ్య ఎలాంటి గ్యాప్ లేదు అని అనేక సార్లు వీరిద్దరూ ఓపెన్ గా క్లారిటీ ఇచ్చినా వీరిద్దరి మధ్య ఇంకా గ్యాప్ కొనసాగుతూనే ఉంది అంటూ అనేక సార్లు అనేక సందర్భాలలో వార్తలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితులలో తిరిగి వీరిద్దరిని చాలా గ్యాప్ తరువాత మోహన్ బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘సన్నాఫ్ ఇండియా’ కలపబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి.  


మాటల రచయిత డైమండ్ రత్నబాబు దర్శకత్వం లో మోహన్ బాబు తన సొంత బ్యానర్ లక్ష్మీప్రసన్న ఫిలిమ్స్  మరియు 24ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. దేశభక్తి  నేపధ్యంలో ఉండే ఈమూవీలో మోహన్ బాబు పవర్ ఫుల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇంతవరకు పోషించని డిఫరెంట్ పాత్రలో మోహన్ బాబు నటించడం ఇదే ఫస్ట్ టైం అంటున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.


ఇది ఇలా ఉండగా ఈ మధ్య మోహన్ బాబు చిరంజీవిని ‘ఆచార్య’ సెట్ లోకి వెళ్లి ఆయనను కలిసినట్లు తెలుస్తోంది. తన మూవీకి సంబంధించి వాయస్ ఓవర్ ఇమ్మని మోహన్ బాబు అడగడం చిరంజీవి మరో మాట చెప్పకుండా అంగీకరించడం జరిగింది అంటూ వార్తలు గుప్పు మంటున్నాయి. ఇప్పటికే చిరంజీవి రాజమౌళి కోరికమేరకు ‘ఆర్ ఆర్ ఆర్’ కు వాయస్ ఓవర్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తన మిత్రుడు మోహన్ బాబు కోసం తన వాయస్ ఓవర్ ను అందిస్తూ తాము ఇద్దరం ఎప్పుడు స్నేహితులమే అన్న సంకేతాలు ఇవ్వబోతున్నాడు.




సొంతింటి కలను నెరవేర్చుకున్న హీరో రాజ్ తరుణ్... ఆ హీరోయినే ముఖ్య అతిధి!

ఆ మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీలను ఎలా అవుట్ చేశానంటే.. సీక్రెట్ చెప్పిన పాక్ పేసర్

విక్రమ్ ‘కోబ్రా’ కొత్త లుక్ చూశారా..? వామ్మో ఇలా ఉన్నాడేంటి..!

ఆ సినిమా అర్ధంతరంగా తప్పుకున్న రవితేజ.. కారణం ఏంటంటే?

చిన్నారి ఫ్యాన్‌‌కు బన్నీ సర్‌ప్రైజ్ గిఫ్ట్

పాదయాత్రలోనే నిర్ణయం తీసుకున్నా: సీఎం జగన్

యాలకుల టీ వల్ల కలిగే ప్రయోజనాలు వింటే షాక్ అవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>