MLAProgressM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mlafe57cf56-edd2-4bf5-8101-49613cfc286d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mlafe57cf56-edd2-4bf5-8101-49613cfc286d-415x250-IndiaHerald.jpgచిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం....టీడీపీ అధినేత చంద్రబాబు సొంతగడ్డ అన్న సంగతి అందరికీ తెలిసిందే. చంద్రబాబు చంద్రగిరి పరిధిలోనే నారావారిపల్లె గ్రామంలోనే జన్మించారు. ఇక చంద్రబాబు రాజకీయ జీవితం మొదలైంది కూడా చంద్రగిరిలోనే. 1978 ఎన్నికల్లో చంద్రబాబు చంద్రగిరి నుంచి కాంగ్రెస్ తరుపున బరిలో దిగి విజయం సాధించి, తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అయితే 1983 ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనంలో చంద్రబాబు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఓడిపోయాక చంద్రబాబు టీడీపీలోకి వెళ్ళిపోయారు. ఇక అక్కడ నుంచి ఏం జరిగysrcp mla;nani;bhaskar;jeevitha rajaseskhar;congress;2019;district;baba bhaskar;village;mla;tdp;local language;chandragiri;reddy;chevireddy bhaskarareddy;dookudu;party;naravaripalliహెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: చెవిరెడ్డి అడ్డాగా మారిన చంద్రబాబు సొంతగడ్డ...హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: చెవిరెడ్డి అడ్డాగా మారిన చంద్రబాబు సొంతగడ్డ...ysrcp mla;nani;bhaskar;jeevitha rajaseskhar;congress;2019;district;baba bhaskar;village;mla;tdp;local language;chandragiri;reddy;chevireddy bhaskarareddy;dookudu;party;naravaripalliSat, 26 Dec 2020 05:00:00 GMTజిల్లా చంద్రగిరి నియోజకవర్గం....టీడీపీ అధినేత చంద్రబాబు సొంతగడ్డ అన్న సంగతి అందరికీ తెలిసిందే. చంద్రబాబు చంద్రగిరి పరిధిలోనే నారావారిపల్లె గ్రామంలోనే జన్మించారు.  ఇక చంద్రబాబు రాజకీయ జీవితం మొదలైంది కూడా చంద్రగిరిలోనే. 1978 ఎన్నికల్లో చంద్రబాబు చంద్రగిరి నుంచి కాంగ్రెస్ తరుపున బరిలో దిగి విజయం సాధించి, తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అయితే 1983 ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనంలో చంద్రబాబు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.  ఓడిపోయాక చంద్రబాబు టీడీపీలోకి వెళ్ళిపోయారు. ఇక అక్కడ నుంచి ఏం జరిగిందో అందరికీ తెలుసు.

చంద్రబాబు కుప్పం వెళ్లిపోయాక చంద్రగిరిలో టీడీపీ పరిస్థితి దారుణమైపోయింది. 1983, 1983, 1994 ఎన్నికల్లో తప్పా ఇక్కడ టీడీపీ మళ్ళీ గెలవలేదు. చంద్రగిరిలో మెజారిటీ సార్లు కాంగ్రెస్ పార్టీనే గెలిచింది.  2014, 2019 ఎన్నికలోచ్చేసరికి వరుసగా వైఎస్సార్‌సీపీ తరుపున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలుస్తూ వస్తున్నారు. ఈయన హవా ముందు చంద్రగిరిలో టీడీపీ అడ్రెస్ లేకుండా పోతుంది. పైగా ఇప్పుడు చెవిరెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యే ఉంటూ, నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టిస్తున్నారు.

ప్రభుత్వం నుంచి దాదాపు 228 కోట్ల నిధులు మజూరు చేయించుకుని, నియోజకవర్గంలో పనులు చేయిస్తున్నారు. అటు నియోజకవర్గంలో తాగునీరు, సాగునీరు సమస్యలు లేకుండా చూసుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలు ఎలాగో ప్రజలకు అందుతూనే ఉన్నాయి. పార్టీల పరంగా చూసుకుంటే ఇక్కడ వైఎస్సార్‌సీపీ బాగా బలంగా ఉందని చెప్పడం కంటే చెవిరెడ్డి స్ట్రాంగ్‌గా ఉన్నారని చెప్పొచ్చు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన చెవిరెడ్డి తన పనితీరుతో జనాలకు మరింత దగ్గరయ్యారు. అదే సమయంలో టీడీపీలో ఉన్న బలమైన నేతలనీ తనవైపుకు తిప్పేసుకున్నారు.

అయితే ఇక్కడ టీడీపీ నాయకుడు పులివర్తి నాని సైతం దూకుడుగా పనిచేయడం మొదలుపెట్టారు. యాక్టివ్‌గా పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళుతున్నారు. స్థానిక సమస్యలపై పోరాటం చేస్తున్నారు. కానీ ఎంత పోరాటం చేసినా ఇక్కడ చెవిరెడ్డి హవా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలు పెద్ద ఎత్తున చెవిరెడ్డి వైపే ఉన్నారని అర్ధమవుతుంది. మొత్తానికైతే చంద్రబాబు సొంతగడ్డ చెవిరెడ్డి అడ్డాగా మారిపోయిందనే చెప్పొచ్చు.




ఆ మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీలను ఎలా అవుట్ చేశానంటే.. సీక్రెట్ చెప్పిన పాక్ పేసర్

విక్రమ్ ‘కోబ్రా’ కొత్త లుక్ చూశారా..? వామ్మో ఇలా ఉన్నాడేంటి..!

ఆ సినిమా అర్ధంతరంగా తప్పుకున్న రవితేజ.. కారణం ఏంటంటే?

చిన్నారి ఫ్యాన్‌‌కు బన్నీ సర్‌ప్రైజ్ గిఫ్ట్

పాదయాత్రలోనే నిర్ణయం తీసుకున్నా: సీఎం జగన్

యాలకుల టీ వల్ల కలిగే ప్రయోజనాలు వింటే షాక్ అవ్వాల్సిందే?

12 ఏళ్ల బుడ్డోడు.. గిన్నీస్ రికార్డు కొట్టాడు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>