EditorialVijayaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/ananantapuram-tadipatri-jc-peddareddy-tdp-ycp-jagad62862a4-4df5-4d32-b207-b272c639a56e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/ananantapuram-tadipatri-jc-peddareddy-tdp-ycp-jagad62862a4-4df5-4d32-b207-b272c639a56e-415x250-IndiaHerald.jpgనిజానికి అధికారపార్టీలో ఉండి కూడా పెద్దారెడ్డి మాజీ ఎంఎల్ఏ ఇంటిపైకి దాడి చేయాల్సిన అవసరం లేదు. జేసీ మద్దతుదారుల విషయంలో ఎంఎల్ఏకి ఏమైనా సమస్యలుంటే పోలీసులకు ఫిర్యాదు చేసుకుంటే వాళ్ళే చూసుకుంటారు. అలాంటిది నేరుగా ఎంఎల్ఏనే దాడి చేశారంటేనే తెలిసిపోతోంది టీడీపీ ట్రాపులో పెద్దారెడ్డి పడ్డారని. టీడీపీ ప్రజాప్రతినిధులైనా లేకపోతే నేతలైనా ఓ వ్యూహం ప్రకారం వెళుతున్నారు. వైసీపీ ఎంఎల్ఏలు, నేతలను రెచ్చగొట్టి తమపై దాడులు చేసేట్లుగా ప్రేరేపిస్తున్నారు. ఎలాగూ అధికారంలో ఉన్నాంకదాని వైసీపీ నేతలు కూడా రెచ్చిపోతున్ananantapuram tadipatri jc peddareddy tdp ycp jaga;view;prabhakar;prabhakar reddy;telugu desam party;godavari river;district;east;telugu;east godavari;police;media;chintamaneni prabhakar;mla;tdp;success;ycp;parakala prabhakar;reddy;partyహెరాల్డ్ ఎడిటోరియల్ : టీడీపీ ట్రాపులో వైసీపీ చిక్కుకుంటోదా ?హెరాల్డ్ ఎడిటోరియల్ : టీడీపీ ట్రాపులో వైసీపీ చిక్కుకుంటోదా ?ananantapuram tadipatri jc peddareddy tdp ycp jaga;view;prabhakar;prabhakar reddy;telugu desam party;godavari river;district;east;telugu;east godavari;police;media;chintamaneni prabhakar;mla;tdp;success;ycp;parakala prabhakar;reddy;partyFri, 25 Dec 2020 03:00:00 GMTచూసేవాళ్ళకు విచిత్రంగానో లేకపోతే నమ్మలేనట్లుగానో ఉన్నా వాస్తవం అయితే ఇదే అనిపిస్తోంది. తాజాగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన గొడవను చూస్తుంటే ఇది పక్కా ట్రాపన్న విషయంలో అనుమానాలు పెరిగిపోతున్నాయి. తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందన్న కారణంతో ఎంఎల్ఏ కేతిరెడ్డి పెద్దారెడ్డి మాజీ ఎంఎల్ఏ, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిమీద దాడి చేశారు. ఎంఎల్ఏనే దాడి చేసిన తర్వాత ఇక మద్దతుదారులు ఎందుకూరుకుంటారు ? అనుచరులు రెచ్చిపోయి జేసీ మద్దతుదారులపై దాడులు మొదలుపెట్టారు.  దాంతో ఇరువర్గాలకు చెందిన వాహనాలు తగలబడ్డాయి. ఒకరిపై మరొకళ్ళు రాళ్ళతో దాడులు చేసుకున్నారు. విచిత్రమేమిటంటే జేసీ ఇంటికి వెళ్ళి ఆయన మద్దతుదారులను ఎంఎల్ఏ పెద్దారెడ్డి కొట్టడం. ఎంఎల్ఏ+మద్దతుదారులు దాడి చేసినపుడు ఇంట్లో జేసీ లేరు. విషయం తెలిసిన తర్వాత వెంటనే ఇంటికి చేరుకున్నారు.




నిజానికి అధికారపార్టీలో ఉండి కూడా పెద్దారెడ్డి మాజీ ఎంఎల్ఏ ఇంటిపైకి దాడి చేయాల్సిన అవసరం లేదు. జేసీ మద్దతుదారుల విషయంలో ఎంఎల్ఏకి ఏమైనా సమస్యలుంటే పోలీసులకు ఫిర్యాదు చేసుకుంటే వాళ్ళే చూసుకుంటారు. అలాంటిది నేరుగా ఎంఎల్ఏనే దాడి చేశారంటేనే తెలిసిపోతోంది టీడీపీ ట్రాపులో పెద్దారెడ్డి పడ్డారని. టీడీపీ ప్రజాప్రతినిధులైనా లేకపోతే నేతలైనా ఓ వ్యూహం ప్రకారం వెళుతున్నారు. వైసీపీ ఎంఎల్ఏలు, నేతలను రెచ్చగొట్టి తమపై దాడులు చేసేట్లుగా  ప్రేరేపిస్తున్నారు. ఎలాగూ అధికారంలో ఉన్నాంకదాని వైసీపీ నేతలు కూడా రెచ్చిపోతున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో కూడా ఇలాంటి గొడవే జరిగింది. ఆమధ్య చిత్తూరు జిల్లాలో కొన్ని చోట్ల, తూర్పుగోదావరి జిల్లా, కర్నూలు జిల్లా, విజయవాడలో కూడా ఇదే పద్దతిలో టీడీపీ నేతలు ముందుకెళుతున్నారు.




వాళ్ళు రెచ్చగొట్టడం, అధికారపార్టీ నేతలు రెచ్చిపోవటం మామూలైపోయింది. వైసీపీ నేతలను రెచ్చగొట్టడం ద్వారా లా అండ్ ఆర్డర్ సమస్యను సృష్టించాలన్న ప్లానులో టీడీపీ సక్సెస్ అవుతోంది. వాళ్ళ వ్యూహాన్ని వైసీపీ నేతలే గ్రహించలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ లేదని ఎస్టాబ్లిష్ చేయటమే టీడీపీ వ్యూహం.  తన వ్యూహానికి తగ్గట్లుగానే న్యాయస్ధానాలు చేసిన వ్యాఖ్యలను కూడా టీడీపీ తన వాదనకు మద్దతుగా బాగా హైలైట్ చేసుకుంటోంది. ఈ విషయాన్ని గమనించటంలోనే అధికారపార్టీ నేతలు ఫెయిలవుతున్నారు. ఎక్కడ ఏ చిన్న గొడవ జరిగినా మెజారిటీ మీడియా టీడీపీకి మద్దతుగా ఉన్న కారణంగా ఎలాగూ వైసీపీ వాళ్ళు చేసిన గొడవలనే బాగా ఎక్స్ పోజ్ చేస్తోంది. దీని వల్ల జనాల్లోకి అధికారపార్టీ చాలా బ్యాడ్ గా వెళిపోతోంది. కాబట్టి ఇప్పటికైనా అధికారపార్టీ అసలు విషయాన్ని గమనించి టీడీపీ వ్యూహానికి విరుగుడు తెలుసుకోవాలి. అలాకాకుండా తెలుగుదేశంపార్టీ ట్రాపులో పడిపోతే పార్టీకి బాగా నష్టం జరగటం ఖాయమని గుర్తుంచుకోవాలి.





పవన్ ఫిక్స్ అయిపోయారా? జనసేన అడ్వాంటేజ్ ఇదేనా?

టీడీపీ నేతల పిచ్చి ముడిపోయింది.. చంద్రబాబు సీఎం అవుతాడంటా..?

కొత్త వైరస్ తో ప్రజల్లో భయం భయం...!

టీంఇండియాను మా వాళ్లు ఊదేస్తారు.. వార్న్ వార్నింగ్

మెగా హీరో సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?

జగన్ జిల్లాలో పార్టీని నాశనం చేస్తున్నారా...?

కార్యకర్తల తప్పులు... వైసీపీకి ఇబ్బందే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>