EditorialMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/farmers-delhi-modhi-bjp-government8394ae47-bc7e-445d-a509-de0a458c7fb9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/farmers-delhi-modhi-bjp-government8394ae47-bc7e-445d-a509-de0a458c7fb9-415x250-IndiaHerald.jpgరైతులకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే నూతన వ్యవసాయ సంస్కరణల బిల్లు దేశవ్యాప్తంగా తీసుకువచ్చామని కేంద్రం పదే పదే చెబుతోంది. అయితే ఈ బిల్లులో రైతులకు కీడు చేసే అంశాలే ఎక్కువగా ఉన్నాయని రైతుల్లో ఆందోళన నెలకొంది. గత 30 రోజులుగా ఢిల్లీలో పెద్దఎత్తున రైతులు చలిని సైతం లెక్కచేయకుండా, కేంద్రం తీరుపై నిరసన తెలియజేస్తునే వస్తున్నారు. కేంద్రం చర్చల పేరుతో వీరిని పిలిచి సమస్యను సర్దుబాటు చేద్దాం అనుకున్నా.. అవి ఒక కొలిక్కి రావడం లేదు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఈ సమసfarmers delhi modhi bjp government;haryana - chandigarh;uttarakhand;huzur nagar;police;prime minister;job;uttar pradesh;central government;punjab;parliamentఎడిటోరియల్ : రాజకీయం వర్సెస్ రైతులు ?ఎడిటోరియల్ : రాజకీయం వర్సెస్ రైతులు ?farmers delhi modhi bjp government;haryana - chandigarh;uttarakhand;huzur nagar;police;prime minister;job;uttar pradesh;central government;punjab;parliamentFri, 25 Dec 2020 21:00:00 GMTపంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఈ సమస్యపై ఎక్కువగా పోరాటం చేస్తూ వస్తున్నాయి. అయినా ఈ సమస్య ఒక కొలిక్కి రావడం లేదు.



కేంద్రం సైతం ఈ ఉద్యమాన్ని అదుపులోకి తీసుకురావాలని, వ్యవసాయ సంస్కరణల బిల్లులో ఎటువంటి మార్పులు చేసేందుకు ఇష్టపడడం లేదు. ఇది రైతులకు మేలు చేసేదే అని చెబుతూ, వారికి  నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తూ ఉండటం వంటి కారణాలతో, ఈ సమస్య రోజు రోజుకు మరింత జటిలం అవుతూ వస్తోంది. తాజాగా ఉత్తరాఖండ్ ని ఉద్దంసింగ్ నగర్ జిల్లాలో రైతులు పోలీసులకు మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. బాస్ పూర్ ప్రాంతంలో రైతులు ఆందోళన చేస్తుండడంతో వారు ముందుకు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు పెద్ద ఎత్తున అడ్డుగా పెట్టడం, రైతులు ఆ బారికేడ్లను ట్రాక్టర్లతో ఎక్కించుకుని మరీ ముందుకు వెళ్లడం, రైతులు ముందుకు వెళ్ళకుండా ట్రాక్టర్లకు బారికెట్లు  పోలీసులు  అడ్డంగా వేయడం ఇలా చాలా తతంగమే జరిగింది.



 పోలీసులు, ప్రభుత్వాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, రైతులు మాత్రం వ్యవసాయ సంస్కరణల బిల్లు విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. వ్యవసాయ సంస్కరణలు బిల్లులో సంస్కరణలు కాదని మొత్తం ఆ బిల్లును రద్దు చేయాలి అనేది రైతుల ప్రధాన డిమాండ్.అసలు పార్లమెంటులో సరైన చర్చ ఏది చేయకుండానే వ్యవసాయ సంస్కరణల బిల్లును ఆమోదించారని, వెంటనే దీనిని రద్దు చేయాలని రైతులు సుప్రీంకోర్టు సైతం ఆశ్రయించారు. దీనిపై ఓ కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సైతం సూచించింది. అయితే రాజకీయాల కోసమే రైతులను రెచ్చగొడుతున్నారని విపక్షాలపై ప్రధాని విమర్శలు చేస్తున్నారు. రైతుల డిమాండ్లలో న్యాయం ఉందా లేదా అనేది పక్కన పెడితే ఇది పూర్తిగా రాజకీయ రంగు పులుముకుని ఏ పరిష్కారం లేకుండా అతి పెద్ద సమస్యగా మారిపోయింది.


టీపీసీసీ పదవి నాకివ్వకుంటే.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు..?

ఆ మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీలను ఎలా అవుట్ చేశానంటే.. సీక్రెట్ చెప్పిన పాక్ పేసర్

విక్రమ్ ‘కోబ్రా’ కొత్త లుక్ చూశారా..? వామ్మో ఇలా ఉన్నాడేంటి..!

ఆ సినిమా అర్ధంతరంగా తప్పుకున్న రవితేజ.. కారణం ఏంటంటే?

చిన్నారి ఫ్యాన్‌‌కు బన్నీ సర్‌ప్రైజ్ గిఫ్ట్

పాదయాత్రలోనే నిర్ణయం తీసుకున్నా: సీఎం జగన్

యాలకుల టీ వల్ల కలిగే ప్రయోజనాలు వింటే షాక్ అవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>