PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/central-govt-ready-dry-run-on-covid-11111111111111111111111111119-vaccine-in-four-states3a7f5681-292f-4058-bc2a-d0ab05e11b8b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/central-govt-ready-dry-run-on-covid-11111111111111111111111111119-vaccine-in-four-states3a7f5681-292f-4058-bc2a-d0ab05e11b8b-415x250-IndiaHerald.jpgదేశ ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కరోనా వ్యాక్సిన్ ఇండియాలో అందుబాటులోకి రాబోతోంది. వారం రోజుల్లో పంపిణికి సిద్ధమవుతున్న కేంద్రం.. మొదటగా నాలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణి డ్రై రన్ నిర్వహించబోతోంది. ఆంధ్రప్రదేశ్ తో పాటు పంజాబ్, గుజరాత్, అసోం రాష్ట్రాల్లో కరోనా డోసు డ్రైరన్ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 28 29 తేదీల్లో ఈ నాలుగు రాష్ట్రాల్లో కరోనా టీకా పంపిణికి సంబంధించి డ్రైరన్ నిర్వహించనున్నారని తెలుస్తోందిcovid 19;poorna;india;andhra pradesh;gujarat - gandhinagar;american samoa;december;job;central government;punjab;coronavirusదేశంలో కరోనా తొలి డోసు ఏపీలోనే!దేశంలో కరోనా తొలి డోసు ఏపీలోనే!covid 19;poorna;india;andhra pradesh;gujarat - gandhinagar;american samoa;december;job;central government;punjab;coronavirusFri, 25 Dec 2020 16:21:44 GMTఆంధ్రప్రదేశ్ తో పాటు పంజాబ్, గుజరాత్, అసోం రాష్ట్రాల్లో కరోనా డోసు డ్రైరన్ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 28 29 తేదీల్లో ఈ నాలుగు రాష్ట్రాల్లో కరోనా టీకా పంపిణికి సంబంధించి డ్రైరన్ నిర్వహించనున్నారని తెలుస్తోంది.


    ఏడాది కాలంగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడు రూపు మార్చుకుని మరింతగా విరుచుకుపడుతోంది. దక్షిణాఫ్రికా, బ్రిటన్ లో వెలుగు చూసిన కొత్త రకం కరోనా వైరస్ తో దేశాలన్ని మళ్లీ భయం గుప్పిట్లోకి వెళ్లాయి. ఇప్పటికే చాలా దేశాలు రెండో సారి సంపూర్ణ లాక్  డౌన్ ప్రకటించాయి. కొన్ని దేశాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణి ముమ్మరంగా సాగుతోంది. వ్యాక్సిన్ కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది భారత్. అయితే అత్యవసర వినియోగం కింద తమ వ్యాక్సిన్‌కు అనుమతినివ్వాలని కోరడంతో.. టీకా రక్షణ, భద్రతకు సంబంధించి భారత వైద్యాధికారులు ఆస్ట్రాజెనెకా ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నారని, ఈ టీకాకు అత్యవసర అనుమతులు రావొచ్చని సంబంధిత అధికారులు తెలిపారు. ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు  వారంలో అనుమతి రానుందని కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి.  

           అమెరికా, బ్రిటన్‌ లో ప్రస్తుతం  ఫైజర్‌ టీకాను అక్కడి ప్రజలకు వేస్తున్నారు. అయితే ఫైజర్  టీకాను భద్రపరిచేందుకు మైనస్‌ 70 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత అవసరం. అందుకు తగ్గ వసతులు ఇండియాలో తక్కువగా ఉండటంతో కేంద్రం ఆక్స్‌ఫర్డ్‌ టీకా వైపునకు చూస్తోందని చెబుతున్నారు. సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నది. దీని ధర డోసుకు రూ.250 వరకు ఉంటుందని అంచనా. సాధారణ ఫ్రిజ్‌లో కూడా దీనిని సుదీర్ఘకాలం భద్రపరిచే వీలుంది. ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ తుది దశ ట్రయల్స్‌లో ఆసక్తికరమైన ఫలితాలు వచ్చాయి.  రెండు డోసుల వ్యాక్సిన్‌ను తీసుకున్న వలంటీర్లపై టీకా 62 శాతం సమర్థమంతంగా పనిచేయగా, ఒకటిన్నర డోసు  తీసుకున్న వలంటీర్లపై టీకా 90 శాతం సమర్థమంతంగా పనిచేసింది. అయితే  కేంద్రం ఈ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి అనుమతులను ఇస్తే, రెండు డోసుల టీకా వినియోగానికి సిద్ధపడుతుందా? లేక ఒకటిన్నర డోసుకు సానుకూలంగా ఉంటుందా? అనే చర్చ తెరపైకి వస్తున్నది.  వ్యాక్సిన్‌ రెండు డోసుల వినియోగానికే కేంద్రం మొగ్గు చూపవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.

                  


అల వైకుంఠపురం ఓకే.. జగన్మోహనపురం గురించి విన్నారా?

పాదయాత్రలోనే నిర్ణయం తీసుకున్నా: సీఎం జగన్

యాలకుల టీ వల్ల కలిగే ప్రయోజనాలు వింటే షాక్ అవ్వాల్సిందే?

షూటింగ్ కి లేట్ గా వస్తే హీరోయిన్ KR విజయకు ఏకంగా కోర్ట్ లో చుక్కలు చూపించిన ఎన్టీఆర్

ఫ్యామిలీ ''బ్యాక్ గ్రౌండ్"తో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన స్టార్ హీరోయిన్లు!

పీసీసీ దాదాపు రేవంత్ కే ఖరారు...

మా నాన్న కిరాతకుడు: వనిత విజయ్ కుమార్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>