PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagand5b0a4da-bafe-4938-bce7-a093197c35ef-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagand5b0a4da-bafe-4938-bce7-a093197c35ef-415x250-IndiaHerald.jpgమాట తప్పను మడమ తిప్పను అంటూ పదే పదే ప్రతి సందర్భంలో చెప్పడమే కాకుండా, ఏపీ సీఎం జగన్ ఎప్పుడు ఆ మాటను నిజం చేసుకుంటూ వస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఎన్నికల హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుని తమ చిత్తశుద్ధిని చాటుకున్నారు. కొన్ని కొన్ని హామీలు నెరవేర్చకుందామనుకున్నా , కోర్టు వ్యవహారాలు కారణంగా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్నాయి.అయినా అన్నిటినీ అమలు చేసి చూపించి తన చిత్తశుద్ధిని చాటుకోవాలని జగన్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇక ఈ రోజు డిసెjagan ap cm house deeds;auto;amala akkineni;jagan;andhra pradesh;december;mla;letter;tdp;local language;ycpఈ రోజుతో జగన్ సూపర్ హిట్టే ?ఈ రోజుతో జగన్ సూపర్ హిట్టే ?jagan ap cm house deeds;auto;amala akkineni;jagan;andhra pradesh;december;mla;letter;tdp;local language;ycpFri, 25 Dec 2020 09:03:48 GMTమాట తప్పను మడమ తిప్పను అంటూ పదే పదే ప్రతి సందర్భంలో చెప్పడమే కాకుండా, ఏపీ సీఎం జగన్ ఎప్పుడు ఆ మాటను నిజం చేసుకుంటూ వస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఎన్నికల హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుని తమ చిత్తశుద్ధిని చాటుకున్నారు. కొన్ని కొన్ని హామీలు నెరవేర్చకుందామనుకున్నా ,  కోర్టు వ్యవహారాలు కారణంగా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్నాయి.అయినా అన్నిటినీ అమలు చేసి చూపించి తన చిత్తశుద్ధిని చాటుకోవాలని జగన్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇక ఈ రోజు డిసెంబర్ 25న బడుగు బలహీనవర్గాల అభివృద్ధి లక్ష్యంగా, గూడు లేని నిరుపేదలకు అవకాశం కల్పించేందుకు భారీ ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 




నేడు లబ్ధిదారులకు వాటిని పంపిణీ చేయబోతున్నారు. దాదాపు 31 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ తోపాటు, 15.5 లక్షల ఇళ్ళకు శంకుస్థాపన చేసే కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలో ఇది కూడా ఉంది. ఈ హామీని ఎప్పుడూ నెరవేర్చుకునేందుకు జగన్ ప్రయత్నించినా, కోర్టు లో టిడిపి అనుకూల వర్గీయులు, మరికొన్ని చోట్ల ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూములపై న్యాయ వివాదాలు ఉండటం వంటి వ్యవహారాలు కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.అసలు జగన్ ఇప్పుడు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం ఎన్నికల ముందు మొదలు పెట్టి హడావుడిగా పంపిణీ చేసి,  రాజకీయ లబ్ది పొందే అవకాశం ఉన్నా,  ఆయన మాత్రం ముందుగానే వీటిని పంపిణీ చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు అనే అభిప్రాయం ప్రజల్లో కలిగించారు. 




ఈరోజు ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం ఒక పండగలా నిర్వహించేందుకు వైసీపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.  ప్రతి ఊర్లో స్థానిక ఎమ్మెల్యే అర్హులైన వారందరికీ కొత్త ఇళ్ల పట్టాల పంపిణీ తోపాటు, కొన్నిచోట్ల నిర్మాణాల కోసం శంకుస్థాపన చేపడతారు.నేటి నుంచి 15 రోజుల పాటు ప్రజా ప్రతినిధులు వారి వారి నియోజకవర్గాల్లో పర్యటించి ఈ కార్యక్రమం 15 రోజుల పాటు పండుగలా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి అయితే జగన్ జనాల్లో చిరస్థాయిగా ముద్ర వేయించుకుంటారు అనడంలో సందేహం లేదు.



చికెన్ బిర్యానీ తెగ తినేశారు

టీడీపీ నేతల పిచ్చి ముడిపోయింది.. చంద్రబాబు సీఎం అవుతాడంటా..?

కొత్త వైరస్ తో ప్రజల్లో భయం భయం...!

టీంఇండియాను మా వాళ్లు ఊదేస్తారు.. వార్న్ వార్నింగ్

మెగా హీరో సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?

జగన్ జిల్లాలో పార్టీని నాశనం చేస్తున్నారా...?

కార్యకర్తల తప్పులు... వైసీపీకి ఇబ్బందే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>