PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/clarity-on-telangana-pcc-chiefc7d94606-4949-40b2-8e40-1ae3e3fd6840-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/clarity-on-telangana-pcc-chiefc7d94606-4949-40b2-8e40-1ae3e3fd6840-415x250-IndiaHerald.jpgతెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక పంచాయితీకి త్వరలోనే పుల్ స్టాప్ పడనుంది. ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మరో మూడు రోజుల పాటు దీనిపై సమాలోచనలు జరగనున్నాయి. సోనియా గాంధీ పరిశీలనలో ఐదుగురు నేతల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో ఒకరు టీఎస్ పీసీసీ అధ్యక్షుడిగా ఫైనల్ కానున్నారు. ఈ విషయంపై పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్.. జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సోనియాను కలిసి చర్చించనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జ్ మాణిక్యమ్ ఠాగూర్ తన అభిప్రాయాన్ని సోనియాకు వివరించారు. ఈ నెలాఖరుకల్లా అధికclarity on telangana pcc chief;soniagandhi;kumaar;nagarjuna akkineni;revanth;venu;delhi;bharatiya janata party;telangana;mohandas karamchand gandhi;sonia gandhi;revanth reddy;congress;selection process;reddy;party;venu thottempudiతెలంగాణ పీసీసీపై క్లారిటీ..!తెలంగాణ పీసీసీపై క్లారిటీ..!clarity on telangana pcc chief;soniagandhi;kumaar;nagarjuna akkineni;revanth;venu;delhi;bharatiya janata party;telangana;mohandas karamchand gandhi;sonia gandhi;revanth reddy;congress;selection process;reddy;party;venu thottempudiFri, 25 Dec 2020 21:30:00 GMTతెలంగాణ పీసీసీ చీఫ్ ఎవరనే దానిపై నెలాఖరు కల్లా క్లారిటీ రానుంది. పార్టీ నడిపించే నాయకుడిపై హైకమాండ్ గట్టిగా కసరత్తు చేస్తోంది. 2023 ఎలక్షన్లలో పార్టీని గెలుపు బాటలోకి తీసుకెళ్లే వారికే పార్టీ పగ్గాలు అప్పగించాలనే ఆలోచనలో ఉంది. తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపికపై పార్టీ సీనియర్లతో మంతనాలు జరుపుతున్నారు సోనియా.

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక పంచాయితీకి త్వరలోనే పుల్ స్టాప్ పడనుంది. ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మరో మూడు రోజుల పాటు దీనిపై సమాలోచనలు జరగనున్నాయి. సోనియా గాంధీ పరిశీలనలో ఐదుగురు నేతల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో ఒకరు టీఎస్ పీసీసీ అధ్యక్షుడిగా ఫైనల్ కానున్నారు. ఈ విషయంపై పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్.. జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సోనియాను కలిసి చర్చించనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జ్ మాణిక్యమ్ ఠాగూర్ తన అభిప్రాయాన్ని సోనియాకు వివరించారు. ఈ నెలాఖరుకల్లా అధికారిక ప్రకటన వస్తుందంటున్నాయి పార్టీ వర్గాలు.

పార్టీ ఇన్‌చార్జ్ అభిప్రాయ సేకరణ చేస్తున్న సమయంలోనే.. అధ్యక్ష బాధ్యతలు తమకే ఇవ్వాలని పట్టు పట్టిన నేతలు..ఢిల్లీలోనూ గట్టిగా ప్రయత్నాలు చేశారు. ఢిల్లీలో రైతుల ఆందోళనలకు మద్దతుగా కాంగ్రెస్ చేపట్టిన ర్యాలీలో పాల్గొనేందుకు ఉత్తమ్‌ కుమార్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. మరి కొంతమంది ఆశావహులు కూడా ఢిల్లీలోనే మకాం వేసి ప్రయత్నాలు సాగిస్తున్నారు. పార్టీలో విబేధాలను దృష్టిలో ఉంచుకొని.. అందరినీ కలుపుకునే పోయే నేతకే పార్టీ బాధ్యతలు అప్పగించాలని భావిస్తోంది పార్టీ అధినాయకత్వం.

తెలంగాణలో బీజేపీ రోజు రోజుకీ బలపడుతోంది. కాంగ్రెస్ నుంచి ఇప్పటికే కొంతమంది నేతలు టీఆర్ఎస్‌లో చేరారు. మిగిలిన వాళ్లలో చాలా మంది బీజేపీ వైపు చూస్తున్నారు. నాయకత్వ సమస్య కారణంగా  కేడర్ అయోమయంలో ఉంది. పార్టీని గాడిన పెట్టడంతో పాటు నేతల మధ్య సమన్వయం సాధించడం, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఆ తర్వాత జరగనున్న కార్పోరేషన్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు కొత్తగా వచ్చే  తెలంగాణ పీసీసీ బాస్‌కు పెను సవాళ్లు కానున్నాయి. 


ఆ మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీలను ఎలా అవుట్ చేశానంటే.. సీక్రెట్ చెప్పిన పాక్ పేసర్

విక్రమ్ ‘కోబ్రా’ కొత్త లుక్ చూశారా..? వామ్మో ఇలా ఉన్నాడేంటి..!

ఆ సినిమా అర్ధంతరంగా తప్పుకున్న రవితేజ.. కారణం ఏంటంటే?

చిన్నారి ఫ్యాన్‌‌కు బన్నీ సర్‌ప్రైజ్ గిఫ్ట్

పాదయాత్రలోనే నిర్ణయం తీసుకున్నా: సీఎం జగన్

యాలకుల టీ వల్ల కలిగే ప్రయోజనాలు వింటే షాక్ అవ్వాల్సిందే?

12 ఏళ్ల బుడ్డోడు.. గిన్నీస్ రికార్డు కొట్టాడు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>