PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ponnam-prabhaker3d5921ae-1faa-463f-a47b-45af449f7252-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ponnam-prabhaker3d5921ae-1faa-463f-a47b-45af449f7252-415x250-IndiaHerald.jpgహైదరాబాదులో రోహింగ్యాలు పెద్ద సంఖ్యలో ఉన్నారంటూ బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఫైరయ్యారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్. హైదరాబాదులో రోహింగ్యాలు ఉన్నారనే విషయం కిషన్ రెడ్డికి జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందే గుర్కొచ్చిందా? అని ప్రశ్నించారు. సొంత నియోజకవర్గంలో రోహింగ్యాలు ఉంటే ఇంత కాలం ఏం చేస్తున్నారని నిలదీశారు.ponnam prabhaker;modi;kcr;prabhakar;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;g kishan reddy;congress;chintamaneni prabhakar;cbi;tpcc;ponnam prabhakar;letter;central government;nijam;ponnam prabhakar goud;parakala prabhakar;reddy;partyరోహింగ్యాలను కిషన్ రెడ్డి ఎందుకు ఏరి వేయడం లేదు!రోహింగ్యాలను కిషన్ రెడ్డి ఎందుకు ఏరి వేయడం లేదు!ponnam prabhaker;modi;kcr;prabhakar;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;g kishan reddy;congress;chintamaneni prabhakar;cbi;tpcc;ponnam prabhakar;letter;central government;nijam;ponnam prabhakar goud;parakala prabhakar;reddy;partyFri, 25 Dec 2020 19:18:21 GMTటీఆర్ఎస్ సర్కార్ , కేసీఆర్ తీరుపై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్న కాంగ్రెస్.. అదే సమయంలో తెలంగాణలో దూకుడు పెంచిన బీజేపీని టార్గెట్ చేస్తోంది. మోడీ సర్కార్ పని తీరుపైనా ఘాటుగా స్పందిస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. హైదరాబాదులో రోహింగ్యాలు పెద్ద సంఖ్యలో ఉన్నారంటూ బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఫైరయ్యారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్. హైదరాబాదులో రోహింగ్యాలు ఉన్నారనే విషయం కిషన్ రెడ్డికి జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందే గుర్కొచ్చిందా? అని ప్రశ్నించారు. సొంత నియోజకవర్గంలో రోహింగ్యాలు ఉంటే ఇంత కాలం ఏం చేస్తున్నారని నిలదీశారు.


            ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన పొన్నం.. కాంగ్రెస్ ను బలహీన పరిచేందుకు బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న కేసీఆర్ ఢిల్లీకి వచ్చినప్పుడు రైతులను ఎందుకు కలవలేదని ప్రశ్నించారు పొన్నం. నిజంగా కేసీఆర్ రైతుల పక్షపాతి అయితే... టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి ఢిల్లీలో ధర్నా చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ అవినీతి గురించి మాట్లాడుతున్న బీజేపీ నేతలు... సీబీఐ చేత విచారణ ఎందుకు చేయించలేదని ప్రశ్నించారు. బీజేపీకి దమ్ముంటే కేసీఆర్ పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.


                  తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక కోసమే పొన్నం ప్రభాకర్ ను పార్టీ హైకమాండ్ ఢిల్లీకి పిలిపించినట్లు తెలుస్తోంది. టీపీసీసీ ఎంపికతో పాటు తెలంగాణలో భవిష్యతులో చేపట్టబోయే కార్యక్రమాల గురించి హైకమాండ్.. తెలంగాణ నేతలతో చర్చిస్తున్నట్లు చెబుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు రెండు పార్టీల కుమ్మక్కు రాజకీయాలను జనంలోకి తీసుకెళ్లాలని తెలంగాణ నేతలు నిర్ణయించినట్లు సమాచారం.





జ‌గ‌న్ గెలిచాడు.. ఎన్నిక‌లు కాదు.. మ‌న‌సులు..!

ఆ మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీలను ఎలా అవుట్ చేశానంటే.. సీక్రెట్ చెప్పిన పాక్ పేసర్

విక్రమ్ ‘కోబ్రా’ కొత్త లుక్ చూశారా..? వామ్మో ఇలా ఉన్నాడేంటి..!

ఆ సినిమా అర్ధంతరంగా తప్పుకున్న రవితేజ.. కారణం ఏంటంటే?

చిన్నారి ఫ్యాన్‌‌కు బన్నీ సర్‌ప్రైజ్ గిఫ్ట్

పాదయాత్రలోనే నిర్ణయం తీసుకున్నా: సీఎం జగన్

యాలకుల టీ వల్ల కలిగే ప్రయోజనాలు వింటే షాక్ అవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>