PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/precautions-before-new-type-of-virus-attack08f22e23-6e01-4e99-8784-687eb9a02aaf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/precautions-before-new-type-of-virus-attack08f22e23-6e01-4e99-8784-687eb9a02aaf-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... మళ్ళీ యూకేలో కొత్త కరోనా వైరస్ స్టార్ట్ అయ్యింది. కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ ఖంగారు పుట్టిస్తున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఈ కొత్త కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ విధానాన్ని అవలంబిస్తున్నట్లు తెలంగాణా ప్రజారోగ్య కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. ‘‘యూకే నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించి, వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నాం. డిసెంబర్ 9 నుంచి ఇప్పటి వరకు 1200 మంది యూకే నుంచిcarona-virus;hyderabad;india;warangal;telangana;district;smart phone;nalgonda;december;letter;medchal;ranga reddy;sangareddy;siddipet;mancherial;jagtial;coronavirusయూకే కరోనా వైరస్ అరికట్టేందుకు సరికొత్త విధానం....యూకే కరోనా వైరస్ అరికట్టేందుకు సరికొత్త విధానం....carona-virus;hyderabad;india;warangal;telangana;district;smart phone;nalgonda;december;letter;medchal;ranga reddy;sangareddy;siddipet;mancherial;jagtial;coronavirusFri, 25 Dec 2020 20:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... మళ్ళీ యూకేలో కొత్త కరోనా వైరస్ స్టార్ట్ అయ్యింది. కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ ఖంగారు పుట్టిస్తున్న  నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఈ కొత్త కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ విధానాన్ని అవలంబిస్తున్నట్లు తెలంగాణా ప్రజారోగ్య  కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. ‘‘యూకే నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించి, వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నాం. డిసెంబర్ 9 నుంచి ఇప్పటి వరకు 1200 మంది యూకే నుంచి తెలంగాణకు వచ్చారు. వీరిలో 926 మందిని గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించాం. ఇప్పటివరకు ఫలితాలు వచ్చిన వారిలో 16 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.

పాజిటివ్ వచ్చిన వారిలో హైదరాబాద్ నుంచి నలుగురు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుంచి నలుగురు, జగిత్యాల జిల్లా కు చెందిన ఇద్దరు, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ అర్బన్ జిల్లా నుంచి ఒక్కొక్కరు పాజిటివ్ గా ఉన్నట్లు ఫలితాలు వచ్చాయి.16 మందిని వివిధ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డు లో ఉంచాం. 16 మందికి 76 మందికి అతిసన్నిహితంగా ఉన్న వారిని గుర్తించాం, వారిని క్వారంటైన్‌లో ఉంచి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నాం. 16 మందిలో ఉన్న వైరస్ జీనోమ్ సీక్వెన్స్ తెలుసుకోవడానికి సీసీఎంబీకి పంపించాం. మరో రెండు రోజుల్లో ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం.కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో తెలంగాణ రాష్ట్రం పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది.

ప్రభుత్వ చర్యలు, ప్రజల సహకారం వల్ల వైరస్ వ్యాప్తి, మరణాల సంఖ్యను అదుపులో ఉంచగలిగాం. మున్ముందు కూడా ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కొత్త రకం వైరస్‌తో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కానీ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మాస్క్ తప్పని సరిగా వాడండి, భౌతిక దూరం పాటించండి, చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోండి.డిసెంబర్ 9 తరువాత రాష్ట్రానికి నేరుగా యూకే నుంచి వచ్చిన వారు లేదా యూకే గుండా ప్రయాణించి వచ్చిన వారు దయచేసి వారి వివరాలను 040-24651119 నంబర్ కి ఫోన్ చేసి లేదా 9154170960 నంబర్‌కి వాట్స్‌ఆప్ ద్వారా అందిచాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సిబ్బంది వారి ఇంటికి వెళ్ళి వైద్య పరీక్షలు చేస్తారు.’’ అని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు.ఇక ఇలాంటి మరెన్నో కరోనా అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి.


జ‌గ‌న్ గెలిచాడు.. ఎన్నిక‌లు కాదు.. మ‌న‌సులు..!

ఆ మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీలను ఎలా అవుట్ చేశానంటే.. సీక్రెట్ చెప్పిన పాక్ పేసర్

విక్రమ్ ‘కోబ్రా’ కొత్త లుక్ చూశారా..? వామ్మో ఇలా ఉన్నాడేంటి..!

ఆ సినిమా అర్ధంతరంగా తప్పుకున్న రవితేజ.. కారణం ఏంటంటే?

చిన్నారి ఫ్యాన్‌‌కు బన్నీ సర్‌ప్రైజ్ గిఫ్ట్

పాదయాత్రలోనే నిర్ణయం తీసుకున్నా: సీఎం జగన్

యాలకుల టీ వల్ల కలిగే ప్రయోజనాలు వింటే షాక్ అవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>