PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/new-covid-virus-very-danzer-says-london-researche0bb4c92-1bb2-4726-8c8a-1478c8227cba-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/new-covid-virus-very-danzer-says-london-researche0bb4c92-1bb2-4726-8c8a-1478c8227cba-415x250-IndiaHerald.jpgప్రపంచ దేశాల్ని హడలెత్తిస్తున్నకొత్త కరోనా వైరస్ గురించి భయంకరమైన విషయాలు కొన్ని వెలుగులోకి వచ్చాయి. వచ్చే ఏడాది కొత్త కరోనా వైరస్ వల్ల భారీగా ప్రాణ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ రీసెర్చ్ తెలిపింది.covid new virus;india;london;school;central government;coronavirusకొత్త కరోనా వైరస్ చాలా డేంజర్!కొత్త కరోనా వైరస్ చాలా డేంజర్!covid new virus;india;london;school;central government;coronavirusFri, 25 Dec 2020 09:13:49 GMTకరోనా వైరస్ లు మరింత ఆందోళమ కల్గిస్తున్నాయి. తాాజాగా ప్రపంచ దేశాల్ని హడలెత్తిస్తున్నకొత్త కరోనా వైరస్ గురించి భయంకరమైన విషయాలు కొన్ని వెలుగులోకి వచ్చాయి. వచ్చే ఏడాది కొత్త కరోనా వైరస్ వల్ల భారీగా ప్రాణ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ రీసెర్చ్ తెలిపింది.

      లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ రీసెర్చ్ ప్రకారం ఇతర వైరస్‌ల కంటే కొత్త కరోనా వైరస్ 56 శాతం వేగంగా వ్యాపిస్తున్నట్లు తేలింది. అనారోగ్యానికి గురికావడం, ఆస్పత్రిపాలవ్వడం వల్ల ఎక్కువ మరణాల సంఖ్య నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఇది ఎక్కువ లేదా తక్కువ తీవ్రమైన వ్యాధికి దారితీస్తుందనడానికి స్పష్టమైన ఆధారాలు వెలుగులోకి రాలేదని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ రీసెర్చ్ సైంటిస్ట్ బృందం వెల్లడించింది. కొద్దిరోజుల క్రితం యూకే ప్రభుత్వం సైతం కరోనా వైరస్ ఇతర వైరస్‌ల కంటే 70శాతం అంటువ్యాధిలా వ్యాపిస్తుందని చెప్పింది. ఇది దాదాపు రెండుడజన్ల జన్యువుల్ని కలిగి ఉందని, ఇది కరోనా వైరస్ తయారుచేసిన ప్రోటీన్లను ప్రభావితం చేస్తుందని యూకే చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్యాట్రిక్ వాలెన్స్ వెల్లడించారు.

మరోవైపు త్వరలోనే ఇండియాలో కరోనా టీకా అందుబాటులోకి రాబోతుంది. అత్యవసర వినియోగం కింద తమ వ్యాక్సిన్‌కు అనుమతినివ్వాలని కోరడంతో.. టీకా రక్షణ, భద్రతకు సంబంధించి భారత వైద్యాధికారులు ఆస్ట్రాజెనెకా ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నారని, వచ్చేవారం ఈ టీకాకు అత్యవసర అనుమతులు రావొచ్చని చెబుతున్నారు.  ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు కేంద్రం పచ్చజెండా ఊపిందని , అత్యవసర వినియోగానికి వారంలో అనుమతి రానుందని తెలుస్తోంది.  వచ్చే వారమే భారత్ లో కరోనా టీకా అందుబాటులోకి రానుందని కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి.  




మహేష్ ,పవన్ లను వెనక్కి నెట్టేసిన ఆ క్రేజీ హీరో ఎవరు...!?

ఈ రోజుతో జగన్ సూపర్ హిట్టే ?

చికెన్ బిర్యానీ తెగ తినేశారు

టీడీపీ నేతల పిచ్చి ముడిపోయింది.. చంద్రబాబు సీఎం అవుతాడంటా..?

కొత్త వైరస్ తో ప్రజల్లో భయం భయం...!

టీంఇండియాను మా వాళ్లు ఊదేస్తారు.. వార్న్ వార్నింగ్

మెగా హీరో సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>